ఆ రాజుకు ప్రతి ఏడాది ఓ కొత్త భార్య.!

African King Mswati: ఆ రాజు తన ప్రైవేట్ జెట్‌లో 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు, దాదాపు 100 మంది సేవకులతో అబుదాబిలో ల్యాండ్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.15 మంది భార్యలు, 100 మంది సహాయకులతో ఆఫ్రికన్ రాజు యూఎఈ టూర్.. వీడియో మళ్లీ వైరల్.. అసలు ఏం జరిగిందో తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

సాధారణంగా ఫ్యామిలీ అంటే నలుగురైదుగురు ఉంటారు. మహా అయితే ఓ పది మంది. కానీ, ఆఫ్రికా చివరి చక్రవర్తి , ఎస్వాటిని రాజు మస్వాతి ఫ్యామిలీ ఏకంగా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌నే షేక్ చేసింది. ఆ రాజు తన ప్రైవేట్ జెట్‌లో 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు, దాదాపు 100 మంది సేవకులతో అబుదాబిలో ల్యాండ్ అయ్యాడు. లెపర్డ్-ప్రింట్ ట్రెడిషనల్ డ్రెస్‌లో మస్వాతి కింగ్‌లాగా నడుస్తుంటే, అతని భార్యలు కలర్‌ఫుల్ ఆఫ్రికన్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. ఈ జనం ఎంతమంది ఉన్నారంటే, వాళ్లను కంట్రోల్ చేయడానికి ఏకంగా మూడు టెర్మినల్స్‌ను తాత్కాలికంగా మూసేశారు.

ఏదైనా దేశానికి చెందిన ముఖ్యమైన వ్యక్తులు తమ పొరుగు దేశాన్ని సందర్శించినప్పుడు, వారి రాక గొప్పగా ఉంటుంది. తమ దేశానికి వచ్చిన వ్యక్తిని ఆ దేశ ముఖ్యమైన నాయకులు హృదయపూర్వకంగా స్వాగతించే దృశ్యం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ ఒక ఆఫ్రికన్ రాజు రాక ఈ కారణంగానే వార్తల్లో నిలుస్తుంది . ఆఫ్రికన్ రాజు మస్వాతి తన 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు, 100 మంది సేవకులతో ఒక ప్రైవేట్ జెట్‌లో అబుదాబి విమానాశ్రయంలో దిగారు. ఆయన రాకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఎవరీ మస్వాతి? ఈ మస్వాతి, ఒకప్పుడు స్వాజిలాండ్‌ గా పిలవబడిన ఎస్వాటిని అనే చిన్న దేశానికి కింగ్. రాజు మస్వాతి 1986 నుంచి ఆ దేశాన్ని పాలిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం.. రాజు మస్వాతి వ్యక్తిగత ఆస్తి విలువ దాదాపు ఒక బిలియన్ డాలర్లు పైమాటే. ఆ దేశంలో ఆరోగ్యం, విద్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఇలా ఆ దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశ జనాభాలో దాదాపు 60శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. 2021లో నిరుద్యోగం 23శాతం నుంచి 33.3శాతంకు పెరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదించింది. స్వాజిలాండ్ న్యూస్ ప్రకారం.. రాజు మస్వాతి ఆ దేశంలో నిర్మాణం, పర్యాటకం, వ్యవసాయం, టెలికమ్యూనికేషన్స్, అటవీ రంగాల్లోని పలు కంపెనీల్లో వాటాలు కలిగి ఉన్నాడు. దేశంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రాజు రాజభోగాలపై ఆ దేశంలోనూ, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచంలో ఇప్పుడున్న అతి కొద్దిమంది సంపూర్ణ చక్రవర్తుల లో ఒకడు. ఈ తరహా రాజులు తమ దేశాల్లో చెప్పిందే వేదం, చేసిందే చట్టం. అంతేకాదు, ప్రపంచంలోనే టాప్ రిచెస్ట్ రాయల్స్‌లో ఒకడు. పర్సనల్ వెల్త్ ఏకంగా 8.8 వేల కోట్లుకు పైనే ఉంది. టెలికాం, టూరిజం, అగ్రికల్చర్ లాంటి ఎన్నో ఇండస్ట్రీస్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ల వల్లే ఈ రేంజ్ సంపద వచ్చి చేరింది.

