
Hrithik Roshan Appreciate NTR: సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్.. వీరిద్దరి కాంబోలో రూపొందిన భారీ, క్రేజీ పాన్ ఇండియా మూవీ వార్ 2. బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 మూవీ ఆగష్టు 14న రిలీజ్ కి రెడీ అయ్యింది. కూలీతో పోలిస్తే.. ప్రమోషన్స్ లో వెనకబడిందనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు రంగంలోకి హృతిక్ రోషన్ దిగారు. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.. దటీజ్ ఎన్టీఆర్ అని చెప్పి అందరి మనసులు దోచుకున్నాడు. ఇంతకీ.. ఎన్టీఆర్ గురించి హృతిక్ ఏం చెప్పాడు..?
మన హీరోల గొప్పదనం ఏంటి అనేది మనకు తెలుసు. మనం మాట్లాడుకోవడం మామూలే. అదే.. మన హీరో గొప్పదనం గురించి బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ చెబితే.. అంతకంటే ఇంకేం కావాలి. ఫ్యాన్స్ అది మాంచి కిక్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హృతిక్ రోషన్.. మన జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించేసరికి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎన్టీఆర్‌ను అందరూ ఏకసంతాగ్రాహి అని.. డైలాగ్ అయినా, ఒక డ్యాన్స్ మూమెంట్ అయినా.. పెద్దగా ప్రాక్టీస్ చేయకుండానే ఈజీగా లాగించేస్తాడని టాలీవుడ్లో తనతో కలిసి పని చేసిన వాళ్లందరూ చెబుతుంటారు.
ఇప్పుడు ఇదే మాటను బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చెప్పాడు. వార్-2 లో తారక్‌తో కలిసి హృతిక్ పని చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్లలో వీళ్లిద్దరూ ఉంటారు. ఇలాంటి టాప్ డ్యాన్సర్లు కలిసి ఒక పాట కోసం స్టెప్పులు వేశారు. ఈ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని.. ఇంకా చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్ నాటు నాటు సాంగ్ ఎలా అయితే పాపులర్ అయ్యిందో ఈ సాంగ్ కూడా అదే రేంజ్ లో మెప్పించేలా.. ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. ఈ సాంగ్ ను ఎంతో కేర్ తీసుకుని షూట్ చేశారు. ఆడియన్స్ కి ఓ ట్రీట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. Hrithik Roshan Appreciate NTR.
ఈ సాంగ్ గురించి హృతిక్ స్పందిస్తూ… తాను ఇప్పటి వరకు పని చేసిన కో స్టార్స్ లో అసలు రిహార్సలే లేకుండా స్పెప్పులేసే ఏకైక హీరో తారక్ అని చెప్పాడు. అతను ఏమాత్రం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు.. డ్యాన్స్ అనేది ఇన్ బిల్ట్ గా అతని బాడీలో ఉందని చెప్పాడు. తారక్ లో ఈ టాలెంట్ చూసి తను ఆశ్చర్యపోయానని.. తనతో కలిసి వర్క్ చేయడాన్ని ఆస్వాదించినట్టుగా హృతిక్ రోషన్ తెలియచేశాడు. హృతిక్ స్టేట్మెంట్స్ తో ఈ సాంగ్ పై మరింతగా అంచనాలు పెంచేశాడు. ఆగష్టు 14న వార్ 2 భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయ్యింది. మరి.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఏ రేంజ్ లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/lokesh-kanagaraj-want-to-do-a-big-multi-starrer-in-telugu/