లేని దేశంతో పేరుతో ఎంబసీ పెట్టి మోసాలు..!

Delhi Fraud Embassy Abroad: ఇప్పటి వరకు ఫేక్ ఆసుపత్రులు, ఫేక్ బ్యాంకులు చూశాం. అంటే నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం రాకపోయినా ఆసుపత్రులు పెట్టి డాక్టర్లుగా చెలమణి అయిన వారు చాలా మందే ఉన్నారు. అలాగే ప్రముఖ బ్యాంకు పేరు చెప్పి .. ఓ గ్రామంలో బ్రాంచ్ ఓపెన్ చేసి డబ్బులు కొట్టేసిన ఘరానా మోసగాళ్లను కూడా భారత్ లో చూశాం. ఎటువంటి అధికారిక గుర్తింపు లేకపోయినా ఓ ద్వీపాన్ని దేశంగా ప్రకటించుకున్న స్వామీ నిత్యానందను కూడా చూశాం. కానీ ప్రపంచంలోనే లేని ఒక దేశం పేరుతో భారత్ లో ఎంబసీ ఓపెన్ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటన మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అసలు భూమీ మీద లేని దేశానికి ఎంబసీ ఎలా ఓపెన్ చేశారు..? వారికి ఈ ఐడియా ఎలా వచ్చింది.? దీనిని పోలీసులు ఎలా గుర్తించారు..? వీరికి నిత్యానందకు సంబంధం ఏంటి..?

మోసపోయే వాళ్లు ఉంటే మోసాలు చేసే వాళ్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటారు. రోజుకో రకం మోసంతో జనాల్ని నట్టెట ముంచుతూనే ఉంటారు. అమాయకుల అవసరాలను ఆసరగా చేసుకుని.. వారిని నిలువునా దోచుకుంటారు. ఈ విధంగానే విదేశాల్లో ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులను బురిడి కొట్టించాడో కేటుగాడు. అసలు దేశమే లేకుండా.. ఓ ఎంబసీ ఏర్పాటు చేసి లేని దేశంలోనే జాబులు ఇప్పిస్తామంటూ ఢిల్లీలో పెద్ద స్కామ్ నడిపాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లపై ఎంబసీ స్టిక్కర్లు, దౌత్య పాస్‌పోర్టులు, విదేశీ కరెన్సీ, దేశంలోని ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలను వాడుకున్నాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని విచారిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు సమీపంలోని గాజియాబాద్‌లో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఫేక్ దేశం క్రియేట్ చేసి మోసాలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గాజియాబాద్‌లో అతడు విలాసవంతమైన రెండు అంతస్తుల ఇంటిని అద్దెకు తీసుకొని వెస్ట్‌ఆర్కిటికా అనే దేశం పేరుతో దౌత్యకార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అయితే వెస్ట్‌ఆర్కిటికా అనేది దేశం కాదు.. అంటార్కిటికాలోని ఒక ప్రాంతం. కొన్నేళ్ల క్రితం ఒక యూఎస్‌ నౌకాదళ అధికారి దీనిని దేశంగా ప్రకటించుకున్నాడు. కానీ దీనికి ఎలాంటి గుర్తింపు లేదు. దీని పేరుతో జైన్‌ విదేశాల్లో పని ఇప్పిస్తానని యువతను నమ్మిస్తూ ఓ జాబ్‌ రాకెట్ నడుపుతున్నాడు. అలాగే మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. చివరికి మోసం బయటపడి పోలీసులకు చిక్కాడు. Delhi Fraud Embassy Abroad.

