
Nagarjuna as a villain; టాలీవుడ్ కింగ్ నాగార్జున నలభై సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ ఫస్ట్ టైమ్ విలన్ గా నటించడం విశేషం. కూలీ సినిమాలో నాగ్ విలన్ అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్ కాకుండానే.. నాగ్ విలన్ క్యారెక్టరే సినిమాకి హైలెట్ అనే న్యూస్ వైరల్ అయ్యింది. అయితే.. నాగ్ ఫ్యాన్స్ లో మాత్రం టెన్షన్ స్టార్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. నాగార్జున అభిమానుల టెన్షన్ దేనికి…? అసలు ఏం జరిగింది..?
నాగార్జున నా సామి రంగ అనే సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఆతర్వాత హీరోగా సినిమా అనౌన్స్ చేస్తారని చూస్తుంటే.. ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే.. కూలీలో విలన్ పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు రావడంతో నాగ్ ఇక నుంచి విలన్ గా కంటిన్యూ చేస్తారా అనే టెన్షన్ అభిమానుల్లో స్టార్ట్ అయ్యింది. అభిమానులు కోరుకుంటుంది ఏంటంటే.. నాగార్జున హీరోగా ఇంకా సినిమాలు చేయాలని. విలన్ గా చేస్తే చూడాలి అనుకోవడం లేదు. కూలీలో విలన్ గా ట్రై చేశారు ఓకే కానీ.. ఇక విలన్ వేషాలు వద్దు అంటున్నారు.
మరి.. నాగార్జున విలన్ గా కంటిన్యూ చేస్తారా అంటే చేయకపోవచ్చు. కారణం ఏంటంటే.. ఇటీవల నాగ్ ఇచ్చిన ఇంటర్ వ్యూలో.. తన మనవళ్లకు ఈ సినిమాను చూపించను అన్నారు. అంటే తనను మంచివాడుగా.. మంచి పాత్రలతోనే గుర్తుంచుకోవాలి అనుకుంటున్నాడు నాగ్. అందుచేత నాగ్ ఇక నెగిటివ్ క్యారెక్టర్ తో సినిమా చేయకపోవచ్చు. మరి.. నాగ్ నెక్ట్స్ ఏంటి అంటే.. 100వ సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీని అనౌన్స్ చేయనున్నారు. Nagarjuna as a villain.
ఈ భారీ, క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నారు. చాలా కథలు విని ఈ కథను ఫైనల్ చేశారని తెలిసింది. ఎప్పటి నుంచో 100వ సినిమా ప్రత్యేకంగా ఉండాలని.. నాగ్ తపిస్తున్నారు. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. నాగ్ పుట్టినరోజైన ఆగష్టు 29న ఈ సినిమాని ప్రకటించనున్నారు. ఆతర్వాత సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ లో కూడా సినిమాలు చేయనున్నారని సమాచారం.
Also Read: https://www.mega9tv.com/cinema/the-troubles-that-are-haunting-the-movie-rajasaab-release-date/