దేశాన్ని మార్చేస్తోంది!

Indian Railway Engineers: దేశంలో జరుగుతున్న భారీ అభివృద్ధి వెనుక, భారతీయ రైల్వే ఇంజనీరింగ్ ట్యాలెంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. సముద్రాలపై నుంచి హిమాలయాల వరకు దేశం నలుమూలలా అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

భారతదేశం రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌లో దేశం సరికొత్త శిఖరాలను అందుకుంటోంది. దేశంలో జరుగుతున్న ఈ భారీ అభివృద్ధి వెనుక, భారతీయ రైల్వే ఇంజనీరింగ్ ట్యాలెంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. సముద్రాలపై నుంచి హిమాలయాల వరకు దేశం నలుమూలలా అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా రైలును పరుగులు పెట్టిస్తోంది. ట్రైన్‌ ట్రావెలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా రీడిఫైన్ చేస్తోంది.

సముద్రంపై అద్భుతంతమిళనాడులో సముద్రంపై కట్టిన కొత్త పాంబన్ బ్రిడ్జ్ ఇండియన్ ఇంజనీరింగ్‌లో చరిత్ర సృష్టించింది. 2025 ఏప్రిల్ 6న ఓపెన్ అయిన ఈ బ్రిడ్జ్, దేశంలోనే ఫస్ట్ ‘వర్టికల్-లిఫ్ట్’ టెక్నాలజీతో నిర్మించిన సముద్రపు వంతెనగా నిలిచింది. 110 ఏళ్ల పాత బ్రిడ్జ్ స్థానంలో వచ్చిన ఈ 2.07 కిలోమీటర్ల నిర్మాణం చాలా ప్రత్యేకం. దీని మధ్యలో ఉండే 72 మీటర్ల భాగం, కేవలం 5 నిమిషాల్లోనే 22 మీటర్ల పైకి లేస్తుంది. దీంతో రైళ్ల రాకపోకలకు డిస్టర్బెన్స్ లేకుండా, కింద నుంచి షిప్స్ ఈజీగా వెళ్లిపోతాయి. సుమారు రూ.700 కోట్ల బడ్జెట్‌తో కట్టిన ఈ వంతెన, రామేశ్వరం వెళ్లే లక్షలాది భక్తులకు ఒక సేఫెస్ట్, ఫాస్టెస్ట్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.

హిమాలయాల్లో బ్రిడ్జ్‌దాదాపు 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ కల నెరవేరింది. హిమాలయాల వంటి అత్యంత కష్టమైన, డేంజరస్ ఏరియాలో ఇది ఒక గొప్ప సక్సెస్‌గా నిలిచింది. ఈ ప్రాజెక్టు లో రెండు ఐకానిక్ బ్రిడ్జ్‌లు ఉన్నాయి. ఒకటి చీనాబ్ బ్రిడ్జ్ , ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ . నది నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ వంతెన, ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది. గంటకు 260 కి.మీ స్పీడ్‌తో వీచే గాలులను కూడా ఇది తట్టుకోగలదు.

రెండోది అంజీ ఖాద్ బ్రిడ్జ్ , ఇది ఇండియాలో ఫస్ట్ కేబుల్-బేస్డ్ రైల్వే బ్రిడ్జ్. 96 భారీ కేబుల్స్ సపోర్ట్‌తో నిర్మించిన ఈ బ్రిడ్జ్, నది నుంచి 331 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే లాంగెస్ట్ రైల్వే టన్నెల్ (12.75 కి.మీ.) కూడా ఉంది. ఇప్పుడు కత్రా- శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం కావడంతో జర్నీ టైమ్ భారీగా తగ్గింది. ఇది టూరిజంతో పాటు, స్థానిక రైతుల పంటలను దేశమంతా తరలించడానికి పెద్ద ప్లస్ పాయింట్.

మిజోరం, మణిపూర్ కనెక్టివిటీఈశాన్య రాష్ట్రాలను దేశంతో కనెక్ట్ చేయడంలో రైల్వే డిపార్ట్‌మెంట్ వడివడిగా అడుగులు వేస్తోంది. రీసెంట్‌గా ఓపెన్ అయిన బైరబి– సైరంగ్ లైన్, మిజోరం రాజధాని ఐజ్వాల్‌ను నేషనల్ రైల్వే నెట్‌వర్క్‌కు దగ్గర చేసింది. త్వరలోనే జిరిబం– ఇంఫాల్ రైల్వే లైన్ ద్వారా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ను కూడా కనెక్ట్ చేయనున్నారు. ఈ రూట్‌లో 45 టన్నెల్స్, ఇజై నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పియర్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, భారత్ ట్రాన్స్- ఏషియన్ రైల్వే నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి, ఇంటర్నేషనల్ ట్రేడ్‌కు ఒక కీ-హబ్‌గా మారబోతోంది. Indian Railway Engineers.

టెక్నికల్ వండర్స్భారీ నిర్మాణాలే కాదు, రైళ్ల ఆపరేషన్‌లోనూ ఇండియన్ రైల్వే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటీవల రుద్రాస్త్ర అనే 4.5 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును సక్సెస్‌ఫుల్ గా నడిపింది. ఏకంగా 7 ఇంజన్లు, 354 వ్యాగన్లతో కూడిన ఈ భారీ రైలును లైవ్ ట్రాక్‌పై నడపడం మామూలు విషయం కాదు. ఫ్యూచర్ విషయానికి వస్తే, వందే భారత్ రైళ్లలో స్లీపర్ వెర్షన్లు రాబోతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే, మెయిన్ రూట్లలో జర్నీ టైమ్‌ను భారీగా తగ్గించి, ప్రయాణికులకు ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.