10 రహస్య నిధులు…!

10 Mysterious Secret Treasures: ఈ ప్రపంచంలో ఇప్పుడు కూడా రహస్య మైన నిధుల కోసం వెతికే వ్యక్తులు ఉన్నారు. కొంత మంది ఈ సంపదలు మనల్ని వెంటాడుతాయని చెబుతారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ వాటిని కనుగొనలేదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున వాటిని కనుక్కున్నా సరే వారు రహస్యంగానే మరణించేవారట. ఈ రోజు మనం కొన్ని మర్మమైన నిధుల గురించి తెలుసుకుందా.

ఎవరైనా అలాంటి నిధిని పొందినట్లు అయితే ఆ వ్యక్తి అనేక తరాలు కూర్చోని తినొచ్చొ. కానీ ఆ సంపదులు రహస్య మార్గాలు మూసివేయబడ్డాయి. అందుకే ఈ నిధులను రహస్య సంపదలు అంటారు. ఈ నిధులను దాచడానికి వాటి ఓనర్స్ కొన్ని మంత్ర విద్యలను ఆశ్రయించారని…ఈ సంపదలు అంతా ఈజీగా చిక్కకపోవడానికి ఇవే కారణాలు అంటూ ఉంటారు. అందులో నెంబర్ 1. GROSVENOR SHIP TREASURE మర్మమైన నిధి. గ్రోస్వినర్ ఓడ 1782లో దక్షిణాఫ్రికా తీరంలో మునిగిపోయిన ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడ, ఇది భారతదేశం నుండి వచ్చిన విలువైన వస్తువులను తీసుకువెళ్తోంది, అయితే దాని విలువైన నిధి, ముఖ్యంగా షాజహాన్ యొక్క ప్రసిద్ధ నెమలి సింహాసనం గురించిన వదంతులు అవాస్తవం. ఈ ఓడ మునిగిపోవడం, దాని సిబ్బంది దురవస్థ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. గ్రోస్వినర్ అనేది 1782 ఆగస్టు 4న దక్షిణాఫ్రికా తీరంలో, బంగాళాఖాతంలో మునిగిపోయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక ఓడ. ఈ ఓడలో భారతదేశం నుండి అనేక విలువైన వస్తువులు ఉన్నట్లు చెబుతారు, వాటిలో బంగారం, వెండి, వజ్రాలు, పచ్చలు, మరియు రూబీలు ఉన్నాయని అంటారు. ఓడలో షాజహాన్ యొక్క నెమలి సింహాసనం కూడా ఉందని కొన్ని వదంతులు ఉన్నాయి, అయితే అది వాస్తవం కాదు. నిజానికి ఆ సింహాసనం ఢిల్లీ నుండి పర్షియాకు తీసుకురాబడింది. ఓడలో ఉన్న 150 మందిలో 15 మంది మాత్రమే సజీవంగా తీరానికి చేరుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రయాణంలో చాలా మంది మరణించారు. తరువాతి కాలంలో, ఓడలోని నిధిని కనుగొనడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి విజయవంతం కాలేదు. ఓడ మునిగిపోయిన ప్రదేశంలో ఇసుక పేరుకుపోవడం వల్ల, ఈ నిధిని కనుగొనడం మరింత కష్టమైంది.

ఇక నెంబర్ 2 JEAN LAFITTE నిధి. జీన్ లాఫిట్టేకి “నిధి” అనేది నిజమైన నిధి పెట్టె కాదు, బదులుగా అతని జీవితంలోని రహస్యం, అతని అక్రమ కార్యకలాపాలు, అతని మిస్టరీ జీవితం, మరియు అతని అకస్మాత్తుగా మరణం వంటివి ఈ “నిధి”లో భాగంగా చెప్పవచ్చు. అతని జీవితం, మరణం గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోవడం అతనిని ఒక రహస్యంలా మార్చింది. జీన్ లాఫిట్టే (Jean Lafitte) ఒక ప్రసిద్ధ పైరేట్ మరియు స్మగ్లర్. అతను 1800లలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు కరేబియన్ సముద్రంలో తన కార్యకలాపాలను కొనసాగించాడు. 1812లో జరిగిన యుద్ధంలో అమెరికా తరఫున పోరాడి న్యూ ఓర్లీన్స్‌ను రక్షించడంలో కీలక పాత్ర పోషించాడు. వాళ్లు దశాబ్దాలుగా దోపిడి చేయడం ద్వారా అపారమైన సంపదను కూడబెట్టారు. వాళ్లు దోచుకున్న ఈ సంపద అంతా మెక్సికో గల్ఫ్ సమీపంలో ఎక్కడో దాచి పెట్టారు. కానీ ఒక రోజు సడెన్ గా ఇద్దరు సోదరులు చనిపోయారు. ఆ నిధి ఇప్పటికి అలాగే ఉంది. కానీ ఆనిధి ఎక్కడ ఉంది దాంట్లో ఎంతుంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు.

