వీసా బాంబ్..!!

Donald Trump Visa Rules: అమెరికన్ వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు భారతీయ వివాహాల మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసా ఫీజును రూ.88 లక్షలకు పెంచాలన్న ఆయన ప్రకటనతో యూఎస్ లో స్థిరపడాలనుకునే భారతీయ యువత, వారి తల్లిదండ్రుల్లో పెద్ద కలవరం మొదలైంది. ఒకప్పుడు NRI అల్లుడు దొరికితే తమ పిల్లల భవిష్యత్తు సురక్షితమని భావించిన ఇండియన్స్ ఫ్యామిలీలు, ఇప్పుడు తమ డిషీషన్ ను చేంజ్ చేసుకుంటున్నారు.

H-1B వీసా అనేది టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్యం వంటి రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలకు ఇచ్చే నాన్-రెసిడెన్షియల్ వీసా. ఈ వీసాదారుల్లో 71% మంది భారతీయులే ఉండటం వల్ల ట్రంప్ ప్రకటన భారత్‌పై ఎఫెక్ట్ చూపుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ఈ భారీ ఫీజు వర్తిస్తుందని వైట్ హౌస్ వివరణ ఇచ్చినా, అమెరికాలో ఉద్యోగం, వీసాపై ఏ క్షణంలో ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న అభద్రతా భావం భారతీయ కుటుంబాల్లో పెరిగింది.

మ్యారేజ్ మ్యాట్రిమోనీల కొత్త ట్రెండ్ కొంతకాలం క్రితం వరకు విదేశీ అల్లుళ్ల కోసం విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ విధానాల వల్ల చాలా కుటుంబాలు విదేశీ సంబంధాలను క్యాన్సెల్ చేసుకుంటున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న కొన్ని మ్యాట్రిమోని కంపెనీలు కూడా తమ పద్ధతులు మార్చుకున్నాయి. ప్రీమియం మ్యాచ్‌మేకింగ్ యాప్‌లు అయితే,వీసా ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీని ద్వారా కుటుంబాలు తమకు కాబోయే భాగస్వామి యొక్క వీసా స్టేటస్‌ను ముందే తెలుసుకునే ఛాన్స్ కలిగింది.

రాయిటర్స్ నివేదికల ప్రకారం, దేశీయ మ్యాట్రిమోనీలు,పెళ్లిళ్ల బ్రోకర్లు కూడా ఈ మార్పును అబ్జర్ చేస్తున్నారు. గతంలో ఆర్థిక భద్రతకు భరోసాగా నిలిచిన అమెరికా NRIలతో పెళ్లి సంబంధాలు చేసుకోవడానికి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ట్రంప్ పేల్చిన H-1B వీసా బాంబుతో అమెరికాలో సెటిల్ అవ్వాలన్న తమ కల ఇక కష్టమని భావించి యువత ప్లాన్ మార్చుకుంటోంది. Donald Trump Visa Rules.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. సుమారు 21 లక్షల మంది భారతీయులు అక్కడ నివాసం ఉంటున్నారు.ట్రంప్ నిర్ణయాల వల్ల వారి ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో.. వివాహ మార్కెట్‌లో NRIల వైపు ఇంట్రెస్ట్ తగ్గిపోవడం విశేషం.