అందాల రాణి… ఆర్మీ ఆఫీసర్..!

Miss International Kashish Methwani: అందాల కిరీటాన్ని అందుకున్న సుందరాంగి..చదువులో సరస్వతి..ఆమె మనోహరమైన రూపానికి ఫిదా అయ్యి… మోడలింగ్, యాక్టింగ్ లో ఆఫర్లు క్యూలు కట్టాయి.. మరోవైపు చదువుల తల్లి అయిన ఈ బ్యూటీకి..హార్వర్డ్ లో పీహెచ్ డీ చేసే ఛాన్స్ వచ్చింది. నార్మల్ గా మిగతా అమ్మాయిలైతే…ఈ ఆఫర్లకు ఎగిరి గంతులేస్తారు.కానీ ఈమె రూటే వేరు… ఇవేమీ ఆమె కలలను డైవర్ట్ చేయలేకపోయాయి. వన్స్ గురిపెడితే…పక్కగా టార్గెట్ రీచ్ అవ్వాలనుకునే అగ్గిపుల్లలాంటి అమ్మాయి ఈమె.అందం ఉందని విర్రవీగలేదు..చదువు ఉంది కదా అని తన దారి తాను చూసుకోలేదు.. దేశం కోసం నేను సైతం అంటూ సైన్యంలోకి చేరింది. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన కశిష్ మెత్వానీ ఎందుకు ఆర్మీ వైపు వెళ్లింది? ఫ్యాషన్ రంగాన్నిఎందుకు వద్దనుకుంది? హార్వర్డ్ లో ఛాన్స్ వచ్చినా నో ఛాన్స్ అని ఎందుకంది? లెట్స్ వాచ్ దిస్ వీడియో.

కశిష్ మెత్వానీ పుట్టింది ముంబైలో. ఆమె తల్లి శోభా మెత్వానీ టీచర్. తండ్రి గురుముఖ్ దాస్ డాక్టర్. అయితే తల్లిదండ్రుల వృత్తిరీత్యా షిల్లాంగ్, ఢిల్లీ అంటూ చాలాచోట్ల తిరిగి చివరకు పుణెలో సెటిల్ అయ్యారు. ఎనిమిదేళ్లు వయసులోనే కశిష్ కి ఫస్ట్ టైమ్ అందాల ప్రపంచం పరిచయమైంది. స్కూల్లో సరదాగా జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అందరి ముందు ర్యాంప్‌ మీద నడవడం.. మిరుమిట్లు గొలిపే లైట్లు, అడుగడుగునా క్లిక్‌మనిపించే కెమెరాలు ఆ వాతావరణం కశీష్ కు బాగా నచ్చాయి. దీంతో స్కూలు, కాలేజ్ డేస్ లో జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఎక్కడ అందాల పోటీలు ఉన్నా పాల్గొనేది… బోలెడన్ని కిరీటాలూ గెలుచుకుంది. అలా ఆమెకు ఫ్యాషన్ రంగంపై ఆసక్తిని పెంచుకుంది. ఓ రోజు తాను మిస్ ఇండియా కావాలనుకుంది.అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

2022లో కశీష్ మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుని తన చిన్ననాటి కలను నెరవేర్చుకుంది. కశిష్ మల్టీ టాలెంటెడ్. ఆమె తబలా బాగా వాయించగలదు. భరత నాట్యం చేస్తుంది. నేషనల్ లెవెల్ పిస్టల్‌ షూటర్‌ కూడా. టేబుల్‌ టెన్నిస్, బాస్కెట్‌ బాల్‌ ఇలా చాలా వరకు స్పోర్ట్స్ లోనూ తన సత్తా ఏంటో చూపించింది. ఎన్నో బహుమతులను గెలుచుకుంది. క్రిటికల్‌ కాజ్‌ అనే ఓ ఎన్‌జీఓనీ కూడా నడుపుతోంది. కశీష్ వీటన్నింటిలో పడి చదువుని పక్కన పెట్టేసి ఉంటుందని అనుకుంటున్నారేమో ..నో.. వే..చదువులోనూ ఆమె టాపరే. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ , బెంగళూరు నుంచి ఎంఎస్‌సీ న్యూరోసైన్స్‌ థీసిస్‌నీ కంప్లీట్ చేసింది. తన ప్రతిభకు గుర్తింపుగా హార్వర్డ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసే ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వెల్లువెత్తాయి. దీంతో కశీష్ ఇటు మోడల్‌గా ఫ్యాషన్ రంగంవైపు వెళ్లడమో.. అటు పైచదువులకు హార్వర్డ్‌కి వెళ్లడమో చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ రెండూ కాదని ఆర్మీలోకి అడుగుపెట్టి అందరినీ షాక్ కి గురిచేసింది.

కశిష్ చిన్నతనంలో ఆర్మీ స్కూల్లో చదువుకుంది. ఎన్‌సీసీ క్యాడెట్‌ కూడా. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో ఎన్‌సీసీ విద్యార్థులకు నాయకత్వం వహించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా బెస్ట్‌ క్యాడెట్‌ అవార్డుని అందుకుంది. ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. వాటిని సాధించడానికి ధైర్యంతోపాటు క్రమశిక్షణ కూడా కావాలి. అలాంటి డిసిప్లేన్ కశీష్ కు ఎన్‌సీసీ అందించింది . తనను ప్రతిదశలో ముందుకు తీసుకెళ్లింది అక్కడి శిక్షణే అని చెబుతుంది కశీష్. అందుకే ఆమె దేశసేవలో పాలుపంచుకోవాలనుకుంది. తన కోసం తాను బతకడం కాకుండా .. నలుగురికీ సాయపడాలని నిర్ణయించుకుంది. పైగా ఫైటర్‌ పైలట్‌ అవ్వాలన్నది ఆమె కన్న కలల్లో ఒకటి. ఆర్మీలో చేరితే..దేశ సేవతో పాటు తన కలనీ నెరవేర్చుకోవచ్చు అని భావించింది.

2024లో కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్ రాసింది. నేషనల్ లెవెల్ లో రెండో ర్యాంకు సాధించింది. చెన్నై ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసింది.ట్రైనింగ్ సమయంలో ఆమెతో పరిచయం ఉన్న చాలామంది కశీష్ ని టాలెంట్‌ ప్యాక్, ఆత్మవిశ్వాసం, సేవలకు ప్రతిరూపం అంటారు. అలా 2025 సెప్టెంబర్ 6న ఆమెకు లెఫ్టినెంట్ హోదా లభించింది. శిక్షణ సమయంలో ఆమె తన జుట్టును కూడా దానం చేసింది..ఇది తనకు దేశం పట్ల ఉన్న భక్తిని నిదర్శనంగా నిలుస్తుంది. Miss International Kashish Methwani.

లైఫ్ ఈజ్ వెరీ షార్ట్..దాన్ని ఏదోలా జీవించేస్తే ఎలా? మనకంటూ ఓ ఐడెంటిటీ ఉండాలిగా అంటుంది కశిష్. అలాగని ఒకే రంగంలో ఉండిపోవడం ఈమెకు నచ్చదు. తోచిన ,చేయగలిగినవ్నీ చేస్తూ ముందుకెళ్తూ ప్రతి దానిలో ప్రత్యేక గుర్తింపు సాధించాలన్నది కశీష్ లైఫ్ ఫిలాసఫీ . అలా తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది కశిష్ మెత్వానీ.