నెంబర్ 3 OAK ISLAND నిధి. ఓక్ ఐలాండ్ ద్వీప్ యొక్క నిధి చాలా మర్మమైన కథలు ఉన్నాయి. ఈ ద్వీపంలో బిలియంలో విలువైన కథలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్ లిన్ రూజ్ వెల్ కూడా దీనిని కనుగొనడానికి చాలా ప్రయత్నాలే చేశారు. అంటే ఈ నిధి ఎంత విలువైనదో ఊహించండి. ఎంత ప్రయత్నించిన కూడా ఈ నిధి ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు. సముద్రపు దొంగలు కూడా దీన్ని ఆచూకీ కనిపెట్టలేక పోయారు.

ఇక నాలుగోది 4 son bhandar గుహ యొక్క రహస్య నిధి. రాజ్ గిరి జిల్లాలో శతాబ్ధాలుగా మూసివేయబడిన సోన్ భాండార్ అనే ఒక గృహ ఉంది. మన దేశాన్ని ఏలిన రాజుల్లో మగధ రాజు బింబసారుడు ఒకరు.. ఇతని వయసు మళ్లిన అనంతరం మగధ సింహాసనం కోసం అతని కుమారుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కాగా బింబిసారుడు కొడుకుల్లో ఒకడైన అజాత శత్రువు బలవంతుడు.. దీంతో తన సోదరులను ఓడించి తన తండ్రి బింబసారుడి ని సోన్ బందర్ గుహలో బంధించి మగధ సింహాసనాన్ని అధిష్టించాడు. కాగా తన తనయుడు దుర్మార్గాన్ని ముందుగా కనిపెట్టిన బింబసారుడు తన వద్ద ఉన్న అమూల్యమైన ధన వస్తు సంపద, వజ్ర వైడ్యూర్య తో కూడిన విలువైన సంపదను రాజ్‌గిర్‌లోని గుహలో దాచి ఉంచారు. ఈ విషయం తెలుసుకొన్న అజాత శత్రువు ఆ గుహలోకి వెళ్ళే మార్గం చెప్పమని.. తన తండ్రిని ఎన్నో కష్టాలు పెట్టాడట.. కానీ బింబసారుడు నిధి కోసం గుహ లోకి వెళ్ళే మార్గాన్ని చెప్పలేదు.. కొంత కాలానికి మరణించాడు.. తండ్రి మరణంతో నిధి రహస్యం తెలియక అజాత శత్రువు నిరాశతో క్రుంగి పిచ్చి వాడు అయ్యాడట.. ఆ సమయంలో మగధ కు వచ్చిన కొంత మంది బౌద్ధ బిక్షువులు వచ్చి అజాత శత్రువు కి పట్టిన పిచ్చి తగ్గించారట. అనంతరం అజాత శత్రువు బౌద్ధ మతం స్వీకరించి ఆ నిధి విషయం మరచి పోయాడని అంటారు.

ఇక ఐదవది కొలంబియాలోని గుటావీటా సరస్సు యొక్క నిధి. కొలంబియాలోని అన్ డొనాల్డో అనే ప్రదేశం ఉంది. ఇక్కడ మట్టిలో బంగారం ఉన్నది చెబుతారు. ఇక్కడ నివసించే ముస్కాటేక ప్రజలను చింపాగిరిజనులు అని కూడా పిలుస్తారు.వారు రాజును ఎన్నుకోవడానికి ఒక వింత ఆచారాన్ని అనుసరించేవాళ్లు. ఆచారం ప్రకారం రాజు కాబోయే వ్యక్తిని గుటావిటా అనే సరస్సుకు తీసుకెళ్లేవారు. అక్కడ అతని బట్టలు తొలగించి అతని శరీరంపై బంగారం బూడిదను రుద్దేవారు. ఇంకా అతనికి చాలా బంగారం కూడా ఇచ్చేవారు. ఇక ఆ వ్యక్తి సరస్సు మధ్యలోకి స్నానం చేసినప్పుడు ప్రజలు సరస్సులో బంగారం పోసోవారు. మంచి ఘడియల్లో సూర్యనమస్కారం చేసేటప్పుడు చింపాగిరిజనులు అప్పుడప్పుడు సరస్సులో బంగారాన్ని పోస్తారు. ఇక ఇల సంవత్సరాలుగా చేయడం వల్ల సరస్సు అడుగునా పెద్ద మొత్తంలో బంగారం స్టోర్ అయ్యింది. స్పానిష్ దొంగ ఈ నిధిని దోచుకోవడానికి ఎంతో ప్రయత్నించిన విఫలమయ్యారు. నీటిలో దాగిఉన్న నిధి కోసం వెతికిన వారిలో ఫ్రాన్స్ కు చెందిన జీన్ లాఫిట్ , అతని సోదరులు ఉన్నారు. నిజానికి వారు దొంగలు. ఈ నిధికోసం వారు ఎంతో ట్రై చేశారు. కానీ కనిపెట్టలేకపోయారు.

