భారతీయులపై అసూయ పడుతోన్న అమెరికన్లు..!

Trump’s conspiracies against India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్‌ను మిత్ర దేశం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ, మరోవైపు భారత అమెరికా అవకాశాలను ఎత్తుకుపోతోందనే అసూయను భయపెడుతున్నారు. పైకి మోదీ కనిపించినప్పుడు దోస్తే మేరా దోస్తే అంటూనే.. భారత్ పై విషం కక్కుతున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఏఐ సమ్మిట్ లో ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులను అమెరికాలోని టెక్ కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని కడుపులోని కుట్రను బయటకు కక్కారు. అసలు ట్రంప్ అలా ఎందుకు అన్నారు..? భారతీయులంటే ట్రంప్ కు ఎందుకంత అసూయ..? అమెరికాన్ల కంటే భారతీయ టెక్ నిపుణులు ఎందుకు బెస్ట్..? అమెరికాలోని చాలా టెక్ కంపెనీల్లో సీఈవోలు భారతీయులే ఉండటం ట్రంప్ కు నచ్చడం లేదా..? అసలు ట్రంప్ మనస్సులో ఏముంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

వాషింగ్టన్‌లో జరిగిన విన్నింగ్ ది ఏఐ రేస్ సమిట్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా టెక్ కంపెనీలు ఇకపై భారత్ నుంచి ఉద్యోగులను నియమించడం, చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించడం మానుకోవాలని గట్టిగా చెప్పారు. ఇలాంటి ఆలోచనలకు ఇక రోజులు ముగిశాయి అని అన్నారు. అమెరికా టెక్ కంపెనీలు దేశంలోని స్వేచ్ఛను వాడుకుని, ఉద్యోగాలను భారత్, చైనా వంటి దేశాలకు ఇస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఏఐ రంగంలో అమెరికా ప్రపంచ ప్రమాణాలను చేరుకోవాలంటే, సిలికాన్ వ్యాలీలో దేశభక్తి, జాతీయ విధేయత అవసరం.. ట్రంప్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చేలా మాట్లాడారు. ఈ సమిట్‌లో ట్రంప్ మూడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లపై సంతకం చేశారు, ఇందులో ఏఐ అభివృద్ధికి వైట్ హౌస్ యాక్షన్ ప్లాన్, అమెరికన్ ఏఐ టెక్నాలజీ ఎగుమతులను ప్రోత్సహించే ఆర్డర్ ఉన్నాయి. Trump’s conspiracies against India.

ట్రంప్.. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి టెక్ దిగ్గజ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కంపెనీలు అమెరికా స్వేచ్ఛను, ఆర్థిక అవకాశాలను వినియోగించుకుని, ఉద్యోగాలను భారత్‌కు, తయారీ యూనిట్లను చైనాకు పంపుతున్నాయన్నారు. ఇలాంటి రాడికల్ గ్లోబలిజానికి అమెరికాలో ఇక చోటు లేదని… అమెరికా టెక్ కంపెనీలు అమెరికన్ల కోసం పూర్తిగా కట్టుబడి ఉండాలని అని ట్రంప్ హెచ్చరించారు. ఈ సంవత్సరం మేలో కూడా యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు ట్రంప్ పరోక్షంగా బెదిరించారు. అమెరికాలో తయారుకాని ఐఫోన్‌లపై 25% టారిఫ్ విధిస్తాం అని చెప్పారు.

హెచ్1బీ వీసా ద్వారా అమెరికాలో పెరుగుతున్న భారతీయ ఐటీ నిపుణుల సంఖ్య, వారి ఆధిపత్యం ట్రంప్ ఆందోళన వెనుక ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. భారతీయ టెక్ నిపుణులు అమెరికా టెక్ రంగంలో కీలక స్థానాలను ఆక్రమిస్తున్నారని, దీనివల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని ట్రంప్ భావిస్తున్నారు. కోవిడ్-19 తర్వాత టెక్ కంపెనీలు లాభాల కోసం అమెరికన్ లోకల్స్ ను వదిలేసి.. విదేశీయులను తక్కువ జీతాలకు పనిలో పెట్టుకుంటున్నాయనే అసంతృప్తి అక్కడ ఉంది. దీనిని అవకాశంగా తీసుకుని అమెరికా ఫస్ట్ విధానం అంటూ ట్రంప్ కంపెనీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. భారతీయులు హెచ్1బీ వీసాల ద్వారా పెద్ద సంఖ్యలో అమెరికాకు వస్తున్నారని, ఇది స్థానిక ఓటర్లలో అసంతృప్తిని పెంచుతోందని గ్రహించిన ట్రంప్.. దీనిని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు చైనాతో ఏఐ రేస్‌లో అమెరికా వెనుకబడకుండా ఉండాలనే ఆందోళన కూడా ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉందంటున్నారు.

