అమెరికన్ టీవీ షో భవిష్యవాణి..?!

Simpsons Trump Death Prediction: అది అమెరికాలోని ఓ పాపులర్ యానిమేటెడ్ టీవీ షో. సుమారు 35 ఏళ్ల నుంచి ప్రసారం అవుతోన్న ఆ టీవీ షోలో భవిష్యత్తు గురించి ఏం చెప్పినా అవి నిజమవుతాయి. గతంలో ప్రసారమైన చాలా ఎపిసోడ్లలో చూపించిన విషయాలు నిజమయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ ఏడాది ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చనిపోతాడని ఈ టీవీషోలో చూపించారని .. ఇప్పుడు ట్రంప్ కు ఏమవుతుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ టీవీ షో జ్యోతిష్యం ఏంటి..? నిజంగా ట్రంప్ చనిపోతారా..? ఇంతకీ భవిష్యత్తు చెప్పే ఆ పాపులర్ యానిమేటెట్ టీవీషో కథేంటి..?

అమెరికన్ యానిమేటెడ్ టీవీ షో ది సింప్సన్స్ మరోసారి సంచలనం సృష్టిస్తోంది. చాలా మంది దీనిని ఇదివరకే చూసుంటారు. గతంలో ఈ టీవీషోలు చూపించినవి చాలా వరకు నిజమయ్యాయి. అయితే ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 ఆగస్టులో మరణిస్తారని వచ్చిన ఎపిసోడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ది సింప్సన్స్ గతంలో ట్రంప్ అధ్యక్ష పదవి, డిస్నీ-ఫాక్స్ విలీనం వంటి సంఘటనలను ఊహించినట్లే జరిగాయి. 1989 నుంచి అమెరికాలో ప్రసారమవుతున్న ది సింప్సన్స్ యానిమేటెడ్ షో అమెరికన్ రాజకీయ, సామాజిక సంఘటనలను సెటైర్ రూపంలో చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ షో హాస్యం, వ్యంగ్యం ద్వారా సమాజంలోని వివిధ అంశాలను విమర్శిస్తూ, కొన్ని సంఘటనలను ముందుగా ఊహించినట్లు చూపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతాడని చూపించడం, ఇది 2016లో నిజమైంది. డిస్నీ-ఫాక్స్ విలీనం గురించి 1998లోనే ఈ టీవీషోలు చూపించారు. అది 2019లో వాస్తవరూపం దాల్చింది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌ల వంటి గాడ్జెట్‌లను 20 ఏళ్ల ముందుగానే ఈ టీవీషో ఊహించింది. దీని వల్లనే ది సింప్సన్స్ ప్రిడిక్షన్‌లు సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి.

అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియోలో డొనాల్డ్ ట్రంప్ మరణించినట్లు యానిమేటెడ్ సన్నివేశం కనిపిస్తోంది. ఈ వీడియోలో ట్రంప్ ఒక కుర్చీలో కూలిపోయి ఉన్న దృశ్యం, చుట్టూ పోలీస్ లైన్, 2025 ఆగస్టు అని మెటాలిక్ ఫాంట్‌లో స్క్రీన్‌పై సమాచారం కనిపిస్తుంది. ది సింప్సన్స్ షో ట్రంప్ మరణాన్ని ముందుగా ఊహించింది అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో సర్కులేట్ అవుతోంది.

ఈ వీడియో నిజమా? ఫ్యాక్ట్-చెక్ రిపోర్ట్ ఏం చెబుతోంది..?
ది సింప్సన్స్ అభిమాన సంఘాలు, ఫ్యాక్ట్-చెక్ సంస్థలు ఈ వీడియోను పరిశీలించి, ఇది డీప్‌ఫేక్ లేదా AI-జనరేటెడ్ కంటెంట్‌గా తేల్చాయి. ఈ వీడియో శోష్న విలియమ్స్ అనే యూట్యూబర్ సృష్టించిన ఫ్యాన్-మేడ్ క్లిప్ నుంచి తీసుకున్నట్టు తెలిసింది, ఇది ఒరిజినల్ సింప్సన్స్ ఎపిసోడ్‌లో భాగం కాదని అన్నారు. 2025 ఆగస్టును సూచించే ఎలాంటి సింప్సన్స్ ఎపిసోడ్ ఇప్పటివరకు ప్రసారం కాలేదన్నారు. వీడియోలోని ట్రంప్ ఫేస్ మోషన్స్, ఫ్రేమ్ స్కిప్పింగ్, వర్టికల్ ఫాంట్ టైప్ AI టూల్స్‌తో రూపొందించినవిగా గుర్తించబడ్డాయి. ది సింప్సన్స్ రచయితలు ఈ వీడియోను ఫేక్ అని స్పష్టం చేశారు. ఈ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల సింప్సన్స్ షో ఖ్యాతి దెబ్బతింటుందని చెప్పారు.

