నిజమైన జపాన్ వంగా బాబా కాలజ్ఞానం..!

Earthquake in Russia 8.8 magnitude recorded: సరిగ్గా నెల రోజులు క్రితం చెప్పిందే జరిగింది. జపాన్ లో న్యూ వంగా బాబాగా పలిచే మాంగా ఆర్టిస్ట్ రియో టాట్సుకి కాలజ్ఞానం నిజమైంది. జూలై నెలలో భారీ ప్రళయం రాబోతోందని రియో టాట్సుకు చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. రష్యా తూర్పు తీరం భారీ భూకంపం సంభవించింది. ఇది ఇటీవలి కాలంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా గుర్తించబడింది. దీని ప్రభావంతో ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి, రష్యా, జపాన్, హవాయ్‌తో పాటు అనేక దేశాలను సునామీ అలలు తాకాయి. అసలు ఈ భూకంపం ఎంత నష్టాన్ని కలిగించింది..? సునామీ వల్ల ఏం జరిగింది..? అసలు వంగా బాగాకు ఈ భూకంపం గురించి ఎలా తెలిసింది..?

రష్యా తీరాన్ని భూకంపం వణికించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో అత్యంత పెద్ద భూకంపంగా లెక్కకట్టారు. రష్యా తూర్పు తీరంలోని కమ్‌చట్కా ద్వీపకల్పం సమీపంలో, సముద్రంలో 20 కిలోమీటర్ల లోతులో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ భూకంపం ఆధునిక చరిత్రలో ఆరవ అతిపెద్ద భూకంపంగా నమోదైంది, 2011లో జపాన్‌లో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం తర్వాత ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ భూకంపం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ప్రాంతంలో సంభవించింది. ఈ భూకంపం తర్వాత 6.3 నుంచి 6.9 తీవ్రతతో అనేక ఆఫ్టర్‌షాక్‌లు కూడా నమోదయ్యాయి.

అయితే ఈ విపత్తు వస్తుందని వంగా బాబాగా పిలవబడే జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్ట్ రియో టాట్సుకి ముందే చెప్పింది. ఈ ఏడాది జూలై నెలలో జపాన్‌లో భారీ విపత్తు సంభవిస్తుందని రియో ముందే ఊహించింది. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో భూకంపం సంభవించి, 2011 కంటే మూడు రెట్లు పెద్ద సునామీ వస్తుందని తెలిపింది. జూలై 5న ఇలా జరుగుతుందని చెప్పినా.. కొద్ది రోజులు ఆలస్యంగా.., జూలై 30న సంభవించడంతో అమె కాలజ్ఞానంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.. గతంలో 1995 కోబ్ భూకంపం, 2011లో జపాన్ భూకంపం, సునామీ, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం, కోవిడ్-19 వంటి ఘటనలను సరిగ్గా ఊహించినందున, రియో టాట్సు జోస్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ భూకంపం కూడా అమె చెప్పినట్టే వచ్చిందని కొందరు నమ్ముతున్నారు. Earthquake in Russia 8.8 magnitude recorded.

