బహిష్కరణ.! బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్..!

Boycott American Foods: ఇండియాలో చాలా అమెరికన్ కంపెనీలు ఫుడ్ బిజినెస్ చేస్తున్నాయి. బర్గర్ల నుంచి చాక్లెట్ల వరకు ఆహార ఉత్పత్తుల అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అమెరికాతో టారిఫ్ ల ఉద్రిక్తతల కారణంగా కొంతమంది భారతీయులు ఆదేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. ఇంతకీ ఇండియాలో ఉన్న పాపులర్ అమెరికన్ ఫుడ్ బ్రాండ్లు ఏంటి.

ట్రంప్ తీరుపై భారత్ లో ఆందోళనలు మొదలయ్యాయి. భారీ టారిఫ్ లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. బాయ్ కాట్ అమెరికన్ బ్రాండ్స్ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. అమెరికా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. సోషల్ మీడియాలో బాయ్ కాట్ అమెరిక హ్యాష్ టాక్ ట్రెండ్ అవుతుంది.

అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ లు మన దేశంలో బాగా పాపులర్ అయ్యాయి.మంచి రుచి కారణంగా ఇక్కడి ప్రజలు వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. మెక్ డొనాల్డ్స్ ఈ సంస్థ మెక్ ఆలూ టిక్కి, మహారాజా మాక్ లాంటి బర్గర్లను, విక్రయిస్తుంది. ఇవి మన దేశంలో పలు నగరాల్లో 300 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక డొమినోస్ పిజ్జా పన్నీర్ మఖానీ లాంటి పిజ్జాలను అందిస్తుంది. దేశం అంతటా 1500 కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. సబ్ వే ఆలూ ప్యాటీ, చికెన్ టిక్కా సబ్స్ లాంటి భారతీయ ఎంపికలతో శాండ్ విచ్లను తయారు చేస్తుంది. అమెరికాకు చెందిన కూల్ డ్రింక్ కంపెనీలు భారత్ లో అతిపెద్ద మార్కెట్ ను కలిగి ఉన్నాయి.

కొకొకోలా , kfc పీజా హట్, డెమినోస్ పీజా, బర్గర్ కింగ్, సబ్ వే , మెగ్ డోనాల్డ్ ఈ కంపెనీలు అన్ని కూడా భారత్ లో విక్రయాలు చేస్తున్నాయి. ఇవే కాదు అమెజాన్, ఆపిల్ లాంటివి ఇంకా చాలా ప్రముఖ బ్రాండ్ లు బహష్కరణ పిలుపును ఎదుర్కొంటుంది. భారత్ పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడంతో బాయి కాల్ అమెరికన్ బ్రాండ్ ఉద్యమాన్ని ప్రధాని మోడీ మద్దతు దారుడు, పలువురు భారతీయులు లేవనెత్తారు. అమెరికా ఉత్పత్తులు నిషేధించి దేశ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా వారు పిలుపు నిచ్చారు. మూడు రోజుల బాయ్ కాట్ అమెరికా ఉద్యమం మొదలవ్వగా అదీ తీవ్రంగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ అమెరికా హ్యాష్ టాగ్స్ ప్రెజెంట్ అయితే ట్రోల్ అవుతున్నాయి. ఇక బాయ్ కాట్ గూగుల్ పే, బాయ్ కాట్ ఫోన్ పే అనే హ్యాష్ టాగ్ లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.

అయితే కొంత మంది యూజర్లు భారత్ కు చెందిన పేమెంట్ ఆప్ ల వైపు మొగ్గు చూపాలని ప్రస్తుతం వారు పిలుపు నిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభ కలిగిన దేశం భారత్. సంపన్న వినియోగధారులు కూడా ఉన్నారు. అమెరికాకు భారత్ కీలకమైన మార్కెట్. us బ్రాండ్ కు భారీ డిమాండ్ కూడా ఉంది. దీంతో చాలా అమెరికా కంపెనీలు భారత్ గడ్డ పై భారీగా లాభాలు పొందుతున్నాయి. భారత్ దేశం మెటా యొక్క వాట్స్ అప్ కు వినియోగదారుల పరంగా అతి పెద్ద మార్కెట్.

ఇక డొమినోస్ కు ఎక్కువ రెస్టారెంట్లు మనదేశంలోనే ఉన్నాయి. పెప్సీ, కొకకోలా డ్రింక్స్ కంపెనీలు భారత్ పెద్ద మార్కెట్ గా ఉంది. కొత్త ఆపీల్ స్టోర్ తెరచినప్పుడు లేదా డిస్కౌంట్ లను ఇచ్చినప్పుడు ఇప్పటికి క్యూ లో నిలబడతారు. అయితే డొనాల్డ్ ట్రంప్ భారత్ కు వ్యతిరేకంగా డిషీషన్స్ తీసుకోవడంతో ఆ దేశ ఉత్పత్తులను భారత్ లో వ్యతిరేకించారని డిమాండ్ ఊపందుకుంది. ప్రధానంగా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్న స్వదేశీ జాగరణ్ మంచ్ సంస్థ విదేశీ బ్రాండ్ లను దూరంగా ఉంచాలని ప్రజలను కోరుతూ భారత్ అంతట కూడా నిరసనలతో హోరెత్తించారు. Boycott American Foods.

ట్రంప్ వ్యవహార శైలి పై భారత్ లో వ్యతిరేకత పెరిగిపోతుంది. భారత్ తో పాటు ఇతర దేశాల పై ఘోరంగా సుంకాల విధిస్తున్న ట్రంప్ తీరును వారు తప్పుబడుతున్నారు. ఒకప్పుడు మద్దు ఇచ్చిన వాళ్లే ప్రస్తుతం తప్పుబడుతున్నారు. అమెరికాకు మళ్లీ ట్రంపే అధ్యక్షుడిగా రావాలని కోరుకున్న వారే ఇప్పుడు ఆయన వద్దంటే వద్దు అని భీష్మించుకొని కూర్చున్నారు. అమెరికా కంపెనీలు బాయ్ కాట్ చెయ్యాలని ట్రంప్ చర్యలని ప్రతిఘటించాలని కొందరు భారతీయులు ప్రతిఘటించారు.

అలాగే ఈనెల 1 నుంచి 7 మధ్య వచ్చిన పోస్టల్ ను పరిగణీలకు తీసుకుంది. రష్యా నుంచి చమురు ఉత్పత్తిల కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ పై ట్రంప్ ఇప్పటి వరకు 25 శాతం సుంకాలు విధించారు. పెరాల్టీగా పేరుకుంటుూ ఈ నెల 28న మరో 25 శాతం టారిఫ్ లు విధించేందుకు ట్రంప్ యంత్రంగం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత్ పై ఆయన విధించిన టారిఫ్ ల పెరుగుదల భారతీయుల్లో ఈ ఆగ్రహానికి కారణమైంది అని కూడా చెప్పు కోవచ్చు.

Also Read: https://www.mega9tv.com/international/new-difficulties-for-americans-concern-in-the-us-demanding-trumps-resignation/