
Procter & Gamble CEO Shailesh Jejurikar: ఏరియల్, టైడ్, విక్స్, ఓవరల్ బీ, ప్యాంపర్స్ .. రోజు మనం ఏదో ఒక సమయంలో టీవీలో వీటికి సంబంధించిన యాడ్స్ చూస్తూనే ఉంటాం. పీ అండ్ జీ కంపెనీకి చెందిన ఈ ప్రొడెక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్.. వీటితో పాటు ఇంకా అనేక రకాల బ్రాండ్లతో అమెరికాకు చెందిన ఈ పీ అండ్ జీ కంపెనీ సుమారు 187 ఏళ్లుగా ప్రపంచ మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది. అలాంటి ఈ కంపెనీకి భారత్ కు చెందిన… అదీ మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న శైలేష్ జెజురికర్ సీఈవోగా నియమితులయ్యారు. ఓ పక్క భారతీయులను అమెరికా కంపెనీల్లో నియమించుకోవద్దని ట్రంప్ హెచ్చరించిన నాలుగు రోజులకే పీ అండ్ జీ కంపెనీ శైలేష్ జెజురికర్ ను సీఈవోగా నిలమించింది. దీనిని ఎలా చూడొచ్చు..? అసలు శైలేష్ జెజురికర్ ను పీ అండ్ జీ కంపెనీలో టాప్ స్థానానికి వెళ్లడానికి కారణం ఏంటి..? ట్రంప్ చెప్పినా చాలా అమెరికా కంపెనీలు భారతీయులకే కీలక పోస్టులు ఎందుకు ఇస్తున్నాయి..? శైలేష్ జెజురికర్ కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్లకు సంబంధం ఏంటి..?
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే మాట విన్నాం.. అలాగే కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థానానికి తప్పక చేరుకుంటాం. ఇది అమెరికా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల విషయంలో నిజమవుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ప్రతినిత్యం ఉపయోగించే వస్తువో, కంప్యూటరో, లేక ఏదైనా సాఫ్ట్ వేరో.. ఏదైనా కావొచ్చు.. అవి తయారు చేసే కంపెనీల్లో భారతీయులు ఉంటున్నారు. అంతేకాదు వాటిలో టాప్ ప్లేసులకు వెళ్తున్నారు. దీనికి భారతీయుల కష్టపడేతత్వం, తెలివితేటలే కారణం. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ప్రోక్టర్ అండ్ గాంబుల్ .. షార్ట్ కట్ లో పీ అండ్ జీ అని పిలిచే కంపెనీకి భారత్ కు చెందిన శైలేష్ జెజురికర్ సీఈవోగా నియమితులయ్యారు. 187 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీలో భారతీయ సంతతి వ్యక్తి సీఈవోగా నియమితులవడం ఇదే తొలిసారి. అమెరికాలో భారతీయ ప్రొఫెషనల్స్‌పై ట్రంప్ విధానాలు కఠినంగా ఉన్న సమయంలో ఈ నియామకం భారతీయుల నైపుణ్యానికి వారి సామర్థ్యానికి నిదర్శనం. ట్రంప్ హెచ్-1బీ వీసాలను పరిమితం చేయాలని, అమెరికా కంపెనీలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని వాదిస్తున్నారు. అయినప్పటికీ, శైలేష్ నియామకం భారతీయుల గ్లోబల్ టాలెంట్‌ను మరోసారి రుజువు చేస్తోంది. Procter & Gamble CEO Shailesh Jejurikar.
ముంబైలో జన్మించిన 58 ఏళ్ల శైలేష్ జెజురికర్. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, శైలేష్ ఇద్దరు క్లాస్ మేట్స్. వీళిద్దరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత శైలేష్ ముంబై యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో బీఏ, ఐఐఎం లక్నోలో ఎంబీఏ పూర్తి చేశారు. 1989లో ఐఐఎం లక్నో నుంచి ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే పీ అండ్ జీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా చేరారు. 36 ఏళ్ల కెరీర్లో ఆయన హెల్త్ అండ్ బ్యూటీ కేర్, ఫాబ్రిక్ అండ్ హోమ్ కేర్, పీ అండ్ జీ ప్రొఫెషనల్ వంటి విభాగాల్లో నార్త్ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మార్కెట్ పెరగడానికి కీలకంగా వ్యవహరించారు. 2019లో పీ అండ్ జీ అతిపెద్ద విభాగం అయిన ఫాబ్రిక్ అండ్ హోమ్ కేర్ కు సీఈవోగా, 2021 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 2016-2021 మధ్య ఆయన పీ అండ్ జీ గ్లోబల్ సస్టైనబిలిటీ ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.