ఫేక్ ఎంబసీ మోసగాడు అతడిని నమ్మేందుకు పలు జిమ్మిక్కులు ఉపయోగించాడు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలను వాడుకున్నాడు. 2011లోనూ శాటిలైట్ ఫోన్‌ కలిగి ఉన్నాడని అతడిపై కేసు నమోదైంది కూడా. తాజాగా ఎంబసీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో అతడి కార్యకలాపాలపై అనుమానం వచ్చిన పోలీసులు.. చివరకు నకిలీ ఎంబసీ గుట్టురట్టు చేశారు. వెస్ట్‌ఆర్కిటికాతో పాటు 12 చిన్న దేశాల దౌత్యపాస్‌పోర్టులు, విదేశాంగ శాఖ స్టాంపులున్న దస్త్రాలు, 34 దేశాల స్టాంపులు, రూ.44 లక్షల నగదు, దౌత్య నంబర్‌ప్లేట్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.

2001లో ట్రావిస్ మెక్‌హెన్రీ అనే యూఎస్ అధికారి వెస్ట్‌ఆర్కిటికా దేశాన్ని ప్రకటించాడు. తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అంటార్కిటాలో 6 లక్షల చదరపుమైళ్ల మేర తనదే అని చెప్పుకున్నాడు. ఆ దేశంలో 2,536 మంది పౌరులు ఉన్నారని చెప్తున్నా.. అక్కడ ఎవరూ నివసించడం లేదు. అంటార్కిటిక్ ఒప్పందంలోని లొసుగులను ఉపయోగించుకుని దానికి తనను తాను పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం.. శాంతియుత ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే అంటార్కిటికాను ఉపయోగించుకోవాలి. మిలిటరీ, అణ్వస్త్ర కార్యక్రమాలు, వ్యర్థాలను పడేయడానికి ఏ దేశమూ దానిని వినియోగించుకోకూడదు. ఇవే నిబంధనలు ప్రైవేటు వ్యక్తుల విషయంలో లేదు. ఆ లొసుగునే ట్రావిస్ వాడుకున్నారు. ఈ వెస్ట్‌ఆర్కిటికా ఎంబసీ పేరిట ఏర్పాటు చేసిన ఇన్‌స్టాగ్రాంలో జైన్ తనను తాను ఆ దేశానికి చెందిన సంపన్నుడిగా పేర్కొన్నాడు. 2017 నుంచి దౌత్యకార్యాలయం కార్యకలాపాలు నడుస్తున్నట్లు వెల్లడించాడు.

ట్రావిస్ మెక్‌హెన్రీలానే స్వామి నిత్యానందం కూడా ఒక ద్వీపాన్ని దేశంగా ప్రకటించకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. నిత్యానందపై భారత్ లో ఎన్నో కేసులు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి విదేశాలు పారిపోయాడు. 2019లో ఈక్వెడార్ సమీపంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా అనే స్వయం ప్రకటిత మైక్రోనేషన్‌ను స్థాపించినట్లు ప్రకటించాడు. అతను ఈ దేశాన్ని హిందూ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే వారికి సురక్షిత స్వర్గధామంగా పేర్కొన్నారు. అయితే, ఈ కైలాసా దేశం ఉనికి, స్థానం, దాని చట్టబద్ధత గురించి అనేక అనుమానాలు, వివాదాలు ఉన్నాయి. ఈక్వెడార్ ప్రభుత్వం ఈ వాదనను స్పష్టంగా ఖండించింది. నిత్యానంద ఈక్వెడార్‌లో లేడని, అతను ఎలాంటి ద్వీపాన్ని కొనుగోలు చేయలేదని ఈక్వెడార్ రాయబార కార్యాలయం 2023లో స్పష్టం చేసింది. కైలాసా దేశం ఐక్యరాష్ట్ర సమితి ద్వారా గుర్తించబడలేదు. 1933 మాంటెవీడియో కన్వెన్షన్ ప్రకారం, ఒక దేశంగా గుర్తింపు పొందడానికి నిర్దిష్ట జనాభా, ప్రభుత్వం, భౌగోళిక సరిహద్దులు, ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉండాలి. కైలాసాకు ఇలాంటి ప్రమాణాలు లేవని తేల్చారు. వెస్ట్‌ఆర్కిటికాకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.. అలాంటి దేశం పేరు చెప్పి భారత్ లో చాలా మందిని మోసగించారు.

