భూమిపై ఏలియన్స్ దాడి?

Aliens attack Earth: నవంబర్‌లో భూమివైపు ఓ గ్రహశకలం వస్తోంది. అది గ్రహశకలం కాదనీ.. ఏలియన్ స్పేస్‌షిప్ అని కొందరు వాదిస్తున్నారు. దాంతో.. అమెరికా అలర్ట్ అయ్యింది.. ఏలియన్స్ భూమిపై దాడి చేస్తారేమో అనే ఆందోళనతో.. హడావుడిగా సమావేశం కావడం.. హాట్ టాపిక్ అయ్యింది.

1999వ సంవత్సరం డిసెంబర్ 31 అర్థరాత్రి 11.59 గంటలు దాటి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే ఈ భూమి మొత్తం అంతమైపోతుందట” జనాలను అత్యంత తీవ్రంగా భయపెట్టిన విషయమిది. దీనికి ముందు, ఆ తర్వాత కూడా పలు మార్లు “యుగాంతం” గురించిన చర్చ నడిచింది. ఇదంతా ఊహ. నిజంగా కలియుగం అంతమవుతుందా? అయితే ఎలా అవుతుంది? అనేది ఎవ్వరికీ తెలియదు. ఇదే తరహాలో మరో ముప్పు కూడా భూమికి పొంచి ఉందనే భయం జనాల్లో ఉంది. అదే “ఏలియన్స్” భయం. భూమ్మీద మనుషులు ఉన్నట్టుగానే, వేరే గ్రహంలో కూడా జీవం ఉండే అవకాశం చాలా వరకు ఉందని మెజారిటీ పరిశోధకులు విశ్వసిస్తున్నారు. వారు మనకంటే తెలివైన వారు, టెక్నాలజీలో ఎంతో అడ్వాన్స్డ్​ కావచ్చనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేశారు. అంతేకాదు, పలుమార్లు ఈ భూమ్మీదకు ఏలియన్స్ వచ్చివెళ్లారని నమ్మేవారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూమ్మీదకు ఏలియన్స్​ రాబోతున్నారని, అది కూడా మరో నెల రోజుల్లోనే జరగొచ్చని చెబుతున్న తాజా వార్త ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేస్తోంది.

విశ్వంలో గ్రహాలతోపాటు ఎన్నో ఆస్టరాయిడ్స్ వాటి కక్ష్యలో తిరుగుతుంటాయి. ఈ క్రమంలో కక్ష్య దాటిన కొన్ని వేరే గ్రహాలతోనో, ఆస్టరాయిడ్స్​తోనో ఢీకొని ముక్కలు చెక్కలైపోతుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్ని భూమివైపు కూడా దూసుకొస్తుంటాయి. అందులో కొన్ని భూమిని ఎక్కడో ఒక చోట ఢీకొనే అవకాశం ఉంటుంది. మరికొన్ని, భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతుంటాయి. ఇలాంటి వాటిని గుర్తించడం శాస్త్రవేత్తలకు చాలా సాధారణమైన విషయం. అయితే సైంటిస్టులు కూడా ఎన్నడూ చూడని ఓ వస్తువు ఇప్పుడు భూమివైపు దూసుకొస్తోంది. దాని విస్తీర్ణం దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సెకనుకు 60 కిలోమీటర్ల స్పీడుతో అది కదులుతోంది. ఇదే ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదేమైనా ఏలియన్స్​ వ్యోమనౌక కావచ్చా? అనేదే ఆ కలవరపాటుకు కారణం. లేటెస్ట్ రీసెర్చ్ ఒకటి ఇదే సందేహం లేవనెత్తింది. భూమిపై గ్రహాంతర జీవులు దాడి చేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు చేస్తోంది. అది కూడా ఎప్పుడో కాదు.. వచ్చే నెల నవంబరులోనే!