1837లో అమెరికాలో స్థాపించబడిన పీ అండ్ జీ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీలలో ఒకటి, ఇది 180 దేశాలలో వ్యాపారం సాగిస్తోంది. టైడ్, ఏరియల్, పాంపర్స్, జిలెట్, హెడ్ అండ్ షోల్డర్స్, పాంటీన్, ఓలే, విక్స్ వంటి బ్రాండ్లతో పీ అండ్ జీ గృహోపకరణాలు, పర్సనల్ కేర్, ఆరోగ్య ఉత్పత్తులను అందిస్తోంది. కంపెనీ విలువ సుమారు $84 బిలియన్లు, ఫార్చ్యూన్ 500లో 51వ స్థానంలో ఉంది. కంపెనీ ఆదాయంలో సుమారు మూడింట ఒక వంతు ఆదాయం ఫాబ్రిక్ అండ్ హోమ్ కేర్ విభాగం నుంచే వస్తోంది.
శైలేష్ జెజురికర్ నియామకం గ్లోబల్ కంపెనీలలో భారతీయ సంతతి వారి ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని పలు ప్రముఖ కంపెనీలకు భారతీయ సంతతి వ్యక్తులు సీఈవోలుగా ఉన్నారు. 2019 నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొనసాగుతున్నాయి. 2014 నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా, 2020 నుంచి ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ, 2007 నుంచి అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ్, 2008 నుంచి అరిస్టా నెట్వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్, 2017 నుంచి మైక్రాన్ టెక్నాలజీ సీఈవోగా సంజయ్ మెహ్రోత్రా కొనసాగుతున్నారు. ఇలా చాలా అంతర్జాతీయ కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు.
ట్రంప్ తన రెండవ పర్యాయంలో అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా హెచ్-1బీ వీసాలను కఠినతరం చేయాలని, అమెరికా కంపెనీలలో స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని వాదిస్తున్నారు. ట్రంప్ సపోర్ట్స్ కూడా అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే, శైలేష్ జెజురికర్ వంటి వారి నియామకాలు ఈ విధానాలకు విరుద్ధంగా భారతీయ సంతతి వ్యక్తుల సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్‌లు, వీసా పరిమితులు భారతీయ ఐటీ కంపెనీలను ప్రభావితం చేస్తున్నప్పటికీ, గ్లోబల్ కంపెనీలు భారతీయుల సామర్థ్యం, ఎమర్జింగ్ మార్కెట్లలో వారి అనుభవాన్ని విలువైనదిగా భావిస్తున్నాయి. శైలేష్ వంటి వారు అమెరికా కంపెనీలకు గ్లోబల్ మార్కెట్లలో విజయం సాధించడానికి సహాయపడతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతీయ సంతతి వారు రాబోయే రోజుల్లో సాంకేతికత, ఎఫ్ఎంసీజీ, ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎనర్జీ రంగాలలో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. పీ అండ్ జీ వంటి కంపెనీలు భారత్, ఆగ్నేయాసియా వంటి ఎమర్జింగ్ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నందున, భారతీయ నాయకులు వీటిలో వృద్ధిని నడిపించేందుకు అనుకూలంగా ఉన్నారు. ఐఐటీ, ఐఐఎం వంటి భారతీయ విద్యా సంస్థల్లో చదవిని వారు గ్లోబల్ టాలెంట్, భారతీయ డయాస్పోరా సాంస్కృతిక, వ్యాపార జ్ఞానం, వీరిని గ్లోబల్ కార్పొరేట్ నాయకత్వంలో అగ్రస్థానానికి చేరుస్తోంది. రాబోయే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాలలో భారతీయ సంతతి నాయకులు మరింత ప్రముఖంగా కనిపించవచ్చు.