ఇప్పటి వరకు ఫేక్ ఆసుపత్రులు, ఫేక్ బ్యాంకులు చూశాం. అంటే నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం రాకపోయినా ఆసుపత్రులు పెట్టి డాక్టర్లుగా చెలమణి అయిన వారు చాలా మందే ఉన్నారు. అలాగే ప్రముఖ బ్యాంకు పేరు చెప్పి .. ఓ గ్రామంలో బ్రాంచ్ ఓపెన్ చేసి డబ్బులు కొట్టేసిన ఘరానా మోసగాళ్లను కూడా భారత్ లో చూశాం. ఎటువంటి అధికారిక గుర్తింపు లేకపోయినా ఓ ద్వీపాన్ని దేశంగా ప్రకటించుకున్న స్వామీ నిత్యానందను కూడా చూశాం. కానీ ప్రపంచంలోనే లేని ఒక దేశం పేరుతో భారత్ లో ఎంబసీ ఓపెన్ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటన మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అసలు భూమీ మీద లేని దేశానికి ఎంబసీ ఎలా ఓపెన్ చేశారు..? వారికి ఈ ఐడియా ఎలా వచ్చింది.? దీనిని పోలీసులు ఎలా గుర్తించారు..? వీరికి నిత్యానందకు సంబంధం ఏంటి..?

మోసపోయే వాళ్లు ఉంటే మోసాలు చేసే వాళ్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటారు. రోజుకో రకం మోసంతో జనాల్ని నట్టెట ముంచుతూనే ఉంటారు. అమాయకుల అవసరాలను ఆసరగా చేసుకుని.. వారిని నిలువునా దోచుకుంటారు. ఈ విధంగానే విదేశాల్లో ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులను బురిడి కొట్టించాడో కేటుగాడు. అసలు దేశమే లేకుండా.. ఓ ఎంబసీ ఏర్పాటు చేసి లేని దేశంలోనే జాబులు ఇప్పిస్తామంటూ ఢిల్లీలో పెద్ద స్కామ్ నడిపాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లపై ఎంబసీ స్టిక్కర్లు, దౌత్య పాస్‌పోర్టులు, విదేశీ కరెన్సీ, దేశంలోని ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలను వాడుకున్నాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని విచారిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు సమీపంలోని గాజియాబాద్‌లో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఫేక్ దేశం క్రియేట్ చేసి మోసాలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గాజియాబాద్‌లో అతడు విలాసవంతమైన రెండు అంతస్తుల ఇంటిని అద్దెకు తీసుకొని వెస్ట్‌ఆర్కిటికా అనే దేశం పేరుతో దౌత్యకార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అయితే వెస్ట్‌ఆర్కిటికా అనేది దేశం కాదు.. అంటార్కిటికాలోని ఒక ప్రాంతం. కొన్నేళ్ల క్రితం ఒక యూఎస్‌ నౌకాదళ అధికారి దీనిని దేశంగా ప్రకటించుకున్నాడు. కానీ దీనికి ఎలాంటి గుర్తింపు లేదు. దీని పేరుతో జైన్‌ విదేశాల్లో పని ఇప్పిస్తానని యువతను నమ్మిస్తూ ఓ జాబ్‌ రాకెట్ నడుపుతున్నాడు. అలాగే మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. చివరికి మోసం బయటపడి పోలీసులకు చిక్కాడు.

ఫేక్ ఎంబసీ మోసగాడు అతడిని నమ్మేందుకు పలు జిమ్మిక్కులు ఉపయోగించాడు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలను వాడుకున్నాడు. 2011లోనూ శాటిలైట్ ఫోన్‌ కలిగి ఉన్నాడని అతడిపై కేసు నమోదైంది కూడా. తాజాగా ఎంబసీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో అతడి కార్యకలాపాలపై అనుమానం వచ్చిన పోలీసులు.. చివరకు నకిలీ ఎంబసీ గుట్టురట్టు చేశారు. వెస్ట్‌ఆర్కిటికాతో పాటు 12 చిన్న దేశాల దౌత్యపాస్‌పోర్టులు, విదేశాంగ శాఖ స్టాంపులున్న దస్త్రాలు, 34 దేశాల స్టాంపులు, రూ.44 లక్షల నగదు, దౌత్య నంబర్‌ప్లేట్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.

