
Trump America First policy: ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ఫస్ట్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. అమెరికాకు ఎంత లాభం కలుగుతుందా అని ఆలోచిస్తున్న ట్రంప్.. తన నిర్ణయాల వల్ల మిగిలిన దేశాలు ఎలా నష్టపోతున్నాయా అనే ఆలోచన చేయడం లేదు. మొన్నటి వరకు అమెరికా అంటే ప్రపంచ దేశాలకు పెద్దన్న అనే ఆలోచన ఉండగా.. ట్రంప్ నిర్ణయాలతో అది పోయేలా ఉంది. తాజాగా యూఎస్ ఎయిర్ నిలుపుదల వ్యవహారంతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు యూఎస్ ఎయిడ్ నిలుపుదల చేయడం వల్ల నష్టాలు ఏంటి..? ఈ ఫండ్ నిలుపుదలతో హెచ్ఐవీ రోగులను ట్రంప్ పెంచుతున్నారా..? ఈ ఎయిర్ ప్రపంచ దేశాలకు ఇప్పటి వరకు ఎలాంటి లాభం కలిగించింది..?
యూఎస్‌ఎయిడ్ అనేది అమెరికా విదేశీ సహాయ నిధి. అమెరికాలో పలు దేశాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సహాయ నిధిని ఉపయోగిస్తుంది. అయితే ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అనేక దేశాల్లో దీనిపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నిలిపివేయాలన్న ట్రంప్ ఆదేశం ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారత్‌లోనూ ఈ నష్టం చెప్పుకోదగిన స్థాయిలోనే ఉండొచ్చు. ప్రజారోగ్యం, మాతాశిశు సంరక్షణలాంటి కార్యక్రమాలకు ఇబ్బంది ఏర్పడొచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాల్లో మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అమెరికా చేపట్టిన ఈ విదేశీ సహాయ కార్యక్రమం నేడు 160 దేశాలకు విస్తరించింది. సోవియట్ రష్యాతో కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల్లో వివిధ దేశాల్లో అమెరికా ప్రాబల్యం నెలకొల్పడానికి యూఎస్‌ఎయిడ్ ఎంతో దోహదపడింది. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిధుల నిలిపివేతకు ఆదేశాలిచ్చారు. యూఎస్‌ఎయిడ్ దశాబ్దాలుగా భారత్‌లో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2024లో రూ.1,228 కోట్లు భారత్‌కు వచ్చాయి. మన దేశానికి అందే ఆర్థిక సహాయం స్వల్పమే అయినప్పటికీ ప్రజారోగ్యం, విద్య, పర్యావరణ రంగాల్లో దీని ప్రభావం అధికమే. భారత్‌తో కలిసి చేపడుతున్న కార్యక్రమాల ద్వారా మాతాశిశు మరణాలను తగ్గించడంతో పాటు క్షయ, హెచ్‌ఐవీ వంటి వ్యాధుల నివారణకు కృషి జరుగుతోంది. 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌కు యూఎస్‌ఎయిడ్ అండగా నిలిచింది. 3 లక్షల ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సహాయపడింది.
యూఎస్‌ఎయిడ్ ఫండ్ లక్ష్యం.. పేదరిక నిర్మూలన, వ్యాధుల నివారణ, మానవతా సాయం. అమెరికా ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద మానవత, అభివృద్ధి పనుల విభాగంలో 13వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 160కి పైగా దేశాల్లో ఏడాదికి రూ.3 కోట్లు అమెరికా ఖర్చు చేస్తోంది. 2023లో అత్యధిక నిధులు పొందిన దేశాలు చూస్తే ఉక్రెయిన్, ఇథియోపియా, జోర్డాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, యెమెన్, అఫ్గానిస్థాన్, నైజీరియా, దక్షిణ సుడాన్, సిరియా ఉన్నాయి. 2024లో ఆఫ్రికా దేశాలు రూ.57వేల కోట్ల నిధులను అందుకున్నాయి. ఈ నిధిని నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయంతో ఆఫ్రికా దేశాల్లో హెచ్‌ఐవీ బాధితులకు ఔషధాలు అందిస్తున్న వైద్య కేంద్రాలు మూతపడిపోతున్నాయి. కొలంబియా, కొస్టారికా, ఈక్వెడార్, గ్వాటెమాలలోని వలస జీవులకు అమెరికాకు వెళ్లేందుకు న్యాయ సహాయం ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ కారణాలతో మనదేశానికి అందే యూఎస్‌ఎయిడ్ నిధుల మొత్తం క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2001లో 208 మిలియన్ డాల్లర్లుగా ఉన్న యూఎస్‌ఎయిడ్…2023కి 153 మిలియన్ డాలర్లకు, 2024కి 141 మిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో విదేశీ సహాయ నిధులను నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయం మన దేశంపై చూపే ప్రభావం స్వల్పమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. Trump America First policy.
హెచ్‌ఐవీ ఎయిడ్స్ నియంత్రణ కోసం అమెరికా అనేక దేశాల్లో ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఈ చర్యలతో వ్యాధి బారినపడి మరణిస్తున్న వారిసంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ సాయాన్ని ట్రంప్ యంత్రాంగం ఇటీవల నిలిపివేయడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్‌ఐవీ నిధులను పునరుద్ధరించకపోతే 2029 నాటికి 40లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు, మరో 60లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఐరాస ఎయిడ్స్ విభాగం హెచ్చరించింది. గత ఆరు నెలలుగా అమెరికా నిధులు నిలిపివేయడం షాక్‌కు గురిచేస్తోదని.. ఆరోగ్య కేంద్రాలు మూసివేయడంతో పాటు వేలాది క్లినిక్‌లు సిబ్బంది లేకుండా ఖాళీగా మిగిలిపోయాయని ఐరాస చెబుతోంది. అనేక సంస్థలు హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాలను నిలిపివేశాయి అని ఐరాస నివేదిక పేర్కొంది. యుద్ధాలు, భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, వాతావరణ మార్పులు ఈ ముప్పును మరింత పెంచేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పేదరిక నిర్మూలన, వ్యాధుల నివారణ, మానవతా సాయం లక్ష్యంతో యూఎస్‌ఎయిడ్ ఫండ్ ఏర్పాటైంది. అమెరికా ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద మానవత, అభివృద్ధి పనుల విభాగంలో వేలాది మంది సిబ్బంది పని చేస్తున్నారు. 160కి పైగా దేశాల్లో ఏడాదికి దాదాపు రూ.3.8లక్షల కోట్లను అమెరికా ఖర్చు చేస్తోంది. 2025లో హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల కోసమే సుమారు రూ.34 వేల కోట్లు వెచ్చించాలనే ప్రతిపాదనలు చేసింది. కానీ, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఫెడరల్ గ్రాంట్లు, రుణాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలను షాక్‌కు గురిచేసింది.