భూమి వైపు వచ్చేది ఏలియన్స్ నౌక కావొచ్చని సందేహిస్తున్నది మామూలు పరిశోధకులు కాదు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు! వీరిలో ప్రఖ్యాత ఖగోళభౌతిక సైంటిస్ట్ AVI లోయెబ్‌ కూడా ఉన్నారు. ఆయన కూడా అనుమానించడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఏలియన్స్​ ఉన్నారా? అనే విషయమై ఆయన ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. 2017లో భూమివైపు దూసుకొచ్చిన “ఒవుమువామువా” అనే ఖగోల వస్తువు ఏలియన్స్ సృష్టించిన పరికరమే కావచ్చని చెప్పింది ఈయనే. ఇప్పుడు భూమివైపు దూసుకొస్తున్న ఈ వస్తువుకు 3ఐ/అట్లాస్‌ అని పేరు పెట్టారు. దీన్ని కూడా ఏలియన్స్ తయారు చేసిందే కావొచ్చని ఆయన అంటున్నారు.

ఆ గ్రహశకలం సైజ్ దాదాపు 20 కిలోమీటర్లకు పైగానే ఉంటుందనే అంచనా ఉంది. ఇప్పటివరకూ భూమివైపు వచ్చిన గ్రహశకలాలన్నీ దాదాపు 1 కిలోమీటర్ సైజువే. ఇది మాత్రం 20 కిలోమీటర్లకు పైగా ఉండటం అనేది హాట్ టాపిక్ అయ్యింది. అంత పెద్దగా ఎందుకు ఉంది అనేది ఒక డౌట్. అది గ్రహశకలం కాదనీ.. ఏలియన్ స్పేస్‌షిప్ కావచ్చని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. వాళ్లు చెప్పేదాన్ని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఖండించట్లేదు. ఎందుకంటే.. అది చాలా దూరంగా ఉంది. స్పష్టంగా కనిపించట్లేదు. అందువల్ల అది కచ్చితంగా గ్రహశకలమేనా అనేది తేలట్లేదు. మరో కారణం కూడా ఉంది.

ఇప్పటివరకూ భూమివైపు వచ్చే గ్రహశకలాలన్నీ.. మన సౌర కుటుంబం లోనివే. ఐతే.. రెండు మాత్రం వేరే సూర్యుడి నుంచి మన సౌర కుటుంబం లోకి వచ్చాయి. అవి చాలా వేగంగా వచ్చాయి. వాటి వల్ల భూమికి ఏ ఆపదా రాలేదు. ఇప్పుడు వస్తున్న 2024 YR4 కూడా మన సౌర కుటుంబానిది కాదు. ఇది వేరే.. సూర్యుడు బలహీన పడిపోయిన, ఆ సూర్యుడి గ్రావిటీ తగ్గిపోయిన తర్వాత.. ఆ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకొని వస్తోందనే అంచనా ఉంది. ఐతే.. అది ఏలియన్ టెక్నాలజీ కలిగిన స్పేష్ షిప్ అనే వాదన బలపడుతోంది.

ఈ పరిస్థితుల్లో అమెరికా రక్షణ శాఖ విభాగమైన పెంటగాన్.. హడావుడిగా మీటింగ్ పెట్టబోతోంది. ఈ మీటింగ్‌లో పాల్గొనే వారంతా ప్రముఖులే. అంటే.. అమెరికా సైన్యం లోని వందల మంది జనరల్స్, అడ్మిరల్స్ పాల్గొనబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు టాప్ కమాండర్స్‌కి ఈ వారం ప్రారంభంలో.. కొన్ని సూచనలు కూడా పంపారు. ఈ సమావేశం అక్టోబర్ మొదటి వారంలో.. వర్జీనియాలోని క్వాంటికోలో జరగనుంది.అసలు ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నారో సైన్యంలోని కీలక అధికారులకు కూడా తెలియదు. అంతా రహస్యంగా ఉంది. ఇది సైనిక అధికారుల్లో ఆందోళనను పెంచుతోంది. ఈ మీటింగ్‌కి బ్రిగేడియర్ జనరల్ లేదా అంతకంటే ఉన్నత ర్యాంక్‌లో ఉన్న అందరు సీనియర్ ఆఫీసర్లూ, వారి ఎన్‌లిస్టెడ్ అడ్వైజర్లు కూడా హాజరు కావాలని ఆదేశాలు వచ్చాయి. అంటే.. O-10 ర్యాంక్‌ల వారంతా రావాల్సి ఉంటుంది. అంటే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది జనరల్స్, అడ్మిరల్స్ హాజరు కావాల్సి ఉంటుంది.