2001లో ట్రావిస్ మెక్‌హెన్రీ అనే యూఎస్ అధికారి వెస్ట్‌ఆర్కిటికా దేశాన్ని ప్రకటించాడు. తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అంటార్కిటాలో 6 లక్షల చదరపుమైళ్ల మేర తనదే అని చెప్పుకున్నాడు. ఆ దేశంలో 2,536 మంది పౌరులు ఉన్నారని చెప్తున్నా.. అక్కడ ఎవరూ నివసించడం లేదు. అంటార్కిటిక్ ఒప్పందంలోని లొసుగులను ఉపయోగించుకుని దానికి తనను తాను పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం.. శాంతియుత ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే అంటార్కిటికాను ఉపయోగించుకోవాలి. మిలిటరీ, అణ్వస్త్ర కార్యక్రమాలు, వ్యర్థాలను పడేయడానికి ఏ దేశమూ దానిని వినియోగించుకోకూడదు. ఇవే నిబంధనలు ప్రైవేటు వ్యక్తుల విషయంలో లేదు. ఆ లొసుగునే ట్రావిస్ వాడుకున్నారు. ఈ వెస్ట్‌ఆర్కిటికా ఎంబసీ పేరిట ఏర్పాటు చేసిన ఇన్‌స్టాగ్రాంలో జైన్ తనను తాను ఆ దేశానికి చెందిన సంపన్నుడిగా పేర్కొన్నాడు. 2017 నుంచి దౌత్యకార్యాలయం కార్యకలాపాలు నడుస్తున్నట్లు వెల్లడించాడు.

ట్రావిస్ మెక్‌హెన్రీలానే స్వామి నిత్యానందం కూడా ఒక ద్వీపాన్ని దేశంగా ప్రకటించకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. నిత్యానందపై భారత్ లో ఎన్నో కేసులు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి విదేశాలు పారిపోయాడు. 2019లో ఈక్వెడార్ సమీపంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా అనే స్వయం ప్రకటిత మైక్రోనేషన్‌ను స్థాపించినట్లు ప్రకటించాడు. అతను ఈ దేశాన్ని హిందూ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే వారికి సురక్షిత స్వర్గధామంగా పేర్కొన్నారు. అయితే, ఈ కైలాసా దేశం ఉనికి, స్థానం, దాని చట్టబద్ధత గురించి అనేక అనుమానాలు, వివాదాలు ఉన్నాయి. ఈక్వెడార్ ప్రభుత్వం ఈ వాదనను స్పష్టంగా ఖండించింది. నిత్యానంద ఈక్వెడార్‌లో లేడని, అతను ఎలాంటి ద్వీపాన్ని కొనుగోలు చేయలేదని ఈక్వెడార్ రాయబార కార్యాలయం 2023లో స్పష్టం చేసింది. కైలాసా దేశం ఐక్యరాష్ట్ర సమితి ద్వారా గుర్తించబడలేదు. 1933 మాంటెవీడియో కన్వెన్షన్ ప్రకారం, ఒక దేశంగా గుర్తింపు పొందడానికి నిర్దిష్ట జనాభా, ప్రభుత్వం, భౌగోళిక సరిహద్దులు, ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉండాలి. కైలాసాకు ఇలాంటి ప్రమాణాలు లేవని తేల్చారు. వెస్ట్‌ఆర్కిటికాకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.. అలాంటి దేశం పేరు చెప్పి భారత్ లో చాలా మందిని మోసగించారు.

Also Read: https://www.mega9tv.com/national/ahmedabad-plane-crash-victims-bodies-changed-relatives-who-determined-they-were-not-their-family-members-uk-media-report/