
Asim Munir Nuclear Bomb Threat: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన అమెరికా పర్యటనలో భారత్‌పై తీవ్రమైన అణ్వాయుధ బెదిరింపులు చేశారు. సింధు జలాల వివాదం, ఆనకట్ట నిర్మాణం వంటి అంశాలపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన హెచ్చరించారు. భారతదేశం తన ఉనికికి ముప్పు కలిగిస్తే, పాకిస్తాన్ సగం ప్రపంచాన్ని మట్టుపెడతాం చేస్తుందని మునీర్ హెచ్చరించారు.
భారత్‌తో విభేదాల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ రెండోసారి అమెరికాకు వెళ్లారు. అమెరికా నుంచి భారత్‌కు అణు బెదిరింపులు జారీ చేశారు. భవిష్యత్తులో భారత్ నుంచి తన దేశ ఉనికికి ముప్పు ఎదురైతే.. భారత్‌తో పాటు సగం ప్రపంచాన్ని మట్టుపెడ్డిస్తామని హెచ్చరించారు. టంపాలో పాకిస్తాన్ గౌరవ కాన్సుల్‌గా పనిచేస్తున్న వ్యాపారవేత్త అద్నాన్ అసద్ కోసం తాను ఏర్పాటు చేసిన బ్లాక్-టై విందు సందర్భంగా మునీర్ అమెరికా నేల నుండి ఈ అణు బెదిరింపులు చేశారు.
తమది అణ్వస్త్ర దేశం, తాము పతనమవుతున్నామని అనుకుంటే, సగం ప్రపంచాన్ని కూడా తమతో పాటు తీసుకెళ్తాం” అని టంపాలో జరిగిన కార్యక్రమంలో మునీర్ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై మునీర్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, నదీ జలాలు నిలిపివేయాలనే నిర్ణయం 250 మిలియన్ల మంది ప్రజలను ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అన్నారు. Asim Munir Nuclear Bomb Threat.
భారత్ ఆనకట్ట నిర్మించే వరకు తాము వేచి ఉంటామని , తర్వాత 10 క్షిపణులతో ఆనకట్టను కూల్చేస్తాం అని బెదిరింపులకు దిగారు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు, తమకు క్షిపణుల కొరత లేదంటూ చెప్పుకొచ్చారు. మునీర్ తన ప్రసంగంలో భారత్‌తో జరిగిన సంఘర్షణ గురించి అనేకసార్లు ప్రస్తావించారు. అయితే మునీర్ మాట్లాడిన కార్యక్రమానికి వచ్చే అతిథులు సెల్‌ఫోన్‌లు లేదా ఇతర డిజిటల్ పరికరాలను తీసుకెళ్లడం నిషేధించారు. ప్రసంగం అధికారిక ట్రాన్స్క్రిప్ట్‌ను విడుదల చేయలేదు. హాజరైన అనేక మంది చెప్పిన ఆధారంగా ఈ విషయం బయట పడింది.