నెంబర్ సిక్స్ చెంఘిజ్ ఖాన్ నిధి.చెంఘిజ్ ఖాన్ యొక్క నిధి నేటి డాలర్లలో 120 ట్రిలియన్ డాలర్ల విలువైనదని చెప్పబడింది, అయితే ఇది ఊహాజనితమే. చెంఘిజ్ ఖాన్ (1162లో మంగోలియాలోని బైకాల్ సరస్సు సమీపంలో జన్మించాడు – ఆగస్టు 18, 1227న మరణించాడు) ఒక మంగోలియన్ యోధుడు-పాలకుడు, చరిత్రలో అత్యంత ప్రసిద్ధ విజేతలలో ఒకడు, అతను తెగలను ఏకీకృత మంగోలియాగా ఏకీకృతం చేసి , ఆపై తన సామ్రాజ్యాన్ని ఆసియా అంతటా అడ్రియాటిక్ సముద్రం వరకు విస్తరించాడు . ఇక ఈయన మొత్తం ప్రపంచాన్నే జయించాడు. చెంఘిజ్ ఖాన్ నేరాలు, దోపిడీలు మరియు వారసత్వానికి సంబంధించిన అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం. ఈ వ్యక్తి తీసుకున్న మార్గంలో మరణం, యుద్ధం తప్ప ఇంకోటి ఉండదు. అతని విధ్వంసంలో మహిళలను కూడా వదిలిపెట్టలేదు. తనకు ఇష్టమైన స్త్రీని బలవంతంగా రాణిని చేసుకునే వాడు. ఇలా ఆయన వందమంది రాణులకు రాజు. 200 మంది పిల్లలకు తండ్రి. చెంగిజ్ ఖాన్ 1227లో మరణించారు. తన మరణం తర్వాత ఆ నిధి గురించి చర్చలు బాగానే జరిగాయి. దాన్ని గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు.

ఇక 7వది అంబర్ గది నిధి. తరచుగా పిలువబడే అంబర్ రూమ్, నాజీ జర్మనీ చేత దోచుకోబడి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కోల్పోయే వరకు రష్యా యొక్క అత్యంత అమూల్యమైన కళాఖండాలలో ఒకటి. చార్లోటెన్‌బర్గ్ ప్యాలెస్ కోసం అంబర్ రూమ్‌ను జర్మన్ బరోక్ శిల్పి మరియు ప్రఖ్యాత వాస్తుశిల్పి ఆండ్రియాస్ ష్లుటర్ రూపొందించారు. 1701లో మాస్టర్ హస్తకళాకారుడు గాట్‌ఫ్రైడ్ వోల్ఫ్రామ్ మరియు అంబర్ మాస్టర్లు ఎర్నెస్ట్ షాచ్ట్ మరియు గాట్‌ఫ్రైడ్ టురావ్ నిర్మాణం ప్రారంభించారు. చార్లోటెన్‌బర్గ్ కోసం ఉద్దేశించినప్పటికీ, అంబర్ రూమ్‌ను బెర్లిన్ సిటీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు, 1716లో తన రాష్ట్ర పర్యటన సందర్భంగా రష్యాకు చెందిన పీటర్ ది గ్రేట్ దీనిని మెచ్చుకున్నారు. స్వీడన్‌కు వ్యతిరేకంగా రష్యా-ప్రష్యన్ కూటమిని ఏర్పరచడానికి, ఫ్రెడరిక్ విలియం I రష్యన్ సామ్రాజ్యానికి వారి కొత్త సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అంబర్ రూమ్‌ను బహుమతిగా ఇచ్చాడు. పది సంవత్సరాల కాలంలో, అంబర్ గదిని పునర్నిర్మించి, సెయింట్ పీటర్స్‌బర్గ్ వెలుపల ఆధునిక పుష్కిన్‌లోని కేథరీన్ ప్యాలెస్‌లోని ఇంపీరియల్ కుటుంబం యొక్క వేసవి గృహంలో ఏర్పాటు చేశారు. దీని ఉపరితలం 55 చదరపు మీటర్లకు పైగా విస్తరించి, 6 టన్నులకు పైగా అంబర్‌ను కలిగి ఉంది, నేడు దీని ద్రవ్య విలువ దాదాపు £240 మిలియన్లు. ఆ గదిలో బంగారు పూత, శిల్పాలు, అంబర్ ప్యానెల్లు, బంగారు ఆకులు, రత్నాలు, దేవదూతలు మరియు పిల్లల విగ్రహాలు మరియు కొవ్వొత్తి కాంతితో గదిని ప్రకాశవంతం చేసే అద్దాలు వంటి అలంకరించబడిన నిర్మాణ లక్షణాలు ఉన్నాయి. కానీ ఇప్పడి వరకు దీన్ని జాడ ఎవ్వరికి తెలియదు.

