
Modi launches Pratibha Setu: ప్రధాని నరేంద్ర మోదీ 125వ మన్ కీ బాత్‌లో UPSC ఆశావహులకు ఓ గేమ్ చేంజర్‌లా ఉపయోగపడే ప్లాట్ ఫాంను పరిచయం చేశారు. అదే ప్రతిభా సేతు. ప్రతిభా సేతు అనే ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా సివిల్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించలేని, అయినా అన్ని దశలను అధిగమించిన ప్రతిభావంతులకు రెండవ అవకాశం లభిస్తుంది. అది ఎలా..? అసలు ఈ ప్రతిభా సేతు ఏంటి..? ఇది సివిల్ అభ్యర్థులకు ఏ విధంగా మేలు చేస్తుంది..? సివిల్స్ లో సెలెక్ట్ కాకపోయిన బంబర్ ఆఫర్ కొట్టొచ్చా..? మన్ కీ బాత్ లో మదీ ఇంకా ఏ అంశాలపై ప్రస్తావించారు..?
భారత దేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వాటిని పాస్ కావడం అంత సులభమైన విషయం కాదు. అయితే చాలా మంది ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ఓ కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడించారు. దీని ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు మోదీ తెలిపారు. దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటి. ప్రతి ఏడాది ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారు ఎంతో సమయం, డబ్బును ఖర్చు చేసి నిజాయతీగా కష్టపడుతున్న అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రతిభా సేతు పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు మోదీ చెప్పారు. సివిల్స్ పరీక్షల అన్ని దశలలో ఉత్తీర్ణత సాధించి.. మెరిట్ లిస్టులో పేరు లేని అభ్యర్థుల వివరాలను ఇకపై ఈ పోర్టల్‌లో ఉంచనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ వివరాలను ప్రైవేట్ కంపెనీలు తీసుకొని.. తమ సంస్థలలో వారికి ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మోదీ మన్ కీ బాత్‌లో UPSC అభ్యర్థుల వాస్తవ పరిస్థితిని మోదీ వివరించారు. UPSC దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. సివిల్ సర్వీసెస్ టాపర్ల కథలు అందరికీ ప్రేరణాత్మకంగా ఉంటాయి. కానీ మరో సత్యం ఏమిటంటే, వేలాది మంది సామర్థవంతులు కొద్దిపాటి మార్కుల తేడాతో ఫైనల్ లిస్ట్‌లో చోటు సాధించలేకపోతున్నారు. వారు మళ్లీ ఇతర పరీక్షలకు సిద్ధం కావాలి, దీనివల్ల టైమ్, మనీ వేస్ట్ అవుతాయి. అందుకే ప్రతిభా సేతు ప్లాట్‌ఫాం నిజాయతీ గల విద్యార్థుల కోసం సృష్టించబడింది అని మోదీ వివరించారు. వందలాది మంది అభ్యర్థులు ఈ పోర్టల్ సహాయంతో వెంటనే ఉపాధి పొందుతున్నారు. కొద్దిపాటి మార్కుల తేడాతో ఓడిపోయామని భావించే యువత ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది అని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. వీరికి అనేక పరిశ్రమల్లో ఉపాధి లభిస్తోందని తెలిపారు.
ప్రతిబా సేతులో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లిన వారి వివరాలు ఉంటాయి. ముఖ్యంగా పలు ప్రముఖు కంపెనీలకు దీని యాక్సస్ ఉంటుంది. సంబంధిత లాగిన్ ద్వారా ఆయా కంపెనీలు వెబ్ సైట్ లోకి వెళ్లి.. అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇప్పటికే చాలా మంది దీని ద్వారా ఉపాధి అవకాశాలు పొందారు. దీని ద్వారా యూపీఎస్సీలో జాబ్ రాకపోయినా.. వేరే మార్గంలో ఉపాధి లభిస్తుంది.. దీని ద్వారా వారు ఇంతకాలం కష్టపడిన శ్రమ వృద్ధా కాదు. పైగా యూపీఎస్సీ స్థాయి చదువు చదివిన వ్యక్తి కంపెనీల్లో పనిచేయడం వల్ల సమర్థత ఉంటుంది. Modi launches Pratibha Setu.
అలాగే మన్ కీ బాత్ పలు ఇతర అంశాలపై కూడా మోదీ చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయన్నారు. అనేక రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని.. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారన్నారు. తీవ్రంగా శ్రమిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు , భద్రతా దళాలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలు జమ్మూకశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందుకు వెళ్తుందన్నారు. ఇటీవల శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో నిర్వహించిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గురించి మోదీ ప్రస్తావించారు. దేశ్యాప్తంగా 800 మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు కూడా ఇందులో ప్రతిభ చూపారన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కశ్మీర్‌లోని పుల్వామాలో తొలి సారిగా డే-నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగిందని పేర్కొన్నారు. దేశం మార్పువైపు పయనిస్తోందనడానికి ఇవి ఉదాహరణగా నిలిచాయన్నారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q