ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. 2026 జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్న 8వ వేతన సంఘం ద్వారా 30% నుంచి 34% వరకు జీతాలు పెరగొచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి. అసలు కొత్త వేతన సంఘం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కలిగే లాభం ఏంటి..? జీతాలు ఎంత పెరగనున్నాయి..? ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.?

ఏ ఉద్యోగికైనా జీతం పెరగడం అంటే ఎంతో పెద్ద గుడ్ న్యూస్ .. అయితే భారీగా పెరుగుతుంది అంటే అంతకన్నా ఆనందం ఇంకెముంటుంది.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలు చేయనుందనే వార్త ఉద్యోగుల్లో జోష్ నింపింది. 8వ వేతన సంఘం ద్వారా 30% నుంచి 34% వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగొచ్చని అంబిత్ కేపిటల్ నివేదిక చెబుతోంది. 2016లో అమలైన 7వ వేతన సంఘం ద్వారా కేవలం 14% పెరుగుదల మాత్రమే జరిగింది. ఇది 1970 తర్వాత వచ్చిన అత్యల్ప వృద్ధి. అందుకే ఈసారి దాదాపు రెండింతల పెరుగుదలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని అంచనా. ఈ పెరుగుదల జీతాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులు అన్నింటిపై ప్రభావం చూపనుంది. అంబిత్ కేపిటల్ ప్రకారం, ఇది దేశవ్యాప్తంగా వినియోగాన్ని పెంచేలా, ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసేలా ఉండబోతోంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే అంశం ఈ వేతన సంఘంలో కీలకం. ఇది ప్రస్తుత బేసిక్ జీతాన్ని ఎంత రెట్టింపు చేయాలో నిర్ణయించే లెక్క. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉండడంతో, రూ.7 వేలు ఉండే బేసిక్ జీతం రూ.18,000కి పెరిగింది. Central Government Employees.

అయితే DA రీసెట్ కావడంతో అసలు పెరుగుదల 14.3% మాత్రమే అయ్యింది. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.83 నుంచి 2.46 మధ్య ఉండొచ్చని అంబిత్ కేపిటల్అంచనా. అంటే రూ.18,000 బేసిక్ జీతం రూ.32,940 నుంచి రూ.44,280 మధ్యకు చేరే అవకాశం ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందన్నదే జీత పెరుగుదలను నిర్ణయించే ప్రధాన అంశం. పెన్షన్‌దారులకు కూడా ఈ వేతన సంఘం ద్వారా లాభం ఉంటుంది. అయితే, HRA, TA వంటి అలవెన్సులు వారికి వర్తించవు కాబట్టి శాతం పరంగా లాభం కొద్దిగా తక్కువే. అంబిత్ కేపిటల్ ప్రకారం, UPS ద్వారా చివరి తీసుకున్న జీతం 50 శాతంను బేస్ పెన్షన్‌గా పరిగణించనున్నారు. ఇది నేషనల్ ప్యాన్షన్ స్కీమ్ కు ప్రత్యామ్నాయంగా 2025 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది. అంటే, 2026 నుంచి పెన్షన్‌దారులకు కూడా బేసిక్ ప్లస్ DA పెరుగుదల ద్వారా నిజమైన లాభం చేకూరనుంది.

ఈ వేతన సంఘం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడనుంది. అంబిత్ కేపిటల్అంచనా ప్రకారం, రూ.1.3 లక్షల కోట్లు నుంచి రూ.1.8 లక్షల కోట్లు వరకు అదనపు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. ఇది GDPపై 30–50 బేసిస్ పాయింట్లు ప్రభావం చూపనుంది. అయితే, వినియోగం పెరగడం, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, రిటైల్ రంగాలకు లాభం చేకూరడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 8వ వేతన సంఘం 2025 జనవరిలో ప్రకటించబడింది. కానీ ఇప్పటివరకు చైర్మన్, సభ్యులు ఇంకా ఖరారు కాలేదు. 7వ వేతన సంఘం 2014లో ప్రకటించి, 2016లో అమలులోకి వచ్చింది. అంటే 18–24 నెలల సమయం పట్టింది. అదే లాజిక్ ప్రకారం చూస్తే, 8వ వేతన సంఘం 2026 జనవరిలో అమలయ్యే అవకాశం తక్కువ. అంబిత్ కేపిటల్ప్రకారం, ఇది 2026 చివర లేదా 2027లో అమలయ్యే అవకాశం ఉంది. ఆలస్యమైతే అరియర్స్ రూపంలో అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. జీత నిర్మాణం ఎలా ఉంటుంది? ప్రభుత్వ ఉద్యోగుల జీతం ప్రధానంగా బేసిక్ పే, DA, HRA, TA, ఇతర అలవెన్సులు కలిపి ఉంటుంది. గతంలో బేసిక్ పే 65% వరకు ఉండేది. ఇప్పుడు అది 50%కి తగ్గింది. మిగతా అలవెన్సులు పెరిగాయి. 8వ వేతన సంఘం ద్వారా బేసిక్ పే పెరిగితే, DA మొదట 0 శాతంగా రీసెట్ అవుతుంది. తర్వాత CPI ఆధారంగా 6 నెలలకొకసారి పెరుగుతుంది. HRA నగరాన్ని బట్టి 30%, 20%, 10% గా ఉంటుంది. TA ఉద్యోగ స్థాయి, నగర రకాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.

