
Major Kavitha Vasupalli Record: బ్రహ్మపుత్ర నదిలో భారత సైన్యంలో వైద్య అధికారిణి అయిన మేజర్ కవిత వాసుపల్లి సాహస యాత్రలో ఒంటరి మహిళగా రికార్డు సృష్టించారు. మేజర్ కవిత వాసుపల్లి 28 రోజుల్లో 1040 కిలోమీటర్ల దూరం బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ యాత్రలో పాల్గొని రికార్డుకు ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల శ్రీకాకుళం జిల్లా మెట్టూరు గ్రామానికి చెందిన కవిత భారత సైన్యంలో మేజర్ స్థాయికి ఎదిగారు.
సైన్యంలో ఆమె కనబర్చిన మెరుగైన పనితీరుకు మెచ్చి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అవార్డును ప్రదానం చేశారు. గౌరీచెన్ పర్వతారోహణ చేస్తుండగా ఓ బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో వృత్తిరీత్యా ఆర్మీ డాక్టరైన కవిత ఆమెకు వైద్య చికిత్స చేసి కాపాడి సురక్షితంగా ఎతైన పర్వతం కిందకు తీసుకువచ్చారు. దీనికి గాను కవితకు రాష్ట్రపతి అందించే విశిష్ఠ సేవామెడల్ కు ఎంపికయ్యారు.
ఇండో-టిబెటన్ సరిహద్దుకు సమీపంలోని గెల్లింగ్ గ్రామం నుంచి అసోంలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వరకు 28 రోజుల్లో 1,040 కిలోమీటర్ల ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించారు. బ్రహ్మపుత్ర నది రాఫ్టింగ్ యాత్రలో పాల్గొన్న ఏకైక మహిళగా చరిత్రలో తన పేరును కవిత లిఖించుకున్నారు. కల్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం రివర్ రాఫ్టింగ్ సాహసయాత్ర పూర్తి చేసింది. ఈ మార్గంలో అనేక సవాళ్లను అధిగమించి యాత్ర సాగించిన సాహస బృందంలో మేజర్ కవిత ఏకైక మహిళ.
గ్రేడ్ 4+ రాపిడ్‌లు, గడ్డకట్టే నీరు, బహుళ తెప్ప పల్టీలు వంటి తీవ్రమైన పరిస్థితులను తమ బృందం ధైర్యంగా ఎదుర్కొన్నట్లు కవిత తెలిపారు. ప్రకృతి కోపానికి భయపడకుండా తమ బృందం అచంచలమైన మానసిక బలాన్ని ప్రదర్శించి యాత్ర పూర్తి చేశామని కవిత వాసుపల్లి వివరించారు.ఆర్మీ మేజర్ కవిత అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు.
ఈ రాఫ్టింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి భారత సైనికాధికారులతోపాటు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమాఖండ్ ప్రశంసలు అందుకున్నారు. శ్రీకాకుళం పేరును జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన కవిత జీవితంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఆటంకాలు, వాటిని అధిగమించి సాహస యాత్ర చేసి రికార్డు సొంతం చేసుకున్నారు.లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బ్రహ్మపుత్రలో సాహసయాత్రలో పాల్గొన్నందుకు ఆమెకు సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చింది. Major Kavitha Vasupalli Record.
పర్వత శిఖరాలపై ఓ బాలిక ప్రాణాలను కాపాడటం నుంచి ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్రా నదిలో రాఫ్టింగ్ చేసినట్లు కవిత చెప్పుకున్నారు. మౌంట్ గోరిచెన్ పై బాలిక ఈ చారిత్రాత్మక యాత్రకు ప్రముఖ సాహసికుడు, టెన్సింగ్ నార్గే అవార్డు గ్రహీత,మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాగ్ర అధిరోహకుడు కల్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ నాయకత్వం వహించారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ డైరెక్టర్‌గా కల్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ నాయకత్వం ఈ ప్రయాణాన్ని ప్రపంచ సాహస క్రీడల్లో ఒక మైలురాయి విజయంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది అంటూ తన సాహసయాత్ర గురించి ఆర్మీ మేజర్ కవిత వాసుపల్లి వివరించారు.