
Meta AI Siddaramaiah’s post: AI వచ్చిన తర్వాత.. ట్రాన్స్ లేషన్ సులభం అయ్యింది. అయితే అలాగని ఫర్ఫెక్ట్ గా ఉందని కూడా చెప్పలేని.. ఏఐ చాట్ బోట్ లు మనం తెలుగులో ఒక విధంగా చెబితే.. ఇంగ్లీష్ లో మరోవిధంగా రాస్తున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ ఉంటి సోషల్ మీడియా ఖాతాల్లో భారతీయ భాషల్లో పోస్టులను .. ఫేస్ బుక్ ఇంగ్లీష్ లోకి అనువదిస్తోంది. అయితే ఈ అనువాదం సరిగ్గా లేకపోవడంతో చిక్కులు వస్తున్నాయి. ఇలాంటి చిక్కుల్లోనే కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఇరుక్కున్నారు. ఆయన చేసిన ఒక పోస్టు.. ఫేస్ బుక్ లో తప్పుగా అనువధించడంతో దాని అర్థం మొత్తం మారిపోయింది. దీనికి మెటా సంస్థ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ సిద్ధరామయ్య ఏం పోస్టు పెట్టారు..? దానిని ఎలా ట్రాన్స్ లేట్ చేశారు..? అసలు తెలుగు, కన్నడ వంటి సౌత్ ఇండియన్ భాషలు ఏఐ చాట్ బోట్ లకు ఎందుకు కష్టంగా ఉంది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలతో పాటు, ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నాయ. ప్రభుత్వ పథకాలు, సేవలు, సమాచారం, సంతాప ప్రకటనలు వంటివి సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్టులు ఏ భాషలో ఉన్నా.. వాటిని ఇంగ్లీష్ లోకి ఏఐ మార్చుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది భాగానే ఉన్నా.. కొన్ని సందర్భాల్లో తేడా కొడుతోంది. ఈ విధంగానే కర్ణాటక సీఎం పెట్టిన ఓ పోస్టును ఏఐ తప్పుకు అనువదించి చిక్కులు తెచ్చింది. సిద్ధరామయ్య ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో కన్నడ భాషలో ఒక సంతాప సందేశం పోస్ట్ చేశారు. సీనియర్ నటి బి. సరోజా దేవి మరణానికి సంతాపం తెలియజేస్తున్నట్టు పోస్టులో పేర్కొన్నాయి. అయితే, మెటా ఏఐ ట్రాన్స్ లేటర్ ఈ కన్నడ పోస్ట్‌ను ఇంగ్లీష్‌లోకి తప్పుగా అనువదించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహుభాషా నటి, ఆయన చనిపోయారని సీనియర్ నటి బి. సరోజా దేవి ఆయన భౌతిక కాయానికి చివరి నివాళి అర్పించారని అర్థం వచ్చేలా అనువదించింది. సిద్ధరామయ్య మరణించినట్లు ట్రాన్స్ లేషన్ చేయడంతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అందరూ షాక్ తిన్నారు. ఇది గందరగోళానికి కారణమైంది. ముఖ్యంగా కన్నడ పోస్టులను మెటా ఏఐ ఇలా తప్పుగా అనువదిస్తోందని గతంలోను ఫిర్యాదుల వచ్చాయి. ఇది సిద్ధరామయ్య పోస్టును మార్చడంతో మరింత వివాదాస్పదమైంది. దీనిపై సిద్ధరామయ్య మీడియా సలహాదారు మెటాకు ఈ విషయంపై లేఖ రాశారు. కన్నడ అనువాద సమస్యలను వెంటనే సరిచేయాలని కోరారు. Meta AI Siddaramaiah’s post.
