సంచలన నిర్ణయం…!

Antifa Group terrorist organization: ట్రంప్ ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అమెరికాలో వ్యవస్థలు దేశాధ్యక్షుడికి చిత్తం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. ట్రంప్ చర్య ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి లోను చేస్తోంది. ఇక ట్రంప్ రాజకీయాల తీరే వేరు. అయితే ఈ సందర్భంగా ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దీన్ని ఎలా అమలు చేస్తారనేది స్పష్టంగా తెలియరాలేదు. అంతిఫాకు నిర్దుష్టమైన నాయకత్వం గానీ, కేంద్ర వ్యవస్థ గానీ లేదు. ఫలితంగా- డొనాల్డ్ ట్రంప్ ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో యాంటీ ఫాసిస్ట్ ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్న యాంటిఫా గ్రూపును.. కీల‌క ఉగ్ర‌వాద సంస్థ‌గా ప్ర‌క‌టించనున్న‌ట్లు చెప్పారు. త‌న‌కు చెందిన ట్రుత్ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఆయ‌న కొత్త‌గా ఓ పోస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం ఉటా వాలీ యూనివ‌ర్సిటీలో ప్ర‌సంగిస్తున్న క‌న్జ‌ర్వేటివ్ నేత చార్లీ కిర్క్ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యాంటిఫా గ్రూపును అణిచివేసేందుకు ఆయ‌న ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. వామ‌ప‌క్ష తీవ్ర‌వాదాన్ని అంతం చేస్తాన‌ని గ‌తంలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే కిర్క్ హ‌త్య‌తో మ‌ళ్లీ అంశాన్ని లేవ‌నెత్తిన‌ట్లు అయ్యింది. యాంటిఫా గ్రూపును త‌న పోస్టులో తీవ్రంగా విమ‌ర్శించారు. అదో జ‌బ్బుప‌డిన‌, ప్ర‌మాద‌క‌ర‌, రాడిక‌ల్ వామ‌ప‌క్ష విధ్వంసం అన్నారు. యాంటిఫా ఉద్య‌మాల‌కు నిధులు ఇస్తున్న వారిని ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.

యాంటిఫా అంటే.. యాంటీ ఫాసిస్ట్. డోనాల్డ్ ట్రంప్ తొలి ట‌ర్మ్‌లో ఈ ప‌దం ఎక్కువ‌గా వాడుక‌లోకి వ‌చ్చింది. యాంటీ ఫాసిస్ట్‌కు షార్ట్ ప‌దం అని అమెరికా చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల డాక్యుమెంట్ పేర్కొన్న‌ది. వాస్త‌వానికి యాంటిఫా అనేది పెద్ద ఉద్య‌మ వ్య‌వ‌స్థ ఏమీ కాదు. అలా అని కొట్టిపారేసిది కూడా కాదు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న సామాజిక కార్య‌క‌ర్త‌ల కూడిక‌నే యాంటిఫా అని డాక్యుమెంట్‌లో తెలిపారు. యాంటిఫా ఉద్య‌మానికి జాతీయ నేత అంటూ ఎవ‌రూ లేరు. కానీ ఆ ఉద్య‌మాన్ని ఫాలోఅవుతున్న వాళ్లు స్థానికంగా గ్రూపులుగా ఏర్ప‌డుతున్నారు.

గ‌తంలో కూడా యాంటిఫాను ఉగ్ర సంస్థ‌గా ట్రంప్ పేర్కొన్నారు. త‌న తొలి ట‌ర్మ్‌లో ఆయ‌న ఈ స‌ల‌హా ఇచ్చారు. మిన్నియ‌పోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్య‌క్తి హ‌త్య‌కు గురైన త‌ర్వాత అమెరికా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిర‌స‌న‌లు హోరెత్తాయి. ఆ స‌మయంలో యాంటిఫాను ఉగ్ర సంస్థ‌గా ప్ర‌క‌టించాల‌ని ట్రంప్ భావించిన‌ట్లు తెలుస్తోంది.

దేశంలో హింస‌కు ఊతం ఇస్తున్న‌, నిధులు స‌మ‌ర్పిస్తున్న‌, మ‌ద్దుత ఇస్తున్న ఎన్జీవో నెట్వ‌ర్క్‌ల ప‌నిప‌డుతామ‌ని కొన్ని రోజుల క్రితం ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఈ నేప‌థ్యంలో ట్రంప్ యాంటిఫాకు వ్య‌తిరేకంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెండోసారి దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అనేక గ్రూపుల‌ను ఉగ్ర సంస్థ‌లుగా ప్ర‌క‌టించారు. ఆ లిస్టులో డ్ర‌గ్ కార్ట‌ల్స్ కూడా ఉన్నాయి. రెండు రోజుల క్రితం వెనిజులా నుంచి వ‌స్తున్న డ్ర‌గ్స్ బోటును పేల్చిన త‌ర్వాత దాంట్లో ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

రాజకీయ హింసను ప్రేరేపించే వామపక్ష సంస్థలను ఎదుర్కోవడంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అనేక చర్యల్లో ఇది ఒకటని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య తర్వాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో ఓవల్ ఆఫీస్ నుండి చేసిన ప్రసంగంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కిర్క్ హత్యను వామపక్ష సమన్వయ ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ హింసాత్మక పరిస్థితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో తేల్చి చెప్పారు ట్రంప్.

దీనికి అనుగుణంగా తాజా ప్రకటన చేశారు ట్రంప్. కాగా- అసమ్మతిని అణచివేయడానికి ఒక సాకు ఆంతిఫాను చూపిస్తోన్నారని డెమొక్రాట్లు విమర్శిస్తోన్నారు. నిజానికి- తన మొదటి పదవీకాలంలోనే ట్రంప్ అంతిఫాను ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు చర్యలు తీసకున్నారు గానీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అప్పటి అటార్నీ జనరల్ విలియం బార్.. ఈ సంస్థను దేశీయ ఉగ్రవాదిగా పేర్కొన్నారు. Antifa Group terrorist organization.
ఆంతిఫాకు ఛైర్మన్ వంటి నాయకత్వం గానీ, ప్రధాన కార్యాలయం అంటూ ఏదీ లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రం వేల సంఖ్యలో ఆంతిఫా కార్యకర్తలు గుమిగూడుతుంటారు. అజెండాకు అనుగుణంగా ఉద్యమిస్తుంటారు. అంతిఫాను భయంకర ఉగ్రవాద సంస్థగా, ఇటువంటి సామాజిక సమూహాలు ఇంకా చాలా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాటిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇక ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది. ఘటనా స్థలంలో “Hey fascist! Catch!” వంటి రాతలున్న బుల్లెట్‌ కేసింగ్‌లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్‌సన్‌ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్‌బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్‌ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం.