భారత్‌పై ఇంత ద్వేషమా?

America jealous of India: అసలు ట్రంప్ మనస్సులో ఏముంది.. భారత్ విషయంలోనే ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నారా.. లేక ట్రంప్ తీరే ఇంత. ప్రపంచంలో మిత్రదేశాల మధ్య కొన్ని బంధాలు ఉంటాయి. వాటి వల్ల తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలపైనే దృష్టిపెట్టి .. ఆయా దేశాలు ఒకదానికొకటి మద్దతు ప్రకటించుకుంటాయి. రష్యా- భారత్, రష్యా-చైనా విషయంలో ఇలాంటి బంధమే ఉంటుంది. అమెరికా వంటి దేశాల నుంచి ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా అవి కలిసే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు రష్యానే కాకుండా.. అమెరికా కూడా భారత్ కు మిత్ర దేశంగానే భావించాం. కాని ట్రంప్ తీరు.. అమెరికా కుటిల బుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత్ అంటే కడుపులో ఎంత కుట్ర ఉందో ఇప్పుడు అర్థమైంది. మరి ఇలాంటి సమయంలో భారత్ ఏం చేయాలి..? టారిఫ్ ల పేరుతో ట్రంప్ మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. మనమే ట్రంప్ ను బ్లాక్ మెయిల్ చేయాలంటే ఏం చేయాలి..? ట్రంప్ టారిఫ్ ల విషయంలో భారత్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి..? ట్రంప్ కు బుద్ధి చెప్పాలంటే మనం ఏం చేయాలి..?

డొనాల్డ్ ట్రంప్.. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. భారత్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించారు. పైగా రష్యా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నందుకు అదనంగా ఫైన్ కూడా ఉందని చెప్పారు. ఇదే సమయంలో మన శత్రుదేశమైన పాకిస్థాన్ తో చమురు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. భారత్ పై సవితి తల్లి ప్రేమ కురిపిస్తూ.. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను భారతీయులు అసలు ఏ మాత్రం సహించడం లేదు. ఇప్పటి వరకు అమెరికాను ప్రపంచ దేశాల పెద్దన్నగా భావించి.. అందరూ స్నేహాన్ని కొనసాగించారు. కానీ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక.. ఇతర దేశాలను తక్కువ చేయడం.. చీప్ గా చూడటం.. తమ దయతోనే ఈ దేశాలు బతుకుతున్నట్టు చూడటం ఎక్కువైపోయింది. దీనికి అమెరికాపై ఇతర దేశాలు ఎక్కువ ఆధారపడటం కూడా ఒక కారణం. అయితే ఇప్పటి వరకు ఉన్న అమెరికా అధ్యక్షులు తమపై ఇతర దేశాలు ఆధారపడినా .. ఎవరూ ఇలా బ్లాక్ మెయిల్ చేయలేదు. సమాన గౌరవం ఇచ్చారు.. కానీ ట్రంప్ మాత్రం.. అమెరికన్ ప్రజలను సంతృప్తి పర్చడానికి అవసరమైతే ఇతర దేశాల అధ్యక్షులను పబ్లిక్ గా అవమానించడానికి కూడా వెనకడాటం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని ట్రంప్ ఈ విధంగానే అవమానించారు. అసలు ట్రంప్ తీరు ఏంటి..? ఇతడికి ఎలా బుద్ధి చెప్పాలి…? ఇప్పుడు భారత్ ఏం చేయాలి..? America jealous of India.