కర్ణాటకలో సిద్ధరామయ్య పోస్టుపై ఏఐ ట్రాన్స్ లేషన్ వివాదం నేపథ్యంలో చివరికి మెటా సంస్థ క్షమాపలు చెప్పింది. కన్నడ అనువాదంలో ఏర్పడిన సమస్యను సరిచేశామని… ఇలాంటి లోపం జరిగినందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నామని తెలిపింది. ఈ సమస్య ఏఐ ఆధారిత మెషిన్ ట్రాన్స్‌లేషన్ మోడల్‌లో లోపం వల్ల వచ్చినట్లు మెటా తెలిపింది. సమస్యను సరిచేసినట్లు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు మెటా పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం కన్నడ అనువాద ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని, అనువాద ఖచ్చితత్వం మెరుగయ్యే వరకు కన్నడ భాషా నిపుణులతో కలిసి పనిచేయాలని మెటాను కోరింది. సిద్ధరామయ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలు అనువాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏఐ ట్రాన్స్ లేషన్ టూల్స్, ముఖ్యంగా న్యూరల్ మెషిన్ ట్రాన్స్‌లేషన్ మోడళ్లు, పెద్ద మొత్తంలో డేటాపై శిక్షణ పొందుతాయి. అయితే ట్రాన్స్ లేషన్ విషయంలో అప్పుడప్పుడు తప్పుగా పనిచేస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కన్నడ, తెలుగు వంటి భారతీయ భాషలకు ఇంగ్లీష్‌తో పోలిస్తే తక్కువ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ భాషల్లోని వ్యాకరణం, సాంస్కృతిక సందర్భాలను ఏఐ సరిగా గుర్తించలేకపోతుంది. ఏఐ అనువాద సాధనాలు తరచూ సందర్భాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతాయి. ఉదాహరణకు సిద్ధరామయ్య పోస్ట్‌లో మరణించారు అనే పదం సరోజా దేవికి సంబంధించినదని ఏఐ గుర్తించలేక, సిద్ధరామయ్యకు అన్వయించింది. కన్నడ, తెలుగు వంటి ద్రావిడ భాషల్లో వ్యాకరణ నిర్మాణం, వాక్య రచన ఇంగ్లీష్‌తో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏఐ మోడళ్లు ఈ సంక్లిష్టతను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి. భారతీయ భాషల్లోని సామెతలు, స్థానిక వ్యవహారాలు, సాంస్కృతిక సూచనలు ఏఐకి అర్థం కావడం కష్టం. నీరాజనం అర్పించారు వంటి పదబంధాలు ఇంగ్లీష్‌లో సరైన అనువాదం కోసం సాంస్కృతిక సందర్భం అవసరం. మెటా వంటి సంస్థలు ఈ సమస్యలను గుర్తించి, అనువాద ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి నిరంతరం ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నాయి, కానీ ఇప్పటికీ పూర్తి ఖచ్చితత్వం సాధించలేకపోతున్నాయి.
ముఖ్యంగా తెలుగు ట్రాన్స్ లేషన్ లో ఏఐ చాట్ బాట్ లు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. తెలుగు ఒక ద్రావిడ భాష, దీనిలో వాక్య నిర్మాణం ఇంగ్లీష్ తో భిన్నంగా ఉంటుంది. నేను పుస్తకం చదివాను అనే వాక్యాన్ని ఏఐ తరచూ తప్పుగా I book read అని అనువదిస్తుంది. తెలుగులో ఒకే పదానికి సందర్భాన్ని బట్టి చాలా అర్థాలు ఉంటాయి. ఏఐ ఈ చిన్న తేడాలను గుర్తించడంలో తడబడుతోంది. తెలుగులో స్థానిక సామెతలు, యాస, సాంస్కృతిక సూచనలు ఏఐకి అర్థం కావడం కష్టం. తెలుగు, కన్నడ వంటి భారతీయ భాషలకు శిక్షణ డేటా ఇంగ్లీష్, స్పానిష్ వంటి భాషలతో పోలిస్తే చాలా తక్కువ. దీని వల్ల ఏఐ మోడళ్లు ఈ భాషలను సరిగా నేర్చుకోలేకపోతున్నాయి. ఏఐ చాట్‌బాట్‌లు తరచూ వాక్యం సామాజిక, సాంస్కృతిక సందర్భాన్ని అర్థం చేసుకోలేకపోతాయి, దీని వల్ల అనువాదాలు తప్పుగా ఉంటాయి.
ఏఐ చాట్‌బాట్‌లు, ట్రాన్స్ లేషన్ ను మెరుగుపరచడానికి సంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తెలుగు, కన్నడ వంటి భారతీయ భాషలకు సంబంధించిన పెద్ద డేటాసెట్‌లను సేకరించి, ఏఐ మోడళ్లను శిక్షణ ఇస్తున్నాయి. మెటా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వంటి భాషలలో ఫాక్ట్-చెకింగ్ కోసం స్థానిక సంస్థలతో భాగస్వామ్యం అవుతోంది. ట్రాన్స్‌ఫార్మర్-ఆధారిత మోడళ్లను అప్‌గ్రేడ్ చేస్తూ, సామాజిక, సాంస్కృతిక సందర్భాలను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం సూచించినట్లు, స్థానిక భాషా నిపుణులతో కలిసి పనిచేసి, అనువాద ఖచ్చితత్వాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏఐ అనువాదాలను మానవ సంపాదకులతో కలిపి ధృవీకరించే హైబ్రిడ్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇది తప్పులను తగ్గిస్తుంది. మెటా వంటి సంస్థలు యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను రియల్-టైమ్‌లో సేకరించి, అనువాద మోడళ్లను నిరంతరం మెరుగుపరుస్తున్నాయి.