ది సింప్సన్స్ గతంలో ట్రంప్‌ను హాస్య, వ్యంగ్య రూపంలో చిత్రీకరించిన ఎపిసోడ్‌లు ఉన్నాయి. 2000లో వచ్చిన ఓ ఎపిసోడ్‌లో ట్రంప్ ను అధ్యక్షుడిగా చూపించారు. ఇది 2016లో నిజమైంది. అయితే, ట్రంప్ మరణాన్ని సూచించే ఎలాంటి ఎపిసోడ్ లేదని రచయితలు స్పష్టం చేశారు. అమెరికాలో ట్రంప్ రాజకీయ ప్రభావం, వివాదాస్పద విధానాలు వల్ల ఆయనపై సెటైర్, విమర్శలు సర్వసాధారణం. చాలా టీవీషోలు ట్రంప్‌ను ఎప్పుడూ వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్నాయి. సోషల మీడియాలో ట్రంప్ వ్యతిరేక హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. AI టూల్స్ ద్వారా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఫేక్ వీడియోలు, మీమ్స్ సృష్టించడం అమెరికాలో పెరిగింది. ఈ వీడియో ట్రంప్‌పై రాజకీయ, సామాజిక నిరసనలకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది, అయితే దీని వెనుక ఉద్దేశం రాజకీయ కుట్రగా కొందరు భావిస్తున్నారు. Simpsons Trump Death Prediction.

ట్రంప్ విధానాలు, ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై టారిఫ్‌లు విధించడం, వలస నిబంధనలు, ఆర్థిక సంస్కరణలు అమెరికాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అమెరికాలోని డెమోక్రాట్‌లు, లిబరల్ గ్రూప్‌లు ట్రంప్ విధానాలను విమర్శిస్తూ ర్యాలీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్‌లు నిర్వహిస్తున్నాయి. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని కామెడీ షోలు, యానిమేషన్‌లు, మీమ్స్ అమెరికన్ పాప్ కల్చర్‌లో భాగంగా మారాయి. అయితే ట్రంప్ ఫేస్ ను AI టూల్స్ తో మార్చడంపై వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాప్తి చెందడం డీప్‌ఫేక్ టెక్నాలజీ ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధమో తెలియడం లేదు. AI టూల్స్ ద్వారా రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఫేక్ వీడియోలు సృష్టించడం అమెరికాలో సర్వసాధారణంగా మారింది. ఈ వీడియో వంటి కంటెంట్ జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసి, సమాజంలో అపనమ్మకాన్ని సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులు ఈ వీడియోను అమెరికన్ రాజకీయ సంస్కృతికి దెబ్బ గా విమర్శిస్తుండగా, కొందరు నెటిజన్లు దీనిని సెటైర్ కల్చర్ లో భాగంగా చూస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇలాంటి కంటెంట్‌ను నియంత్రించేందుకు కొత్త విధానాలను అమలు చేస్తున్నాయి.

అమెరికన్ రాజకీయ సంస్కృతిలో సెటైర్, వ్యంగ్యం ఎప్పటినుంచో ఉన్నాయి. ది సింప్సన్స్ వంటి షోలు రాజకీయ నాయకులను విమర్శించడం ద్వారా సమాజంలో చర్చలను రేకెత్తిస్తాయి. అయితే, ఈ ఫేక్ వీడియో లాంటి కంటెంట్ సెటైర్ పేరుతో సమాచార వక్రీకరణకు దారితీస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందే ఫేక్ కంటెంట్‌ను గుర్తించి, ఫ్యాక్ట్-చెక్ చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వీడియోలు రాజకీయ ధ్రువీకరణను పెంచి, ప్రజల్లో అపనమ్మకాన్ని సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికన్ పాప్ కల్చర్‌లో సెటైర్ ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ, దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: https://www.mega9tv.com/international/during-excavations-at-tinshemet-cave-scientists-discovered-a-burial-site-that-is-between-80000-and-120000-years-old/