ఆ సమాధిని చెప్పులతో కొడతారు ఎందుకో తెలుసా?

Mystery of Bholan Syed Tombs: ప్రముఖుల సమాధులకు చాదర్, పూల మాలలను సమర్పించి అందరూ గౌరవిస్తుంటారు ఇది మనం చూస్తూనే ఉంటాం. ప్రజలు వాటి వద్ద సుగంధాన్ని వెదజల్లే అగరుబత్తీలనూ వెలిగిస్తారు. కానీ 900 ఏళ్లుగా ప్రజలు ఓ ప్రాచీన సమాధిని చెప్పులతో కసితీరా కొడుతుంటారు. ఇంతటి అవమానాన్ని ఎదుర్కొంటున్న సమాధిని చాడీకోరు సమాధి’ అని పిలుస్తుంటారు. చనిపోయాక కూడా అవమాన భారాన్ని మోస్తున్న ఈ చాడీకోరు ఎవరు? అతడు చేసిన దేశ ద్రోహం ఏమిటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ

‘చెవిలో తేనెపోసి చెడగొట్టేవాడు చాడీకోరు’ అంటారు పెద్దలు. ఇలాంటి వాళ్లకు సమాజంలో గౌరవం కానీ, విలువ కానీ అస్సలు ఉండదు. చివరకు చనిపోయాక కూడా వారు అవమానాన్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉత్తర్​ ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా దాతావలి గ్రామం ఫ్రెండ్స్ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న చాడీకోరు సమాధే అందుకు నిదర్శనం. ఈ సమాధి వద్దకు కూడా జనం వస్తుంటారు. అయితే ప్రార్థనలు చేయడానికి కాదండోయ్. వందల శతాబ్దాల క్రితం ప్రారంభమైన ఆచారం ప్రకారం, ఈ సమాధిని ఐదుసార్లు చెప్పులతో కొట్టడానికి! రాజుకు, రాజ్యానికి వ్యతిరేకంగా పరాయి దేశపు శత్రువులకు రహస్యాలను చేరవేసిన ఓ వ్యక్తిని ఆ సమాధిలో ఖననం చేశారని చెబుతుంటారు. దీనితో ముడిపడిన మూడు ఆసక్తికర కథలు బాగా వైరల్ అయ్యాయి.

సెంట్రల్ అఫ్గానిస్థాన్‌కు చెందిన మహ్మద్ ఘోరీ భారీ సైన్యంతో 1194లో భారత్‌పై దండయాత్ర చేశాడు. అప్పట్లో ఉత్తర్​ ప్రదేశ్‌లోని కనౌజ్ ప్రాంతాన్ని రాథోడ్ రాజవంశానికి చెందిన రాజా జైచంద్ పాలించేవారు. ఆగ్రా సమీపంలోని యమునా తీరం వద్దనున్న చందావర్ వద్ద రాజా జైచంద్, మహ్మద్ ఘోరీ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాజా జైచంద్‌కు రాజా సుమేర్ సింగ్ సైనిక సాయం చేశారు. ఓ చాడీకోరు కారణంగా రాజా సుమేర్ సింగ్‌ సైన్యం, కోటలు, రాజభవనాల సమాచారం మహ్మద్ ఘోరీకి చేరిపోయింది. దీంతో ‘చందావర్ యుద్ధం’లో అతడు ఈజీగా విజయం సాధించాడు. ఒక్క చాడీకోరు వెన్నుపోటు వల్ల ఆ యుద్ధంలో రాజా సుమేర్ సింగ్‌కు చెందిన 500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి రాజా సుమేర్ సింగ్‌ రాజభవనానికి కొంత దూరంలోని గుడిసెలో ఫకీరుగా మారువేషంలో నివసిస్తూ సైన్యం, ఆయుధాల సమాచారాన్ని సేకరించాడని గుర్తించారు. ఆ వ్యక్తి మహ్మద్ ఘోరీ గూఢచారే అయి ఉండొచ్చని చెబుతారు. అయితే దీనికి ఎటువంటి ఫ్రూవ్స్ మాత్రం లేవు.