అమెరికాలో భారతీయ ఐటీ నిపుణుల సంఖ్య భారీ సంఖ్యలో ఉంది. 2022-23 డేటా ప్రకారం, హెచ్1బీ వీసాలలో 72% కంటే ఎక్కువ భారతీయులకే జారీ అయ్యాయి. టెక్ రంగంలో దాదాపు 47% హై-స్కిల్ వర్కర్ వీసాలు భారతీయులు పొందుతున్నారు. భారతీయులు ఏఐ, డేటా సైన్స్, సైబర్‌సెక్యూరిటీ వంటి రంగాలలో అమెరికా కంపెనీలకు కీలక సేవలను అందిస్తున్నారు. భారతదేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల నుంచి వెళ్లే టెక్ గ్రాడ్యుయేట్స్, ఇంగ్లీష్‌లో సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కీల్స్ కలిగి ఉంటున్నారు. వీరు తక్కువ జీతం ఉన్నా ఉన్నత నాణ్యతతో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటున్నారు. అలాగే గ్లోబల్ వర్క్ కల్చర్‌కు అనుగుణంగా పనిచేసే వైఖరి వంటివి భారతీయులకు ప్రాధాన్యత రావడానికి కారణాలు. అమెరికాలో స్థానిక టాలెంట్ కొరత కూడా ఈ ధోరణిని బలపరిచింది.

అమెరికా టెక్ కంపెనీలు భారతీయ ఐటీ నిపుణులను ఎక్కువగా నియమించడానికి చాలా కారణాలు ఉన్నాయి. భారతదేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ వంటి సంస్థలు టెక్ గ్రాడ్యుయేట్స్‌ను అందిస్తున్నాయి, వీరు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌సెక్యూరిటీ వంటి రంగాలలో అత్యుత్తమ నైపుణ్యం కలిగి ఉన్నారు. భారతీయ ఉద్యోగులు అంతర్జాతీయంగా అత్యుత్తమ కమ్యూనికేషన్ స్కీల్స్ కలిగి ఉంటారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఉత్పాదకతతో, తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో కూడా పనిచేస్తారు. అమెరికాలో ఏఐ, డేటా సైన్స్, సైబర్‌సెక్యూరిటీ వంటి రంగాలలో నిపుణుల కొరత ఉంది, దీనివల్ల కంపెనీలు భారతీయ టాలెంట్‌పై ఆధారపడుతున్నాయి. భారతీయ ఐటీ నిపుణులు అమెరికా టెక్ రంగంలో సమస్యలను తగ్గించడంలో, ఉత్పాదకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే అమెరికా టెక్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. అంతుకే అమెరికా టెక్ రంగంలో భారతీయ సంతతి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుందర్ పిచాయ్ గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓగా, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా, నీల్ మోహన్ యూట్యూబ్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే షాంటనూ నారాయణ్ అడోబ్ సీఈఓగా, అరవింద్ కృష్ణ ఐబీఎం సీఈఓగా, నికేష్ అరోరా పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓగా, జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఇలాంటి వారి జాబితా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. భారత్ కు చెంది వందలాది సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లు, డైరెక్టర్‌లు, ఇంజనీరింగ్ హెడ్‌లు, ప్రొడక్ట్ మేనేజర్‌లు అమెరికా టెక్ కంపెనీలలో కీలక స్థానాల్లో ఉన్నారు. మరికొన్ని సంవత్సరాల్లో అమెరికాలోని అన్ని టెక్ కంపెనీల్లో కీలక పోస్టులలో భారతీయులే ఉంటారని అంచనా. ఇది ట్రంప్ కు ఏ మాత్రం నచ్చడం లేదు.

అమెరికన్లు భారతీయుల స్థాయిలో పనిచేయగలరా?
2030 నాటికి అమెరికా టెక్ రంగంలో 1.4 మిలియన్ ఉద్యోగాలకు నిపుణుల కొరత ఏర్పడనుంది. అమెరికా విద్యా వ్యవస్థలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య తక్కువగా ఉంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌సెక్యూరిటీ వంటి అధునాతన రంగాలలో అవసరమైన నైపుణ్యం స్థానికంగా సరిపోవడం లేదు. భారతీయ ఐటీ నిపుణులు తక్కువ ఖర్చుతో, ఉన్నత నైపుణ్యంతో, గ్లోబల్ వర్క్ కల్చర్‌కు అనుగుణంగా పనిచేయడం వల్ల టెక్ కంపెనీలు వారిపై ఆధారపడుతున్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం ద్వారా స్థానిక ఉద్యోగులకు అవకాశాలు కల్పించాలని వాదిస్తున్నప్పటికీ, ప్రస్తుత పోటీ వాతావరణంలో భారతీయులు అందిస్తున్న నైపుణ్యం, ఉత్పాదకత, ఖర్చు ప్రయోజనం అమెరికా టెక్ కంపెనీలకు కీలకంగా మారాయి. అయితే, అమెరికా విద్యా వ్యవస్థలో స్టెమ్ విద్యను పెంచడం, స్థానిక టాలెంట్‌ను శిక్షణ చేయడం ద్వారా ఈ కొరతను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: https://www.mega9tv.com/international/videos-that-got-trump-into-trouble-epstein-in-trump-wedding-video-epstein-accused-in-sexual-assault-case/