
Kim Jong Un: పిచ్చి తుగ్లక్, హీటర్ల పాలనా విధానం, నిర్ణయాలను గురించి మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం.. అయితే వారి పాలనను పలు నిర్ణయాలతో మన కనుల ముందుకు తీసుకొస్తూ ఉంటాడు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్, కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడూ వింత వింత నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గతంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. అందుకనే కిమ్ కనిపించినా వార్తే కనిపించకుండా పోయినా వార్తే.. చివరికి తుమ్మినా, దగ్గినా కూడా వార్తే.
కిమ్ జోంగ్ ఉన్ కొత్త నిర్ణయంతో వార్తల్లో నిలిచాడు. తన దేశ ప్రజల అణిచివేత కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్తర కొరియా నియంత తీసుకున్న ఒక నిర్ణయం యావత్ ప్రజానీకానికి షాకింగ్ వార్తగా నిలిచింది. తన దేశ ప్రజల అణిచివేత కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక అణచివేత నియమాలను రూపొందించారు. ఈ నియమాలలో ఒకదాని ప్రకారం విదేశీ టీవీ షో చూడటం మరణశిక్ష విధించదగినదని కిమ్ భావిస్తున్నట్లు సంచలనాత్మక సమాచారం వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలో పరిస్థితి 2014 నుంచి రోజు రోజుకీ మరింత దిగజారుతోంది. కరోనా మహమ్మారి తర్వాత మరణశిక్ష విధించబడిన వారి సంఖ్య పెరిగిందని కూడా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఉత్తర కొరియాలో పరిస్థితి 2014 నుంచి రోజు రోజుకీ మరింత దిగజారుతోంది. కరోనా మహమ్మారి తర్వాత మరణశిక్ష విధించబడిన వారి సంఖ్య పెరిగిందని కూడా వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు కిమ్ మాటలకు ఎదురు చెప్పిన, నిబంధనలు అతిక్రమించిన వారికి మాత్రమే మరణశిక్ష విధించేవారు. ఇప్పుడు అది కొత్త పుంతలు తొక్కిందని ఐరాస నివేదిక తెలిపింది. ఉ.కొమరణశిక్షను చట్టపరంగా మరింత విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రజలపై నిఘా మరింత విస్తృతమైందని.. ఉత్తర కొరియాలో అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయని ఐరాస రిపోర్ట్ తెలిపింది. స్వతంత్ర పౌర సమాజ సంస్థలు దేశంలో అస్సలు లేవని స్పష్టం చేసింది. Kim Jong Un.
సమాచారాన్ని చేరవేసేందుకు కూడా ఉత్తర కొరియా ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందని యూఎన్ రిపోర్ట్ లో చేర్చింది. దక్షిణ కొరియా డ్రామాలు, విదేశీ సినిమాలను పంచుకోవడంపై మరణశిక్షలు సహా కఠిన ఆంక్షలు అమలవుతున్నట్లు ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ కంటెంట్ పై 2018లో తొలిసారి కిమ్ ఆంక్షలు విధించారు. అది 2020 తర్వాత మరింత కఠినతరమైనట్లు ఐరాస తెలిపింది. అంతేకాదు ప్రజల్లో భయాన్ని నింపేందుకు ప్రభుత్వం బహిరంగ న్యాయ విచారణలు, మరణదండనలు నిర్వహిస్తోందని నివేదిక పేర్కొంది.