మహ్మద్ ఘోరీ కోసం ఈ గూఢచర్యం చేసిన వ్యక్తి ఉత్తర్​ ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా దాతావలి గ్రామస్థుడే. రాజా సుమేర్ సింగ్ రహస్య సైనిక సమాచారాన్ని అతడు సేకరించి మహ్మద్ ఘోరీకి పంపాడట. అందుకే అతడిని ఖననం చేసిన తర్వాత, సమాధిపైకి బూట్లు, చెప్పులను విసిరే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఆ సమాధిలో దేశద్రోహి, చాడీకోరు ఉన్నాడని అందరికీ చెప్పేందుకే ఈ సంప్రదాయాన్ని ఆరంభించారని చెబుతుంటారు. ఇక ఇప్పటికీ ప్రజలు అదే సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

ప్రముఖ కవి చాంద్ బర్దాయ్ రచించిన ‘పృథ్వీరాజ్ రాసో’ ఉదయపుర్ వర్షన్‌లో చాడీకోరు సమాధి గురించి మరో స్పెషల్ స్టోరీ ఉంది . ప్రతాప్ సింగ్ జైన్, ధర్మయన్ కాయస్థ, మాధవ్ భట్ అనే ముగ్గురు వ్యక్తులు రాజా జైచంద్‌పై నిఘా పెట్టి మొత్తం సైనిక వివరాలను సేకరించారు. తరువాత వారు మహ్మద్ ఘోరీని చందావర్‌కు ఆహ్వానించారని ఆ చారిత్రక గ్రంథంలో ప్రస్తావన ఉంది. అయితే వీరిలో ఎవరిని దాతావలి గ్రామంలో ఖననం చేశారు అనే సమాచారం పృథ్వీరాజ్ రాసోలో అందుబాటులో లేదు.

మహ్మద్ ఘోరీ దండయాత్రల కాలంలో భోలన్ సయ్యద్ అనే వ్యక్తి చాడీకోరుగా వ్యవహరించేవాడని చెబుతుంటారు.అతడి సమాధి నీలకంఠ ఆలయం వెనుక ఉందని అంటారు. అయితే చాడీకోరు సమాధి ఇటావా పట్టణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని దాతావలి గ్రామం సమీపంలో ఉంది. ఒకే వ్యక్తికి రెండు సమాధులు ఉండే ఛాన్స్ లేదు. వీటిలో ఏది భోలన్ సయ్యద్‌ సమాధి? అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. సరైన ఆధారాలు లభించే వరకు పర్యాటక కోణంలో దాతావలి గ్రామం సమీపంలోని చాడీకోరు సమాధి స్థలాన్ని అందంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అంటున్నారు.

వందల ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఇటావా రాజు దగ్గర పనిచేసేవాడు. అతడికి చాడీలు చెప్పే అలవాటు ఉండేది. దీంతో రాజ్యం రహస్యాలను బయటి రాజ్యాలకు చేరవేసేవాడు. రాజుకు ఆ విషయం తెలియగానే, అతడికి మరణశిక్ష విధించాడు. తరువాత అతడిని దాతావలి గ్రామం సమీపంలోని రోడ్డు వెంటే ఖననం చేయించారు. దారిన రాకపోకలు సాగించే వాళ్లు చెప్పుతో కొట్టేందుకు అనువుగా ఉండేందుకే ఇలా రోడ్డు పక్కన చాడీకోరు సమాధిని కట్టించారు. ఇక మరోవైపు రంజాన్ ఈద్, బక్రీద్ నాడు ప్రజలు చాడీకోరు సమాధి వద్ద చాదర్ సమర్పిస్తుంటారు. ఇంకొందరు ధూపం కర్రలను కూడా వెలిగిస్తారు. అక్కడ తాము కోరుకునే కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతుంటారు.

దేశ ద్రోహులను ఎవరూ గౌరవించరు. వందల ఏళ్ల క్రితం తనకు తిండి పెడుతున్న రాజు రహస్యాలను ఓ వ్యక్తి శత్రువులకు చేరవేశాడు. దీనివల్ల ఆ రాజుకు భారీ నష్టం జరిగింది. ఇదంతా ఓ చాడీకోరు పనే అని రాజు గుర్తించాడు. దీంతో అతడిని చంపమని ఆదేశం జారీ చేశాడు. ఈ విధంగానే దాతావలి గ్రామ శివార్లలో చాడీకోరు సమాధి నిర్మితమైంది. అతడు దేశానికి చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలు ఆ సమాధిని చెప్పులతో కొడుతుంటారు. నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. Mystery of Bholan Syed Tombs.

అచ్చం ఇదే తరహాలో పంజాబ్‌ రాష్ట్రంలో నూరుద్దీన్ అనే వ్యక్తి సమాధిపైకి నేటికీ ప్రజలు చెప్పులను విసురుతుంటారు. అతడు గురు గోవింద్ సింగ్‌పై గూఢచర్యం చేశాడని అంటారు. భారతీయ సమాజం గూఢచారులను, దేశద్రోహులను గౌరవించదు. ఇందుకు నిదర్శనాలే ఈ సమాధులు. మరణానంతరం కూడా అలాంటి వ్యక్తుల సమాధులకు కనీస గౌరవం లభించడం లేదు. ఇక 900 ఏళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.