
DRDO’s Long Range Long Attack Missile: భారత్ తయారు చేసిన LR-LACM అనే మిస్సైల్ అంతర్జాతీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దీని పేరు చెబితేనే టర్కీ వణికిపోతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ కు టర్కీ సహాయం చేసి.. భారత్ కు వ్యతిరేకంగా వినియోగించేందుకు ఆయుధాలు సరఫరా చేసింది. ఈ విషయాన్ని భారత్ మర్చిపోలేదు. ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీసే సమయం దగ్గర పడింది. గ్రీస్ కు భారత్ తయారు చేసిన LR-LACM అనే మిస్సైల్ ఇవ్వనుందనే వార్తలతో టర్కీ ఆందోళన చెందుతోంది. అసలు ఏంటీ LR-LACM ? దీని ప్రత్యేక ఏంటి..? S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉన్న టర్కీ.. ఈ మిస్సైల్ విషయంలో ఎందుకు భయపడుతోంది..?
భారత్ తయారు చేసిన లాంగ్ రేంజ్- ల్యాంట్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ షార్ట్ కట్ లో LR-LACM అంటారు. 1500 కిలోమీటర్ల ప్రయాణించే సామర్థ్యం, స్టెల్త్ టెక్నాలజీ, అణు వార్ హెడ్ లను తీసుకు వెళ్లీ ఈ క్షిపణి భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటింది. ఈ క్షిపణిని గ్రీస్ దేశానికి ఇవ్వబోతున్నారన్న వార్తలు టర్కీని ఆందోళనకు గురిచేశాయి. ఎందుకంటే ఇది టర్కీ దగ్గర ఉన్న ఎస్-400 గగన రక్షణ వ్యవస్థ దాటుకుని వెళ్లగలదు. LR-LACMని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఇది 1000-1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. మణిక్ ఎయిర్ ఇంజిన్ తో నడిచే ఈ క్షిపణి, తక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం ఉండటం వల్ల రాడార్‌లకు దొరక్కుండా వెళ్లగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్నాయి. జీపీఎస్ గైడెన్స్ తో లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తుంది. 2025 డిఫెన్స్ ఎక్స్‌పోలో భారత్-గ్రీస్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఈ మిస్సైల్ విషయంలో ఒప్పందం జరిగినట్టు సమాచారం.

గ్రీస్-టర్కీ మధ్య ఏజియన్ సముద్రం, సైప్రస్ వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీస్ చేతికి ఈ మిస్సైల్ అందితే.. టర్కీలోని ఇజ్మిర్, చనక్కలే ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేయగలదు. భారత్ విషయంలో టర్కీ పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అని టర్కీ భయపడుతోంది. 2024 నవంబర్‌లో LR-LACM విజయవంతంగా పరీక్షించబడింది. నిర్భయ్ క్షిపణి ఆధారంగా రూపొందిన ఈ క్షిపణి, ద్వారా 30 నౌకలపై అమర్చనుంది. రాఫెల్, ఎఫ్-16 వైపర్ విమానాలతో దీనిని ఇంటిగ్రీట్ చేయవచ్చు. గ్రీస్ తమ దగ్గర ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు ఈ క్షిపణిని ఇంటిగ్రేడ్ చేయడం ద్వారా టర్కీకి దాడులు చేయడం సులభం. ఇదే ఇప్పుడు టర్కీని వణికిస్తోంది. ఈ క్షిపణి టర్కీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నాశనం చేయగలదు. అయితే LR-LACM ఒక్కటే కాదు.. భారత్ అనేక అధునాతన ఆయుధాల తయారీలో ముందువరసలో ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఇండియా స్వదేశీ ఆయుధాల తయారీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దీనిలో భాగంగా అనేక కొత్త ఆయుధాలను తయారు చేశారు. DRDO’s Long Range Long Attack Missile.
భారత్ దీర్ఘశ్రేణి భూమి దాడి క్రూయిజ్ క్షిపణి- LR-LACMను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధం. ఇది 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తుంది. రాడార్‌లకు కనిపించకుండా ఉండే సాంకేతికత దీని ప్రత్యేకత. ఇది తక్కువ ఎత్తులో భూమి ఆకృతిని అనుసరించి ఎగరడం ద్వారా శత్రు రాడార్‌లను తప్పిస్తుంది. విస్తరిత శ్రేణి నీటిలో దాడి చేసే రాకెట్ – ERASR ఇది భారత నౌకాదళ శక్తిని పెంచే ఆయుధం. ఈ రాకెట్ ఐఎన్ఎస్ కవరత్తి నౌక నుంచి 17 సార్లు విజయవంతంగా పరీక్షించారు. ఇది డ్రోన్లు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలను తక్కువ ఎత్తులో ఛేదించగలదు. డీఆర్‌డీఓ, ఆర్మమెంట్ పరిశోధన సంస్థ, నావల్ సిస్టమ్స్ ల్యాబ్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. ఇక అధునాతన ఆర్టిలరీ గన్ వ్యవస్థ- ATAGS అనేది 48 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగల శక్తివంతమైన ఆయుధం. ఇది 155 ఎంఎం గన్, డీఆర్‌డీఓ, ఆర్మమెంట్ పరిశోధన సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. భారత సైన్యం ఈ గన్‌ను రంగంలోకి దింపుతోంది. భారత్ ఫోర్జ్, టాటా కంపెనీలు దీన్ని తయారు చేస్తున్నాయి. ఇది పర్వత ప్రాంతాలు, ఎడారులు వంటి కఠిన పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది. ఆటోమేటిక్ లోడింగ్ దీని వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచుతుంది.
తేజస్ ఎంకే 1ఏ- హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా తయారు చేయబడిన స్వదేశీ యుద్ధ విమానం. 2025 చివరి నాటికి 12 విమానాలు భారత వైమానిక దళానికి అందనున్నాయి. ఇది మల్టీ-రోల్ ఫైటర్ విమానంగా పనిచేస్తుంది. అధునాతన రాడార్ వ్యవస్థ, ఏఐ గైడెన్స్ కలిగి ఉంది. ఇది బ్రహ్మోస్ క్షిపణి, అణు క్షిపణులను మోసుకెళ్లగలదు. ఈ విమానం భారత వైమానిక శక్తిని పెంచడమే కాక, విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆర్మేనియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. కే-6 జలాంతర్గామి ప్రయోగ క్షిపణి.. భారత న్యూక్లియర్ ట్రైడ్ లో కీలకమైన భాగం. ఇది 8000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. మాక్ 7.5 వేగం కలిగి ఉంది. అరిహంత్ శ్రేణి జలాంతర్గాములు నుండి ప్రయోగింవచ్చు. డీఆర్‌డీఓ, అధునాతన నావల్ సిస్టమ్స్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. హైపర్‌సోనిక్ గ్లైడ్ క్షిపణి- HGV.. ప్రాజెక్ట్ విష్ణులో భాగంగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాక్ 8 వేగంతో 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 2024 నవంబర్‌లో లాంగ్ రేంజ్ యాంటీ-షిప్ హైపర్‌సోనిక్ మిస్సైల్ విజయవంతంగా పరీక్షించబడింది. స్క్రామ్‌జెట్ ఇంజిన్ దీనికి శక్తిని అందిస్తుంది.