
Top 10 richest CM’s: రాజకీయం అన్నది ఒక సేవ. ఎలాంటి లాభేక్ష లేకుండా స్వచ్ఛంధంగా చేయాల్సిన ప్రజా సేవ. కానీ మన దేశంలో మాత్రం రాజీకీయాలు ఒక వ్యాపారంగా మారిపోయింది. డబ్బు, ఆస్తులను కూడబెట్టుకోవడానికి మాత్రమే రాజకీయం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దేశంలో రిచెస్ట్ పర్సన్సన్ వ్యాపార రంగంలో ఉన్నారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే అన్ డిస్ క్లోజుడ్ ఇన్ కమ్ . అంటే బ్లాక్ మనినీ కన్సర్డ్ చేస్తే కొందరు రాజకీయ నాయకుల సంపదన ముందు అంబానీలు, అధానీలు కూడా సరిపోరు. అందుకే మనదేశంలో రాజకీయాలకు అర్ధం ….రాజకీయాలు చేయడంలో పరమార్ధం రెండూ వేరు. రీసెంట్ గా ఒక సమస్థ రిలీజ్ చేసిన సర్వే ప్రకారం అత్యంత సంపన్నమైన సీఎంల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు టాప్ ప్లేస్ లో నిలిస్తే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాస్ట్ ప్లేస్ లో నిలిచారు. దేశంలో ఉన్న మొత్తం 30 మంది సీఎంల జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు టాప్ రిచెస్ట్ లిస్ట్ లో టాప్ 10లో చోటు సంపాదించుకున్నారు. కాబట్టి ఈ మధ్యే జరిగిన సర్వే ఏంటి..టాప్ రిచెస్ట్ లిస్ట్ లో ఉన్న టాప్ 10 సీఎంస్ ఎవరు..ప్రజా సేవలో ఉన్న ఈ నాయకులు ఇంత సంపద కూడ బెట్టటానికి కారణమైన వ్యాపారం ఏంటి…
భారత రాజకీయాల్లో ముఖ్యమంత్రుల ఆస్తులకు సంబంధించిన నివేదికలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) విడుదల చేసిన ఓ నివేదిక దేశంలో అత్యంత ధనిక, పేద ముఖ్యమంత్రులు ఎవరో తేల్చి చెప్పేసింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో పొందుపరిచిన ఆస్తుల వివరాలు ఆధారంగానే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ నివేదికను రూపొందించింది. అలా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ రూ. 931 కోట్లకు పైగా ఉంది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ. 332 కోట్లకు పైగా ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 51 కోట్లకు పైగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
ధనిక ముఖ్యమంత్రులకు పూర్తి విరుద్ధంగా తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల జాబితా కూడా ఈ నివేదికలో ఉంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ. 15.38 లక్షలకు పైగా మాత్రమే. ఇది దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకెల్లా అత్యంత తక్కువ మొత్తం. 2021 సెప్టెంబర్ 30వ తేదీన జరిగిన భొవానీపొర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా మమతా బెనర్జీ అఫిడవిట్ దాఖలు చేశారు. దాన్ని ఆధారంగా చేసుకునే ఏడీఆర్ నివేదిక ఈ ఆస్తుల వివరాలు తెలియజేసింది. అయితే 2020-21లో దాఖలు చేసిన ఆదాయం పన్ను రిటర్న్స్‌లో ఆమె కేవలం రూ.15.38 లక్షలు మాత్రమే చూపించారు.
ఇక రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 55.24 లక్షలకు పైగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూ. 1.18 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1630 కోట్లు అని నివేదిక స్పష్టం చేసింది.
దేశంలో పెరుగుతున్న ఎన్నికల ఖర్చులు తక్కువ ఆదాయం ఉన్న అభ్యర్థులకు పోటీ చేయడం మరింత కష్టతరంగా మారుతున్నాయని ADR సమన్వయకర్త ఉజ్జయిని హలీమ్ అన్నారు. ఎన్నికల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందనీ, ఎన్నికల ఖర్చులు పెరుగుతున్నాయని, అభ్యర్థి పోటీ చేయడం కష్టం అవుతోందని వ్యాఖ్యానించారు. ఇలా దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు, వారి ఎన్నికల ఖర్చులను సమగ్రంగా విశ్లేషించినట్టు తెలిపారు. Top 10 richest CM’s.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి :
ఆంధ్రప్రదేశ్ – నారా చంద్రబాబు నాయుడు : రూ.931.83 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ – పేమా ఖండూ : రూ.332.56 కోట్లు
కర్ణాటక – సిద్ధరామయ్య : రూ.51.93 కోట్లు
నాగాలాండ్ – నైఫియు రియో : రూ.46.95 కోట్లు
మధ్యప్రదేశ్ – మోహన్ యాదవ్ : రూ.42.04 కోట్లు
పాండిచ్చేరి – ఎన్. రంగస్వామి : రూ.38.39 కోట్లు
తెలంగాణ – అనుముల రేవంత్ రెడ్డి : రూ.30.04 కోట్లు
జార్ఖండ్ – హేమంత్ సోరెన్ : రూ.25.33 కోట్లు
అస్సాం – హిమంత బిశ్వ శర్మ : రూ.17.27 కోట్లు
మేఘాలయ – కాన్రాడ్ సాంగ్మా : రూ.14.06 కోట్లు
త్రిపుర – మణిక్ సాహా : రూ.13.90 కోట్లు
మహారాష్ట్ర – దేవేంద్ర ఫడ్నవీస్ : రూ.13.27 కోట్లు
గోవా – ప్రమోద్ సావంత్ : రూ.9.37 కోట్లు
తమిళనాడు – ఎం. కె. స్టాలిన్ : రూ.8.88 కోట్లు
గుజరాత్ – భుపేంద్ర పటేల్ : రూ.8.22 కోట్లు
హిమాచల్ ప్రదేశ్ – సుఖ్వీందర్ సింగ్ సుఖు : రూ.7.81 కోట్లు
సిక్కిం – ప్రేమ్ సింగ్ తమాంగ్ : రూ.6.69 కోట్లు
హర్యానా – నయాబ్ సింగ్ సైని: రూ.5.80 కోట్లు
ఢిల్లీ – రేఖ గుప్తా : రూ.5.31 కోట్లు
ఉత్తరాఖండ్ – పుష్కర్ సింగ్ ధామి : రూ.4.64 కోట్లు
మిజోరాం – లాల్దుహోమా : రూ.4.13 కోట్లు
చత్తీస్ ఘడ్ – విష్ణు దేవ్ సాయి : రూ.3.80 కోట్లు
ఒడిశా – మోహన్ చరణ్ మాఝీ : రూ.1.97 కోట్లు
బీహార్ – నితీశ్ కుమార్ : రూ.1.64 కోట్లు
ఉత్తరప్రదేశ్ – యోగి ఆదిత్యనాథ్ : రూ.1.54 కోట్లు
రాజస్థాన్ – భజన్ లాల్ శర్మ : రూ.1.46 కోట్లు
కేరళ – పినరయి విజయన్ : రూ.1.18 కోట్లు
జమ్మూ & కాశ్మీర్ – ఒమర్ అబ్దుల్లా : రూ.0.55 కోట్లు
పశ్చిమ బెంగాల్ – మమతా బెనర్జీ : రూ0.15 కోట్లు ఇలా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1632 కోట్లు అని నివేదిక స్పష్టం చేసింది.