
Naga Chaitanya’s next movie: అక్కినేని నాగచైతన్య తండేల్ సక్సెస్ తో మాంచి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా 100 కోట్ల క్లోబ్ లో చేరి.. చైతూకు మాంచి జోష్ ఇచ్చింది. ప్రస్తుతం కార్తీక్ దండుతో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ మూవీ తర్వాత చైతూ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ బోయపాటితో చైతూ సినిమా అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్ అప్ డేట్ ఏంటి..?
నాగచైతన్య తండేల్ సినిమా చేస్తున్న టైమ్ లో.. బోయపాటితో సినిమా అంటూ ప్రచారం ఊపందుకుంది. స్వయంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. నాగచైతన్యతో మాస్ సినిమా చేయాలని వుందన్నారు. ఆతర్వాత గీతా ఆర్ట్స్ లో బోయపాటి సినిమా చేయాలి.. ఆ సినిమా ఇదే అని.. చైతూ కోసం మాస్ స్టోరీ రెడీ చేశాడని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఇటీవల బోయపాటి నాగచైతన్యకు మాస్ స్టోరీ చెప్పాడట. ఈ స్టోరీ లైన్ విని బాగుందని చెప్పాడని.. ఇప్పుడు బోయపాటి ఫుల్ స్టోరీ రెడీ చేసి.. మెప్పిస్తే.. ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. నాగచైతన్య.. శివ నిర్వాణతో ఓ సినిమా చేయాలి. ఖుషి సినిమా రిలీజ్ తర్వాత నుంచి శివ నిర్వాణ చైతన్యతో సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. చైతూ – శివ నిర్వాణ కాంబినేషన్లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాలి. ఈ సినిమాకి సంబంధించి వర్క్ జరుగుతూనే ఉందని సమాచారం. తండేల్ నాగచైతన్య 23వ సినిమా.. ప్రస్తుతం కార్తీక్ దండుతో 24వ సినిమా చేస్తున్నాడు. ఇక 25వ సినిమా చేయాల్సివుంది. ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేలా ప్లానింగ్ జరుగుతుందని తెలిసింది. Naga Chaitanya’s next movie.
ఇప్పటి వరకు చైతన్య 25వ సినిమాను శివ నిర్వాణతో చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ సినిమాకి ఓకే చెప్పేసాడని.. ఈ ఇయర్ లోనే షూటింగ్ స్టార్ట్ కానుందని న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పుడు బోయపాటితో సినిమా గురించి వార్తలు రావడంతో ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. శివ నిర్వాణతో సినిమా కంటే ముందుగా బోయపాటితో సినిమా చేస్తారా..? లేక శివ నిర్వాణతో ముందుగా సినిమా చేసి ఆతర్వాత బోయపాటితో సినిమా చేస్తారా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పచ్చు. ఒకటి ముందు ఒకటి వెనుక కాకుండా.. రెండు సినిమాలను ఒకేసారా చేస్తారా..? మొత్తానికి ఈ కాంబో మూవీ గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.