రష్యా భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రం అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యా, జపాన్, హవాయ్, అలాస్కా, ఈక్వడార్‌లలో 3 మీటర్లకు పైగా ఎత్తైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని యుఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. చిలీ, కోస్టారికా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, సోలమన్ దీవులు, న్యూజిలాండ్, టోంగా, తైవాన్, కొలంబియాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్‌లో 19 లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి, అలాగే హవాయ్‌లో కూడా భారీ సునామీ హెచ్చరిక జారీ చేయబడ్డాయి. హవాయ్‌లో సునామీ హెచ్చరికల నేపథ్యంలో తక్షణం తీర ప్రాంతాలన ఖాళీ చేయాలని.. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో సైరన్ల ద్వారా స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. హార్బర్ నుంచి కమర్షియల్ షిప్స్ వెళ్లిపోవాలని యుఎస్ కోస్ట్ గార్డ్ ఆదేశించింది. హవాయ్‌లోని మౌయి విమానాశ్రయంలో విమానాలను రద్దు చేశారు. సునామీ హెచ్చరికలతో హవాయ్ లోని తీర ప్రాంతాల్లోని ప్రజలు పరుగులు పెట్టారు. ఒకేసారి కార్లపై పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న వారు కాలినడకన 100 అడుగల ఎత్తు ఉండే ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సునామీ అలల ప్రభావంతో జపాన్ తీరానికి భారీ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. ఈ సునామీ అలలు సముద్ర జీవుల నావిగేషన్ సిస్టమ్స్ గందరగోళానికి గురిచేశాయని నిపుణులు భావిస్తున్నారు. జపాన్ని తీరంలో 1.3 మీటర్ల ఎత్తైన అలలు తాకినప్పుడు, స్పెర్మ్ తిమింగలాలు పైలట్ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చాయి. స్థానికులు ఈ తిమింగలాలను సముద్రంలోకి తిరిగి పంపేందుకు ప్రయత్నించారు

భూకంపం రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పాన్ని అతలాకుతలం చేసింది. బలమైన ప్రకంపనలు ఆ ప్రాంతాన్ని కుదిపేశాయి. భవనాలు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. శక్తిమంతమైన భూప్రకంపనలు సంభవించిన సమయంలో కామ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆస్పత్రి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జరీ జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించింది. ప్రకంపనల ధాటికి ఆ భవనం మొత్తం ఊగిపోయింది. అయితే.. వైద్యులు ఏ మాత్రం భయపడకుండా.. ప్రశాంతంగా ఉండి ఆ సర్జరీని పూర్తి చేశారు. ఆపరేషన్‌ థియేటర్‌లోని స్ట్రెచర్‌ను ఊగకుండా సిబ్బంది గట్టిగా పట్టుకోగా.. వైద్యులు సర్జరీని కొనసాగించారు. అటు భూకంప కేంద్రం సమీపంలోని కామ్చాట్కా ద్వీపకల్పంలోని ఓడరేవులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సునామీ అలల కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రష్యాలోని కమ్చాట్కా ద్వీపకల్పంలోని ఒక కిండర్‌గార్టెన్ భవనం ధ్వంసమైంది. సునామీ అలలు ఓ ఓడరేవు, చేపల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ముంచెత్తాయి. 3-4 మీటర్ల ఎత్తైన అలలు ఈ ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

పసిఫిక్‌ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటివరకూ ప్రపంచాన్ని వణికించిన 10 అతి భారీ భూకంపాల్లో ఇది ఒకటిగా చేరింది. చిలీలో 1960లో అతి భారీ భూకంపం సంభవించింది. బయోబియో ప్రాంతంలో 9.5 తీవ్రతతో కూడిన ఈ భూకంపాన్ని గ్రేట్‌ చిలీ భూకంపం అని పిలుస్తారు. ఇప్పటి వరకూ సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంపం ధాటికి దాదాపు 1,655 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అమెరికాలోని అలస్కాలో 1964లో 9.2 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం, దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా 130 మంది మరణించారు. 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా-అండమాన్‌ దీవుల్లో భూ ప్రకంపనలు భారీ సునామీకి దారితీశాయి. 2,80,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో 1.1 మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారు. 2011లో జపాన్‌లోని తోహోకు ప్రాంతంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత సునామీ కారణంగా 15,000 మందికి పైగా మరణించగా.. 1,30,000 మంది నిరాశ్రయులయ్యారు. చిలీలోని బయోబియోలో మరోసారి 2010లో 8.8 తీవ్రతతో కూడిన భూప్రకంపనలు సంభవించాయి. క్విరిహ్యూ నగరం సమీపంలో చోటుచేసుకున్న ప్రకంపనలు 523 మంది ప్రాణాలను తీశాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో 1950లో 8.6 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Also Read: https://www.mega9tv.com/international/public-shooting-incidents-gun-culture-on-the-rise-on-america-thailand-and-israel-newzealand/