
Unite The Kingdom Rally: సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ..‘మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక, ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్-రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ నిర్వహించిన ‘యునైట్ ది కింగ్డమ్’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో 26 మంది పోలీసు అధికారులు గాయపడగా, 25 మందిని అరెస్ట్ చేశారు.
మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో, సుమారు 1,10,000 నుంచి 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపుతప్పి పోలీసులపై బాటిళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరుచేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో ‘స్టాండ్ అప్ టు రేసిజం’ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో వలసదారులకు మద్దతుగా మరో ప్రదర్శన కూడా జరిగింది.
ఇక ఘటనకు యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ ఎలాన్ మస్క్ స్పందించారు. భారీగా, అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోందని…. వలసల కారణంగా హింస పెరిగిపోతోందన్నారు. ఇక ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుందని… ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే అన్నారు. హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు.. అని వారికి మద్దతు ఇచ్చారు. చివరగా.. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని తాను అనుకుంటున్నాను’ అని కామెంట్స్ చేశారు. Unite The Kingdom Rally.
మరోవైపు వలసదారులకు మద్దతుగా ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ పేరుతో మరొక గ్రూప్ నిరసనలు చేపట్టింది. ఈ రెండు నిరసనలు అదుపు తప్పడంతో హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనల్లో 26 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది అదుపు తప్పారు.