
Shubhanshu Shukla Feast On Space Station: యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మరో మూడు రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు. భూమి మీదకు వ్యోమగాముల తిరుగు ప్రయాణం జూలై 14న చేపడుతున్నామని ‘నాసా’ ప్రకటించింది. భూమికి తిరిగి రావడానికి ముందు శుభాన్షు తోటి వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో ఫుడ్‌ను ఆస్వాదించారు . ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జీరో గ్రావిటీలో వారంతా సరదాగా సమయాన్ని గడిపారు.

మొత్తం మీద యాక్సియం-4 వ్యోమగాములు… 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్‌ఎస్‌లో ఒకే మిషన్‌లో ఇన్ని ప్రయోగాలు చేయడం ఒక రికార్డ్. భారత్ గగన్‌యాన్‌కు సైతం శుభాంశు మిషన్ ఉపయోగపడుతుంది. మధుమేహ నిర్వహణ, మెరుగైన క్యాన్సర్ చికిత్సలు, మానవ ఆరోగ్యం పర్యవేక్షణ పురోగతికి ఈ పరిశోధనలు కీలకంగా మారనున్నాయి.

శుక్లా మరియు మరో ముగ్గురు సిబ్బంది సభ్యుల తిరుగు ప్రయాణం జూలై 14న ప్రారంభమవుతుందని నాసా నిన్న సాయంత్రం ప్రకటించింది. Shubhanshu Shukla Feast On Space Station.
“మేము స్టేషన్ ప్రోగ్రామ్‌తో పని చేస్తున్నాము, ఆక్సియం-4 పురోగతిని జాగ్రత్తగా గమనిస్తున్నాము. ఆ మిషన్‌ను అన్‌డాక్ చేయాలని నేను భావిస్తున్నాను మరియు ప్రస్తుత లక్ష్యం జూలై 14” అని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ విలేకరుల సమావేశంలో అన్నారు.
పసిఫిక్ మహాసముద్రంలోని కాలిఫోర్నియా తీరానికి సమీపంలో, అన్‌డాక్ చేసిన కొన్ని గంటల తర్వాత స్ప్లాష్‌డౌన్ ఉంటుందని భావిస్తున్నారు.