
Jaishankar Afghanisthan Visit: రెండు దేశాల మధ్య ఎప్పుడు ఎలా స్నేహం కుదురుతుందో, అది ఎంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. సొంత అవసరాలు, రాజకీయ, భౌగోళిక పరిస్థితులే ఇక్కడ కీలకం. ఇదే క్రమంలో అఫ్గానిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్లను ఒకప్పుడు దూరం పెట్టిన భారత్ వారితో మళ్లీ సంబంధాలను పునరుద్ధరించుకుంటోంది. అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాఖీ ఈ నెల 9న భారత పర్యటనకు రానున్నారు. మన శత్రుదేశం పాకిస్థాన్‌తో తాలిబన్లకు సంబంధాలు చెడిపోవడం, అఫ్గాన్‌లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న వేళ ఆయన పర్యటనను భారత్ కీలకంగా భావిస్తోంది. భారత్ అలా భావించడానికి గల కారణాలు ఏమిటి..? ఆయన పర్యటనలో ఆంతర్యం ఏమిటి.? ఏయే ప్రయోజనాలను ఆశిస్తోంది..?
తాలిబన్ల ఏలుబడిలోని ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ లోనే ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయింది. వారు అధికారంలో వచ్చినప్పుటి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలు ఆ దేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. భారత్ వారి ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకుండా దౌత్య సంబంధాలు మాత్రం మొత్తంగా ఆపలేదు. అయితే ఇటీవల జరిగిన సిచ్చువేషన్స్ తో రెండు దేశాల బంధంలో మార్పు వస్తోంది. ఆఫ్ణాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత్ ఇప్పటికే రెండు సార్లు మాట్లాడగా చర్చల కోసం ఈ నెల తొమ్మిదిన ఆయనే భారత్ కు రానున్నారు. వాస్తవానికి గత నెలలోనే ముత్తాకి భారత పర్యటనురావాల్సిన ఉన్నా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ అభ్యంతరాలతో వీలు కాలేదు. అయితే రీసెంట్లీ పర్మిషన్ లభించడంతో ఆయన పర్యటనకు మార్గం క్లియర్ అయ్యింది. నాలుగేళ్లుగా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకుండా వారు భారత్ తో సంబంధాలను పునరుద్దరించుకోవడానికి కారణాలు మాత్రం ఉన్నాయనే చెప్పుకోవాలీ. ఇక భారత్ కూడా ఆఫ్ఘాన్ నుంచి కొన్ని ప్రయోజనాలను ఆశిస్తోందనే అనుకోవాలీ. అందుకే రెండు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి.
పహల్గాంలో పాకిస్తాన్ జరిపిన అమానుష ఉగ్రవాద దాడిని తాలిబన్లు ఖండించారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంఘ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని స్వాగతించారు. అంతకుముందు ఈ సంవత్సరం జనవరిలో విదేశాం శాఖ కార్యదర్శి విక్రం మిస్త్రీ దుబాయ్ టూర్ సందర్భంగా ముత్తాకీతో భేటీ అయ్యారు. 1996 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ చర్చలు జరపడం ఇదే ఫస్ట్ టైం. వాస్తవానికి 2021లో ఆప్ఘాన్ లో అమెరికా పాలన ముగిసిన ఉగ్ర ముద్ర కలిగిన తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆఫ్ఘాన్ లోని పరిస్థితులు గమనిస్తూనే గుంభనంగా వ్యవహరించింది. తాలిబాన్లకు మద్దతు తెలపలేదు. అలా అని వ్యతిరేకించలేదు. అయితే అధికారికంగా ఆప్ఘాన్ గుర్తించకపోయినా తాలిబాన్ నాయకత్వంతో సంబంధాలను కొనసాగించింది. రెండు దశాబ్దాలుగా ఆ దేశానికి అందిస్తున్న మానవతా సాయాన్ని ఆపలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రెజెంట్ వరకు ఆ దేశానికి 50000 మెట్రిక్ టన్నుల గోధుమలు పంపింది. ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవులోను ఆప్ఘాన్ భాగస్వామి చేయాలని భారత్ భావిస్తోంది. 2022 లో కాబుల్లో రాయభార కార్యాలయాన్ని కూడా తెరవగా ఇటీవల ఆ దేశవాసులకు వీసాల జారీ కూడా ప్రారంభమైంది.
ఇక తాలిబాన్లు తమ దగ్గరికి వస్తే భారత్ ఆహ్వానించడానికి కారణం పహల్గాం ఉగ్రవాద దాడిని వారు ఖండించడమే కాదు…మన శత్రు దేశం పాకిస్తాన్తో వారికి విబేధాలు కొనసాగుతూ ఉండడమే. పాక్, ఆఫ్ఘాన్ మధ్య సరిహద్దుగా ఉన్న డ్యూరాండ్ రేఖపై తాలిబాన్ పాలకులకు అభ్యంతరాలు ఉన్నాయి. సరిహద్దు వెంట పాక్ కంచె నిర్మించడం సైనిక నిర్మాణాలు చేపట్టడంపై తాలిబన్లు అసహనంగా ఉన్నారు. పైగా ఆఫ్ఘాన్ లు తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ లోని బలచిస్తాన్ ఖైబర్ పంతుక్వాలో ఉగ్రవాద దాడులతో పెట్రేగిపోతున్నారు. తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రసంస్థ ఈ దాడులు జరుపుతోంది. ఈ సంస్థకు తాలిబాన్ల మద్దతు ఉందని పాక్ భావిస్తోంది. ఇక ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత తాలిబాన్లు తమకు విధేయులుగా ఉండకుండా భారత్ తో ఫ్రెండ్లీగా ఉండడం మాట వినకపోవడం పాక్ కు కంటగింపుగా మారింది. ఇలా ఈ రీజన్స్ తో పాక్ కు తాలిబాన్లకు మధ్య దూరం పెరిగిపోయింది. వీటిని ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేలా భారత్ తాలిబాన్లతో శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్లు వ్యవహరిస్తోంది. ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చేపట్టడం ఇదే కోవకు చెందింది.