రాజు మస్వతి యూఏఈని వారి దేశ ఆర్థిక ఒప్పందాలను చర్చించడానికి సందర్శించారు. అయితే ప్రస్తుతం ఆ రాజు రాచరిక జీవితం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజు సాంప్రదాయ చిరుతపులి-ముద్రిత వస్త్రాన్ని ధరించి, తన 30 మంది భార్యలతో ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 100 మంది సేవకుల బృందం రాజు, రాణి వార్లను అనుసరిస్తున్నట్లు ఉన్న దృశ్యాలు హైలెట్‌గా మారాయి. ప్రస్తుతం రాజు జీవనశైలిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్వాటిని అని పిలుస్తున్న దేశం ఒకప్పుడు స్వాజిలాండ్ పేరుతో ఆఫ్రికాలో ఉండేది. ఆ దేశ రాజు ఎంస్వాటి కి 30 మంది భార్యలు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆయన తండ్రికి ఏకంగా 125 మంది భార్యలు, 210 మందికి పైగా పిల్లలు, దాదాపు 1,000 మంది మనవరాళ్ళు ఉన్నారు.

కానీ, అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది మాత్రం అతని ట్రావెల్ స్టైల్, గ్రాండ్ ఎంట్రీనే. వైఫ్స్, కిడ్స్, స్టాఫ్‌తో వచ్చిన ఈ భారీ ఎంటోరేజ్/పరివారం వల్ల ఎయిర్‌పోర్ట్‌లో హెవీ సెక్యూరిటీ పెట్టాల్సి వచ్చింది. దీంతో నార్మల్ ఆపరేషన్స్ మొత్తం డిస్టర్బ్ అయ్యాయి. ఈ సీన్ చూసిన నెటిజన్లు వేరే రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. ‘ఇది ఫ్యామిలీ కాదు, ఓ ఊరంతా తరలివచ్చినట్లుందిగా’ అంటూ ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.

ఒకవైపు లగ్జరీ.. మరోవైపు పేదరికం. రాజుగారు ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే, మరోవైపు ఆయన దేశం మాత్రం తీవ్ర సమస్యలతో సతమతమవుతోంది. రిపోర్ట్స్ ప్రకారం ఎస్వాటిని జనాభాలో 60 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువనే ఉన్నారు. కరెంట్, కనీస వైద్యం, చదువు లాంటివి కూడా చాలామందికి అందని కలగానే మిగిలిపోయాయి. దీనికి తోడు, ఏటా జరిగే ‘రీడ్ డ్యాన్స్’ ఫెస్టివల్‌లో రాజు కొత్త భార్యను సెలెక్ట్ చేసుకునే సంప్రదాయంపై కూడా విమర్శలు వస్తున్నాయి. రాజు సంపదకు, ప్రజల కష్టాలకు మధ్య ఉన్న ఈ గ్యాప్ సోషల్ మీడియాలో, స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.

అయితే, రాజుల విలాసవంతమైన జీవితంపై ఆ దేశంలో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు దేశ ప్రజలు దారుణమైన పేదరికంతో, ఆకలితో అల్లాడుతుంటే.. రాజు విలాసవంతమైన జీవితంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు రాజుతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రజలకు కనీసం కరెంట్, తాగునీరు వంటి సౌకర్యాలు లేవు. కానీ, రాజుకు మాత్రం ఈ రాజబోగాలా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క ఆకలితో ప్రజలు చనిపోతుంటే.. రాజు మాత్రం ప్రైవేట్ జెట్లలో షికార్లు కొడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇంట్లో రాజు భార్యలందరికి సేవలు చేసేందుకు, వారి పర్యవేక్షణ చేసేందుకు ఎవరైనా సమన్వయకర్త ఉన్నారా అంటూ ఓ నెటిజన్ చమత్కరిస్తూ కామెంట్ చేశాడు. African King Mswati.

ఎస్వాటినిలో ఈ రాయల్ హంగామాకు, గ్రాండ్ లైఫ్‌స్టైల్‌కు ట్రెండ్ సెట్ చేసిందే మస్వాతి తండ్రి, కింగ్ శోభుజా . ఆయనకు 70 మందికి పైగా భార్యలు ఉండేవారు, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ సంఖ్య 125 వరకు ఉంటుందట. ఈ పెళ్లిళ్ల ద్వారా ఆయనకు 210 మందికి పైగా పిల్లలు, దాదాపు 1,000 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఈ జంబో ఫ్యామిలీతోనే ఇలాంటి భారీ ఫ్యామిలీల లెగసీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అదే ట్రెడిషన్‌ను కొడుకు మస్వాతి కంటిన్యూ చేస్తున్నాడు.