వార్ 2 వెర్సెస్ కూలీ. హైప్ ఎలా ఉంది..?

War 2 vs Coolie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. నార్త్ స్టార్ హృతిక్ రోషన్, సౌత్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ 2. ఈ రెండు భారీ, క్రేజీ సినిమాలు ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. లాస్ట్ మినిట్ లో ఎవరో ఒకరు తగ్గుతారు అనుకుంటే.. ఎవరూ తగ్గడం లేదు.. ఆఖరికి ఆగష్టు 14న ఈ రెండు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి హైప్ ఎక్కువ ఉంది..? ఏ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించే ఛాన్స్ ఉంది..?

ఈ రెండు క్రేజీ సినిమాల్లో ప్రమోషన్స్ లో ముందున్న సినిమా కూలీ. ఓ వైపు లోకేష్‌ కనకరాజ్.. మరో వైపు నాగార్జున ఆ మధ్య ఇచ్చిన ఇంటర్ వ్యూలు సినిమా పై అమాంతం అంచనాలు పెంచేశాయి. ఈ విషయాన్ని స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపెట్టడం విశేషం. రిలీజ్ కి పది రోజులు మాత్రమే ఉండడంతో కూలీ మరింత దూకుడుగా దూసుకెళుతుంది. తమిళనాడులోనే కాదు.. తెలుగులో కూడా ప్రమోషన్స్ పెంచారు. నాగార్జున, లోకేష్‌ కనకరాజ్, కూలీ టీమ్ మెంబర్స్ మీడియా ముందుకు వచ్చి కూలీ విశేషాలు తెలియచేశారు. War 2 vs Coolie.

కూలీ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ ట్రైలర్ లో ఒక్కో పాత్రను పరిచయం చేశారు. కథను రివీల్ చేయకపోయినా.. సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చారు. భాషా సినిమాను లోకేష్‌ కనకరాజ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక నాగార్జున అయితే.. వంద భాషాలు చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో.. ఒక్క కూలీని చూస్తే అలాంటి ఫీలింగ్ కలుగుతుందని చెప్పి మరింతగా హైప్ పెంచేశారు. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో ఎంత కలెక్ట్ చేస్తుందనే ఆసక్తి ఏర్పడింది.

ఇక వార్ 2 విషయానికి వస్తే.. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ అంతగా బజ్ క్రియేట్ చేయలేదు అనేది వాస్తవం. బాలీవుడ్ లో కూడా దీనికి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే.. ఇక్కడ మాస్ హీరో ఎన్టీఆర్ ఉండడంతో వార్ 2 కు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి అనేది వాస్తవం. కూలీ ప్రమోషన్స్ లో దూసుకెళుతుంటే.. వార్ 2 ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. పది రోజులే టైమ్ ఉంది. బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయాలి.. తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేయాలంటే ఈపాటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసుండాలి. ఓవర్ సీస్ లో కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ లో 1 మిలియన్ మార్క్ కు చేరుకుంది. వార్ 2 ఇంకా ఊపందుకోలేదు. కూలీ మూవీ వార్ 2 కన్నా అన్ని విషయాల్లో ముందు ఉంది. మరి.. వార్ 2 ఏం చేయనుందో.. ఎలా హైప్ ను పెంచనుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/what-happened-behind-charan-and-gowtham-tinnanuris-project/