అధిక స్థాయి ఉద్యోగులకు ఈ వేతన సంఘం ద్వారా బేసిక్ పే రూ.3 లక్షల నుంచి రూ.6.4 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, Level 15 ఉద్యోగి ప్రస్తుతం రూ.1,82,200 తీసుకుంటున్నాడు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.08 అయితే, అది రూ.3,78,976కి చేరుతుంది. Level 18 ఉద్యోగి రూ.2,50,000 తీసుకుంటున్నాడు. అదే ఫట్మెంట్ ఫ్యాక్టర్తో రూ.6,42,500కి పెరుగుతుంది. అంటే, ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఇది ఎంతో లాభం. వేతన సంఘం ఎందుకు అవసరం? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘం ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ప్రైవేట్ రంగంతో సమానంగా జీతాలు, ప్రతిభావంతుల్ని ప్రభుత్వ రంగంలో నిలబెట్టడం, ఆర్థిక సమతుల్యత—ఇవి సాధ్యమవుతాయి. అంబిత్ కేపిటల్ ప్రకారం, 8వ వేతన సంఘం జీత నిర్మాణాన్ని అప్‌గ్రేడ్ చేయడమే కాకుండా, దేశ ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి కూడా దోహదపడుతుంది. ఇప్పుడు కమిషన్ ఏర్పాటుకు కేంద్రం త్వరితగతిన చర్యలు తీసుకుంటే, కోటికి పైగా ఉద్యోగులు, పెన్షన్‌దారులు త్వరలోనే లాభం పొందే అవకాశం ఉంది. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.83 ఉంటే 18 వేల రూపాయల బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి 32,940 రూపాయల వరకు కొత్త బేసిక్ చేరుతుంది. అదే ఫట్మెంట్ ఫ్యాక్టర్ 2.46 ఉంటే, అదే జీతం 44,280 రూపాయల వరకు పెరుగుతుంది. అంటే, కనీసం ₹14,940 నుంచి ₹26,280 వరకు పెరుగుదల. ఇది కేవలం బేసిక్ పే మాత్రమే ఇతర అలవెన్సులు కలిస్తే మొత్తం జీతం మరింత అధికంగా ఉంటుంది. మధ్య స్థాయి ఉద్యోగులకు కూడా ₹40,000 నుండి ₹80,000 వరకు, ఉన్నత స్థాయి ఉద్యోగులకు ₹1,20,000 పైగా నుంచి ₹3,00,000 దాటి పెరుగుదల కలిగే అవకాశం ఉంది.

పెన్షన్‌దారులకు కూడా ఈ పెరుగుదల ప్రభావం ఉంటుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం, చివరి తీసుకున్న జీతం 50 శతాన్ని బేస్ పెన్షన్‌గా పరిగణించనున్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల, పెన్షన్‌దారులకు కూడా నికర పెన్షన్‌లో 5 వేల నుంచి 10 వేల వరకు తేడా కనిపించవచ్చు. DA రీసెట్ అయినా, పెరుగుతున్న CPI ఆధారంగా 6 నెలలకొకసారి అది తిరిగి పెరుగుతుంది. DA, HRA, TA వంటి అలవెన్సులు కొత్త బేసిక్ ఆధారంగా పెరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం విధానం కేంద్ర ప్రభుత్వంపై రూ.1.3 లక్షల కోట్లు నుంచి రూ.1.8 లక్షల కోట్లు వరకు అదనపు భారం పెడుతుందని అంచనా. కానీ ఉద్యోగులు, పెన్షన్‌దారుల వినియోగ సామర్థ్యం పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మెరుగవుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఖరారవుతుందన్నదే ఈ పెరుగుదల స్థాయిని నిర్ణయించబోతోంది.

Also Read: https://www.mega9tv.com/national/union-minister-shivraj-singh-chouhan-visits-manpat-and-he-amazed-to-see-the-sight-of-water-flowing-upwards/