భారీ శుభవార్త..!!

GST slab rates: కేంద్ర ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్ అందించింది. జీఎస్‌టీ స్లాబుల మార్పునకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇందులో జీఎస్టీ శ్లాబ్ లలో మార్పులు చేశారు. దీంతో పాటూ వ్యక్తిగత, జీవిత…అన్ని బీమాలకు మినహాయింపు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీఎస్టీలో రెండు శ్లాబ్ లను మాత్రమే కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. అన్ని వస్తువులపై 5, 18 శాతాల జీఎస్టీను మాత్రమే అమలు చేయనున్నారు. ఈ నెల 22 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. విలాస వస్తువులపై పన్ను మాత్రం యథావిధిగా 40 శాతమే ఉండనుంది. రైతులు, సామాన్యులను దృష్టిలో ఉంచుకుని కొత్త మార్పులను చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయం, వైద్య రంగాల్లో ఉన్నవారికి పెద్ద రిలీఫ్ కానున్నాయి కొత్త జీఎస్టీ శ్లాబ్ రేట్స్. అలాగే దీని ఫైలింగ్ కూడా సరళం చేయనున్నారు. సిగరెట్, మద్యం, లగ్జరీ వస్తువుల కోసం ప్రత్యేకంగా 40% స్లాబ్ ను కేటాయించింది.

ప్రాథమిక అంచనాల ప్రకారం, కొత్త విధానం అమలుతో రూ.93,000 కోట్ల మేర ఆదాయ నష్టం కలగవచ్చు. అయితే 40% లగ్జరీ, పాత వస్తువుల స్లాబ్ ద్వారా రూ.45,000 కోట్ల వరకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. కొన్ని రాష్ట్రాల ఆందోళనలు ఉన్నప్పటికీ, నిర్ణయం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇది జీఎస్టీని మరింత సరళమైన నిర్మాణంగా మార్చి, అనుసరణను పెంచడం, వినియోగదారుల డిమాండ్ ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (MSMEs) కూడా లాభపడతాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వారాల తరబడి జరిగే నమోదు ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తిచేయగల విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మనీ కంట్రోల్ నివేదిక తెలిపింది

జీఎస్టీ శ్లాబ్ రేట్స్ తో పాటూ బీమాలపై కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా, ఇన్సూరెన్స్ లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే వ్యక్తిగత లైఫ్‌, హెల్త్‌, టర్మ్‌ బీమా పాలసీలపై జీఎస్టీ తొలగించారు. వీటితో పాటూ 33 రకాల మందులపై 12 శాతం జీఎస్టీని పూర్తిగా తీసేశారు. థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్పిజన్, డయాగ్నోస్టిక్ కిట్ లు, గ్లూకోమీటర్లు, కళ్ళజోళ్ళ మీద 5శాతమే పన్ను విధించనున్నారు.

ఇక హెయిర్‌ ఆయిల్, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్‌ బార్, టూత్ బ్రెష్‌లు, షేవింగ్‌ క్రీమ్‌లపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. బటర్‌, నెయ్యి, చీజ్‌, డెయిరీ పదార్థాలపై..ప్రీ ప్యాక్‌డ్ నమ్‌కీన్స్‌, భుజియా, మిక్చర్లపై కూడా ఇదే అమలు చేశారు. UHT పాలు, పన్నీర్ మరియు ఇండియన్ బ్రెడ్‌లను పూర్తిగా GST నుండి మినహాయించారు. ఫీడింగ్ బాటిల్స్, చిన్న పిల్లలకు వాడే నాప్కిన్లు, క్లినికల్ డైపర్లు..ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలపై పన్ను 5 శాతినిక దిగి వచ్చింది. ట్రాక్టర్‌లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. స్పెసిపైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రింట్స్‌, బిందు సేద్య పరికరాలపై కూడా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ఇక విద్యకు సంబంధించి మ్యాప్ లు, చార్టులు, గ్లోబ్, పెన్సిళ్ళు, షార్ప్ నర్ ల్, క్రేయాన్స్, ప్యస్టెల్స్, ఎక్సర్సైజ్ పస్తకాలు, నోట్ బుక్స్ ల మీద కూడా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

ఇక 18 శాతం జీఎస్టీలోకి వచ్చే వస్తువులు..ఇలా ఉన్నాయి. ఏసీలపై జీఎస్టీని 28 శాతంనుంచి 18 శాతానికి తగ్గించారు. సిమెంట్ పై కూడా ఇదే అమలు చేశారు. 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీను 18 శాతానికి తీసుకువచ్చారు. త్రీ వీలర్లు, మానిటర్స్, ప్రొజెక్టర్‌లు, డిష్‌ వాషింగ్ మెషీన్స్‌పై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గింది. హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్‌ దిమ్మెలపై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలపై 5% పన్ను కొనసాగనుంది.

40 శాతం పన్ను కిందకు వచ్చే వస్తువుల విషయంకి వస్తే ఇలా ఉన్నాయి. రేస్‌ క్లబ్బులు, లీజింగ్‌/ రెంటల్‌ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌పై ఎప్పటిలానే 40 శాతం పన్ను పడనుంది. పాన్‌ మసాలా, సిగరెట్‌, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ..ఫ్రూట్‌ జ్యూస్‌ కాకుండా నాన్‌ ఆల్కాహాలిక్‌ బ్రేవరేజెస్‌పై కూడా ఇదే పన్నును అమలు చేయనున్నారు. అలాగే 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లపై , 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపై కూడా 40 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. GST slab rates.

అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం నుంచి పరిహారం ఇవ్వాలని కోరాయి. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు పరిహారం లేదా కనీసం అంచనా వేసిన ఆదాయ నష్టం వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q