
Ishaq dar Shocks Trump: ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు తాను కృషి చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. గత కొంతకాలం నుంచి సొంత డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపినట్లు ట్రంప్ తరచూ చెప్తూ వస్తున్నారు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగకుండా.. తాను మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే భారత్ మాత్రం.. తాము ఎవరి మధ్యవర్తిత్వంతో దాడులు ఆపలేదని.. పాకిస్తాన్ చేసిన విజ్ఞప్తి మేరకే ఆపేసినట్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ట్రంప్ మాత్రం దానికి క్రెడిట్ తనదేనని మొండి పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఓ క్లారిటీ ఇచ్చారు. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే చొరవ తీసుకున్నానని, తన హెచ్చరికల వల్లే యుద్ధం ఆగిపోయిందని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్లోని డొల్లతనాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బయటపెట్టారు. కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ ఎంతమాత్రం అంగీకరించలేదని తేల్చిచెప్పారు. అంటే ట్రంప్ చెప్పినదంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేశారు.
భారత్–పాక్‌ల నడుమ మధ్యవర్తిత్వం వహించానని, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశానని ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నుంచి వివరణ కోరామని ఇషాక్ దార్ తెలిపారు. ద్వైపాక్షిక అంశాలపై థర్డ్ పార్టీ జోక్యాన్ని భారత్ ఒప్పుకోవడం లేదంటూ ఆయన తమతో చెప్పారని వివరించారు. కీలకం అంశాలపై పొరుగుదేశంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ, తమతో చర్చలపై భారత్ స్పందించడం లేదని చెప్పారు. భారత్‌తో ఇటీవల సంప్రదింపులు ఏమైనా జరిగాయా? మూడో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇషాక్ దార్ బదులిచ్చారు. అలాంటిదేమీ లేదని అన్నారు. రెండు దేశాల వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని వెల్లడించారు.
కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ ఆమెరికా నుంచి మే 10వ తేదీన ఆఫర్ వచ్చింది. ఒక తటస్థ వేదికపై అతిత్వరలో చర్చలు ప్రారంభిద్దామని మార్కో రూబియో తమకు చెప్పారన్నారు. కానీ, ఆ చర్చలేవీ జరగలేదు. జూలై 25వ తేదీన వాషింగ్టన్‌లో జరిగిన భేటీలో రూబియో కలిశారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం మీరు ఏర్పాటు చేస్తారన్న సమావేశం ఎందుకు జరగలేదని ప్రశ్నించాను. ఇది ద్వైపాక్షిక అంశమని, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని భారత్ తేల్చిచెప్పిందని, అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారు.
భారత్, పాక్‌ల సంబంధించినది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని భారత్ చెబుతుండగా ఇక మేము ఏం చేయగలం. మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్‌ను అడుక్కోలేం కదా! శాంతిని కోరుకొనే దేశం పాకిస్తాన్. చర్చల ద్వారాపై సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వసిస్తున్నారు. అందుకు రెండు దేశాలూ ముందుకు రావాలి చర్చలకు భారత్ ఒప్పుకుంటే తాము రెడీ గా ఉన్నామన్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థికం, జమ్మూకశీ్మర్ తదితర అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి… థర్డ్ పార్టీని అనుమతించాలని తాము పట్టుబట్టడం లేదు’’ అని ఇషాక్ దార్ సూచించారు.
ఇక ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడమే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఆపరేషన్ ముగిసింది. భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ రెండు దేశాల ప్రభుత్వాల కంటే ముందే ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్టుచేశారు. దీనిపై విమర్శలు వచ్చినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.
ట్రంప్ వాదనను భారత్ ఖండించినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన పాటే తానే పాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటన.. ట్రంప్ చేస్తున్న వాదన తప్పు అని మరోసారి స్పష్టం చేస్తోంది. అదే సమయంలో భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉన్న అన్ని రకాల సమస్యలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని మొదటి నుంచీ చెబుతున్న భారత్ దీర్ఘకాలిక విధానానికి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇచ్చాయి. Ishaq dar Shocks Trump.
భారత్, పాక్‌లపై వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధం ఆగేలా చేశానని, ఆ క్రెడిట్ తనకే దక్కాలని, అంతేకాకుండా నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనిపై భారత్ స్పందిస్తూ ట్రంప్ వాదనను పలుమార్లు తిప్పికొట్టింది. రెండు దేశాలతో సంబంధం లేని మూడో వ్యక్తి చెబితే కాల్పుల విరమణకు తామెందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించింది. పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి ప్రాధేయపడడం వల్లే దాడులు ఆపేశామని స్పష్టంచేసింది. నోబెల్ శాంతి బహుమతికి తన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని ట్రంప్ విజ్ఞప్తి చేయగా, భారత్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఇక విషయంతో ట్రంప్ తోక ముడవక తప్పలేదనట్లు తెలుస్తుంది.