గ్రహాంతర వాసుల టెక్నాలజీ మనకన్నా ఎంతో మెరుగ్గా ఉంటుందని AVI లోయెబ్‌ చెబుతున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. గ్రహాంతర టెక్నాలజీని మెరుగు పరచాలని సూచిస్తున్నారు. కానీ, మనుషులు నేల, వనరుల కోసం కొట్లాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలియన్స్ తమ ఆయుధాలతో భూమితోపాటు ఇతర గ్రహాలను చేరితే మన పరిస్థితి సమూలంగా మారిపోతుందని అంటున్నారు. మానవులు ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టి, అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాలను అన్వేషించాలని, అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదివరకు ఎప్పుడూ పెంటగానే ఇంత పెద్ద మీటింగ్ పెట్టలేదు. ఇదో అసాధారణ ఘటన. ఈ సమావేశం.. ఆ గ్రహశకలం గురించేనా అనేది కూడా స్పష్టంగా తెలియదు. కానీ.. దాని గురించే అనే ప్రచారం మాత్రం సాగుతోంది. నాసా ప్రకారం.. అది ఒక గ్రహశకలం. దాన్ని 2024 డిసెంబర్‌లో కనుక్కున్నారు. ఈ సంవత్సరం నవంబర్‌లో ఇది భూమికి సమీపం నుంచి వెళ్తుంది. నాలుగేళ్లకు ఓసారి భూమికి దగ్గరగా వచ్చే ఈ గ్రహశకలం.. 2032లో చందమామను ఢీకొట్టవచ్చు అనే అంచనాలో నాసా ఉంది. ఈ గ్రహశకలం 15 అంతస్తుల భవనానికి సమాన పరిమాణంలో ఉంటుందని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా నిర్ధారించారు.
ఒకవేళ ఇది ఏలియన్స్ స్పేస్‌షిప్ అయితే.. అందులో ఏలియన్స్ ఉంటే.. భూమికి ప్రమాదకరంగా మారతారా? గ్రహాంతర వాసులతో మనకు యుద్ధం జరుగుతుందా? యుద్ధం జరిగితే.. అది మున్ముందు అనేక సమస్యలకు దారి తీస్తుందా? లేక ఏలియన్స్.. మనుషులతో కలిసి.. టెక్నాలజీని షేర్ చేస్తూ.. అన్ని రకాలుగా ప్రయోజనాలు కలిగిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఐతే.. కొంతమంది యూఫాలజిస్టులు.. ఏలియన్స్ వల్ల భూమికి ప్రమాదం అని హెచ్చరికలు చేస్తుండటంతో.. అమెరికా ప్రజల్లో టెన్షన్ మొదలైంది. Aliens attack Earth.

భారతీయులు ఈ గ్రహశకలాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే.. భారత్‌లో ఏలియన్స్ ఆందోళన చాలా తక్కువ. అలాంటి ఆసక్తి కూడా చాలా మందికి లేదు. కొద్ది మంది మాత్రమే ఇలాంటి అంశాలపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడి వారు.. తరచూ తమను ఏలియన్స్ ఎత్తుకెళ్లారని చెబుతుంటారు. అక్కడ ఏలియన్స్ కట్టుకథలు చాలా ఎక్కువ. కొంతమంది రచయితలు విడుదల చేసే పుస్తకాలు కూడా.. ఈ భయాలను బాగా పెంచుతున్నాయి. అందుకే.. ఈ గ్రహశకలం గురించి అమెరికాలో చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇది ఏంటి అనేది.. నవంబర్‌లో తేలే ఛాన్స్ ఉంది. అప్పడి వరకు వేచి చూద్దాం.