ఇలా ఎందుకు చేస్తుంది అంటే తాలీబాన్ కి పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మధ్య కాలంలో బాగా దెబ్బతిన్నాయి. అంతేకాదు తాలిబాన్ ఆప్ఘనిస్తాన్ సేనలు తాలిబాన్ లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఆ సేనలు అలానే పాకిస్తాన్ సేనలతో ఇద్దరు యుద్ధం అప్పుడప్పుడు తలపడం జరిగందనే అనుకోవాలీ. కాబట్టి పాకిస్తాన్ ని పూర్తిగా నమ్మలేము అని తాలిబాన్ లో ఒక కొత్ ఆలోచన విధానం వచ్చినట్లు కనబడుతుంది. కాబట్టి తాలిబాన్ వివిధ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకునే విధంగా అడుగులు ముందు వేస్తుంది. ఇక ఇదే దిశగా భారత్ ని కూడా ఒక ఫ్రెండ్ గా చూసి సంబంధాలు మెరుగుపరిచే విధంగా అడుగులు ముందుకు వేస్తుందా తాలిబాన్ అని చాలా మంది అనుకుంటున్నారు.
తాలిబాన్లతో సంబంధాలను ఆహ్వానించడానికి మరో రీజన్ చైనా ఆఫ్గాన్ లో అమెరికా సేనలు వైదొలిగి తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ చైనా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఆఫ్ఘాన్ లోని అరుదైన ఖనిజాలపై చైనా కన్నేసింది. అందుకే తాలిబన్ల ను తరచూ తమ దేశానికి ఆహ్వానిస్తూ చర్చలు జరుపుతోంది. సీపెక్ ప్రాజెక్టు లో ఆఫ్ఘాన్ భాగస్వామిని చేయాలని చైనా భావిస్తోంది. ఆఫ్ఘాన్ లో చైనా ఉనికి పెరిగితే మధ్య ఆసియాలో తన ప్రాబల్యం తగ్గుతుందని భారత్ ఆందోళన. అక్కడి వాణిజ్య మార్కె ట్లలో ప్రవేశించాలంటే భారత్ కు తాలిబాన్లు అవసరం. ఇలా ఎన్నో ప్రయోజనాలను ఆశించిన తాలిబాన్ల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లుగా కాస్త దూరం పెట్టిన వారు వస్తే ఆహ్వానిస్తోంది. ఆప్ఘాన్ తో సంబంధాలను పునరుద్దరించుకునే ప్రయత్నాలు చేస్తోంది. Jaishankar Afghanisthan Visit.
వాస్తవానికి ఆఫ్ఘాన్ 1973 లో గణతంత్ర దేశంగా అవతరించగా భారత్ నుంచి పాక్ వేరుపడిన తర్వాత ఆఫ్ఘాన్ ను తన కూటమి దేశంగా గుర్తించింది భారత్. ఈ బంధం 1996 వరకు కొనసాగింది. అప్పుడే ఈ ఆఫ్ఘాన్ లో చోటు చేసుకున్న అంతర్ యుద్దంలో పాకిస్తాన్ సాయంతో తాలిబన్లు విజయం సాధించారు. తీవ్రవాద ఎజెండా అమలు చేస్తూ మానవ హక్కుల ఉల్లంగనకు పాల్పడ్డారు. తాలిబన్లు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు ఆరంభమయ్యాయి. అయితే ఆ దేశానికి సాయాన్ని మాత్రం ఆపలేదు. 2001 -2021 మధ్య ఆ దేశంలో భారత్ 300 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఎన్నో హస్పటల్స్, రోడ్లు నిర్మించింది. ప్రస్తుతం కాబుల్ నదిపై నిర్మిస్తున్న షహతోత్ ప్రాజెక్టుకు కూడా భారత్ నిధులు అందిస్తోంది. ఇది పూర్తయితే 4వే లహెక్టార్ల వ్యవసాయ భూమికి 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఇలా సాయం కొనసాగించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు దౌత్య సంబంధాలు కొనసాగించడం చేస్తూ వచ్చింది. ఓవరాల్ గా గనుక తాలిబాన్ వాళ్ల సంకుచిత మనస్తత్వం మానేసుకుని పెద్ద ఎత్తున సమాజంలో వాళ్లు అవలంబిస్తున్న మహిళల పట్ల వాళ్లు అనుసరిస్తున్న వాళ్ల రూల్స్ ని మార్చుకున్న చాలా మంది దేశాలు తాలిబాన్ని గుర్తించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. సో భారత్ చేస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సిందే.