
Samantha Upcoming Crazy Projects: సమంత.. ఒకప్పుడు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చింది. సమంత క్రేజీ మూవీలో నటించనుందని ప్రచారం అయితే జరిగింది కానీ.. ఇంత వరకు సామ్ కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వలేదు. ఇటీవల సమంత నటించనున్న ప్రాజెక్టులు అంటూ రెండు సినిమాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఆ రెండు ప్రాజెక్టుల గురించి కూడా ఎలాంటి సమాచారం. లేదు. ఇప్పుడు కొత్తగా సమంత చేయనున్న ప్రాజెక్ట్ ఒకటి వినిపిస్తుంది. ఇంతకీ.. సమంత చేయనున్నట్టుగా ప్రచారం జరిగిన రెండు సినిమాలు ఏంటి..? కొత్తగా వార్తల్లోకి వచ్చిన సామ్ సినిమా ఏంటి..?
సమంత.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందే సినిమాలో నటించనుందని ప్రచారం జరిగింది. అట్లీ డైరెక్షన్ లో ఆల్రెడీ సమంత నటించడంతో ఈసారి బన్నీ పక్కన నటించడం ఖాయమని టాక్ బలంగా వినిపించింది. త్వరలోనే అనౌన్స్ చేస్తారనుకుంటే.. దీపికా పడుకునే పేరు ప్రకటించారు. జాన్వీ కపూర్ పేరు కూడా కన్ ఫర్మ్ అని.. అలాగే మృణాల్ ఠాగూర్ కూడా ఈ మూవీలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి కానీ.. సమంత గురించి మాత్రం ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు.
ఇక రెండో ప్రాజెక్ట్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వచ్చింది. గతంలో చరణ్, సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో ఫిక్స్ అయ్యిందని న్యూస్ వైరల్ అయ్యింది కానీ.. అపిషియల్ గా ఎలాంటి అప్ డేట్ మాత్రం రాలేదు. మరి.. కొత్తగా వినిపిస్తున్న సినిమా ఏంటంటే.. ఖైదీ 2. కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన సినిమా ఖైదీ. ఈ మూవీ అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. కార్తీ కెరీర్ లోనే మరచిపోలేని సినిమాగా నిలిచింది. Samantha Upcoming Crazy Projects
ఈ సినిమాలో సమంత నటించనున్నట్టుగా కోలీవుడ్ టాక్. ఈసారి ఖైదీ 2 సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నాడట. లోకేష్ కనకరాజ్ కు క్రేజ్ పెరగడంతో ఖైదీ 2 ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూలీ తర్వాత ఖైదీ 2 చేయాలని ఫిక్స్ అయ్యాడట. దీనికి స్టోరీ ఎప్పుడో రెడీ అయ్యిందట. అయితే.. ఖైదీ 2 అంటే సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్. ఈ మూవీలో కార్తీ పేరు ఢిల్లీ. ఆ పాత్ర జైలు నుంచి విడుదలైన రోజు ఏం జరిగిందన్నదే ఖైదీ కథ. అసలు జైలుకి ఎందుకు వెళ్లాడు? అనే పాయింట్ తో ఖైదీ 2 మొదలు కానుంది. ఇందులో సమంత నటించబోతుందని బలంగా టాక్ వినిపిస్తుంది. మరి.. ఈ సినిమాతో సమంత మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/will-nagarjuna-continue-as-a-villain-what-is-the-fans-opinion/