రష్యా- భారత్ మధ్య బంధం ఎంతో గొప్పది. ఒకదేశానికి అవసరమైనప్పుడు మరోదేశం సహాయ పడతాయి. ఎంతో నమ్మకమైన భాగస్వామ్యులు. అయితే అమెరికా మనతో మంచిగా ఉన్నా .. అంతనమ్మే పరిస్థితి లేదు. మనకు మిత్రుడిగా నటిస్తూనే మన శత్రుదేశమైన పాకిస్థాన్ కు అమెరికా సహకరిస్తోంది. ఇది ఇప్పటి విషయం కాదు. భారత్ అణుబాంబు తయారు చేసినప్పటి నుంచి అమెరికా ప్రతీ విషయంలోనూ మనకు అడ్డుపడుతూనే ఉంది. ప్రపంచంలోని ఏ దేశమూ అమెరికా కంటే పెద్దదిగా, బలంగా ఉండకూడదు. ఒక వేళ ఏ దేశమైన అలా ఎదుగుతోందని అనిపిస్తే కుట్రలు చేయడం అమెరికాకు కొత్తేం కాదు. ఎప్పుడూ తమ మోచేతి నీళ్లు తాగాలని అమెరికా భావిస్తుంది. ఒక వేళ దేశమైన తమ ఆధిపత్యానికి అడ్డుపడితే ఆంక్షలు విధించడం.. ఇతర దేశాలను పురిగొల్పి యుద్ధాలు సృష్టించడం.. అణుబాంబు తయారు చేస్తోందనే బూచి చూపించి.. ఆ దేశాలను నాశనం చేయడం అమెరికా చరిత్రలోనే ఉంది. చాలా ముస్లిం దేశాలు ఇలానే అమెరికా ఒత్తిడిలకు లొంగిపోయాయి. కొన్ని ఎదిరించి వెనక్కు తగ్గాయి. అయితే అమెరికాను మొదటినుంచి గట్టిగా ఎదుర్కొంటున్న దేశాల్లో రష్యా, చైనా ముందు వరుసలా ఉంటాయి. అమెరికా ఎన్ని కుట్రలు పన్నినా.. రష్యా, చైనా ఏ మాత్రం తగ్గలేదు. రష్యా, అమెరికాకు ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ప్రపంచ దేశాల నుంచి రష్యాను దూరం చేయాలని అమెరికా ఎన్నో కుట్రలు చేసింది. వాటిని తట్టుకుని రష్యా నిలబడింది. ఈ విషయంలో భారత్ కూడా రష్యాకు సహకరించింది. చైనా కూడా అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించింది. అందుకే చుట్టు పక్కల దేశాలతో చైనాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది అమెరికా. చైనా విషయంలో భారత్ ను అమెరికా ఓ పావుగా వాడుకుంది..

భారత్, చైనా మధ్య అసలు గొడవలు ఏంటి. సరిహద్దు సమస్యలు తప్ప రెండు దేశాల మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. రెండు దేశాలు ఆర్థిక శక్తులుగా ఎదిగేందుకు పోటీపడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో విభేదాలు తప్ప వేరే గొడవలు లేవు. ఇవే సమస్యలు చాలా సంవత్సరాల నుంచి భారత్, చైనా మధ్య అడ్డుగొడలు కట్టాయి. ఇవే సమస్యలు చైనాను పాకిస్థాన్ కు దగ్గర చేశాయి. రష్యా- భారత్ మంచి మిత్రులు, రష్యా- చైనా చాలా మంచి మిత్రులు, కాని భారత్ మాత్రం చైనాకు అంత దగ్గర కాలేదు. దీనికి చైనా పాకిస్థాన్ కు దగ్గర కావడం, అమెరికా వెనక నుంచి భారత్ ను ఎగదొయ్యడం కారణం కావొచ్చు. అమెరికా తర్వాత ఆ స్థాయిలో ఆ దేశాన్ని సవాలు చేసే దేశాల్లో చైనా, భారత్ ఉంటాయి. జనాభా ఎక్కువగా ఉండటం ఈ రెండు దేశాలకు ఒక అదనపు బలం. అందుకే చైనాను నేరుగా ఎదుర్కొంటూ.. భారత్ తో మాత్రం మంచిగా ఉంటున్నట్టు అమెరికా వ్యవహరిస్తుంది. ఏవో చిన్నచిన్న లాభాలు తప్ప.. భారీ స్థాయిలో అమెరికా ఇది మనకు చేసిన మేలు అనేలా ఒక్కటి కనిపించదు. ఈ సహాయాలు కూడా చైనా విషయంలో వ్యూహాత్మకంగా భారత్ ను వాడుకోవాలనే ఆలోచనే అమెరికా విషయంలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు టారిఫ్ విషయంలో రష్యా నుంచి భారత్ లబ్ధి పొందడాన్ని కారణంగా చూపిస్తున్న ట్రంప్.. చైనాకు దగ్గరగా ఉన్న పాకిస్థాన్ విషయంలో ఎందుకు లేదు. ఎందుకంటే పాకిస్థాన్ కంటే భారత్ వల్లే అమెరికాకు ఆధిపత్య సమస్య వస్తుంది కాబట్టి. పాకిస్థాన్ అమెరికాను ఢీకొట్టే స్థాయికి ఏ మాత్రం ఎదగలేదు. కాని భారత్ విషయం అలా కాదు.. ఆర్థికంగా చాలా ఎదుగుతోంది. మరో పదేళ్లలో భారత ప్రగతి ఊహించని స్థాయిలో ఉంటుంది. దీనికి రష్యా సహకారం కూడా ఉంది. అందుకే ట్రంప్ ఇలా భారత్ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారనే మాట వినిపిస్తోంది.