నెంబర్ 8 లేక్ టాప్లిట్జ్‌లో నాజీ నిధి. నాజీ బంగారం, ప్లాటినం బులియన్ & ఆభరణాలకు డంప్‌గా ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రియాలోని టాప్లిట్జ్ సరస్సు ఒక వింత ప్రదేశం. ఇది సాల్జ్‌బర్గ్ నగరానికి ఆగ్నేయంగా నలభై మైళ్ల దూరంలో టోట్స్ గెబిర్జ్లో ఉంది మరియు ఇది ప్రవేశించలేనిది మరియు సంవత్సరంలో ఐదు నెలలు గడ్డకట్టుకుపోతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో నాజీ బంగారం సరస్సులో దాచబడిందని కొంతమంది నమ్ముతారు. ఈ మునిగిపోయిన నిధి కోసం వెతికిన వ్యక్తులు చాలా మంది మరణించారు, దీనివల్ల ఎవరో లేదా ఏదో ఇప్పటికీ దానిని కాపాడుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సరస్సు సముద్ర మట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉంది మరియు దట్టమైన అడవిలో కప్పబడిన ఇరుకైన, నిటారుగా ఉన్న వైపులా ఉన్న లోయలో ఉంది. దీనిని మైలు పొడవున్న ప్రైవేట్ మట్టి ట్రాక్ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. టాప్లిట్జ్ ఒక మైలు కంటే కొంచెం పొడవు మరియు 500 నుండి 1,300 అడుగుల వెడల్పు ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో, ఇది 300 అడుగుల కంటే ఎక్కువ లోతులో ఉంటుంది.అయితే, సరస్సు నీటిలో పై 60 అడుగులు మాత్రమే ఉంటాయి – ఈ మట్టం క్రింద నీరు చాలా ఉప్పగా ఉంటుంది మరియు దాదాపు ఆక్సిజన్ ఉండదు. దీని అర్థం సరస్సు యొక్క లోతైన ప్రాంతాలలో చేపలు మరియు ఇతర సముద్ర జీవులు ఉండలేవు మరియు ఈ మట్టం క్రింద నీటిలో పడి మునిగిపోయే ఏదీ కుళ్ళిపోదు.

ఇక నెక్టస్ వన్ నైట్ టెంప్లర్ నిధి. నైట్ టెంప్లర్ అనేది యూరప్ లోని అత్యంత ప్రసిద్ద మతపరమైన సైనిక ఏర్పాటు. ఇది క్రైస్తవులను రక్షించడానికి 1119లో స్థాపించబడింది. కాలక్రమేణ వారి ప్రభావం పెరిగింది. వారు అపారమైన సంపదను కూడబెట్టుకున్నారు. కానీ 1307వ సంవత్సరంలో ఫ్రెంచ్ రాజు పిలిప్ వారు పెరుగుతున్న శక్తిని చూసి భయపడి వారిని అరెస్ట్ చేసి…ఆ నిధిపై దాడి చేశారని చెబుతుంటారు. కానీ దురదృష్టవ శాత్తు వారికి ఏమి దొరకలేదు. 10 Mysterious Secret Treasures.

ఇక టాప్ 10 డచ్‌మన్ బంగారు గని. అదే తప్పిపోయిన డచ్ మన్ బంగారు గనే. ఇది అమెరికాలోని ఆరిజోనా కొండల్లో ఉందని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. చరిత్ర ప్రకారం నైరుతి యూనైటెడ్ స్టేట్స్ లో ఒక బంగారు గని దాగి ఉంది. మామూలుగా ఈ ప్రదేశం ఆరిజోనాలోని పినిక్స్ తూర్పున అపాజి జెంక్షన్ సమీపంలోని పర్వతాల్లో ఉందని నమ్ముతారు. ఈ గనిని ఎలా కనుగొనాలో చాలా కథలే ఉన్నాయి. కానీ ఆ కథలను చిక్కు ముడిగా విప్పే వాడు ఇప్పటి వరకు పుట్టలేదు. ఇవే నండి మిస్టరిగా మిగిలిపోయిన నిధులు.