భారత్ ఇప్పుడు ఏం చేయాలి..?
అమెరికా ఆధిపత్యాన్ని.. పొగరును అణచివేయాలంటే ఒకటే పరిష్కారం. చైనా, భారత్ తమ మధ్య ఉన్న మనస్పర్థలను పక్కన పెట్టి ఏకం కావాలి. అంటే భారత్, రష్యా, చైనా కలిసి ఓ బలమైన శక్తిగా ఎదగాలి. అప్పుడే అమెరికా ఆటలు కట్టించ వచ్చు. ఇధి ఆర్థికంగా, సైనికంగా మూడు దేశాలకు ఎంతో బలం. అయితే ఇది అంత సామన్య విషయం కాదు. చైనా, భారత్ మధ్య పూర్తిగా గొడవలు చల్లారి.. ధృడమైన బంధం ఏర్పడాలంటే చాలా మార్పులు జరగాలి. ముఖ్యంగా చైనా సరిహద్దు ఆక్రమణలు వంటి చిల్లర పంచాయితీలను మానుకోవాలి. ఎంత ఎదిగినా చైనా చుట్టు పక్కల దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం పనిగా పెట్టుకుంటుంది. ఈ విషయంలోనే ఇతర సరిహద్దు దేశాలతో చైనాకు శత్రుత్వాన్ని పెంచుతోంది. భారత్ తో చైనాకు గొడవలు రావడానికి కూడా ఇదే కారణం. అయితే భారత్, చైనా రెండు తమ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పోటాపోటీగా ఎగుమతి చేస్తున్నాయి. ఇది కూడా రెండు దేశాల మధ్య కాస్త దూరాన్ని పెంచాయి. దీని వల్ల ఆర్థిక ప్రగతిపై రెండు దేశాల మధ్య కాస్త పోటీతత్వం దూరాన్ని పెంచుతోంది. అయితే సరిహద్దు సమస్యలకంటే అమెరికాను ఎదుర్కోవడమే పెద్ద అంశమని.. దీని కోసం భారత్ తో కలవాలనే ఆలోచన చైనా మదిలో రావాలి. పాకిస్థాన్ కు సహాయం చేస్తోందనే కారణంతో చైనాను దూరంగా పెట్టకుండా.. నేరుగా చైనాతో చర్చలు జరిపి దగ్గర కావాలి. అప్పుడు అమెరికా ఎలాగైన దారికొస్తుంది. ఎందుకంటే భారత్, రష్యా, చైనా కలిస్తే అమెరికా ఆధిపత్యం సాగదు.

Also Read: https://www.mega9tv.com/international/during-excavations-at-tinshemet-cave-scientists-discovered-a-burial-site-that-is-between-80000-and-120000-years-old/