
Upasana Speciality: మెగాస్టార్ కోడలు…గ్లోబర్ స్టార్ సతీమణి…అపోలో ఫౌండేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోడలిగా, బార్యగా, తల్లిగా, బిజినెస్ విమెన్ గా , సామాజిక కార్యకర్తగా ఆమె ఎన్నో రూల్స్ పోషిస్తూ స్ట్రాంగ్ విమెన్ గా సొసైటీలో ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా అప్పుడప్పుడూ విలువైన సూచనలు, సలహాలను అందిస్తుంటుంది. ప్రత్యేకంగా మహిళల కోసం స్పెషల్ మెసేజ్ లు ఇస్తుంటుంది. అయితే తాజాగా ఉపాసన షేర్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంతకీ 77 వేల కోట్ల సామ్రాజ్యానికి వారసురాలు అయిన ఉపాసన షేర్ చేసిన ఆ ఎమోషనల్ పోస్ట్ ఏంటి? అది ఎందుకు వైరల్ అయ్యింది..?
సమాజంలో ప్రతి ఒక్కరూ స్పెషల్ గా ఉండాలనుకుంటారు. అయితే ఫేమస్ అవ్వడానికి మనీ, ఫేమ్, స్టేటస్ అని ఒక్కొక్కరు ఒక్కో డెఫినేషన్ ఇస్తుంటారు. కానీ, దీనికంటూ యూనివర్సల్ గా రూల్స్ ఏమీ లేవు. చాలా మంది వారి వారి ఆలోచనలతో, పట్టుదలతో, సమాజం కోసం చేసే పనులతో ప్రత్యేకంగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు ఉపాసన. ఆమె పేరు వినగానే చాలామంది మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలో వారసురాలు అని అంటుంటారు. కానీ ఉపాసన మాత్రం తాను స్పెషల్ గా నిలవడానికి ఈ ట్యాగ్‌లకు ఏమాత్రం సంబంధం లేనిదని క్లారిటీ ఇస్తోంది. తన దృష్టిలో మాత్రం ఖాస్ గా ఉండటమంటే..సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటూ మనకి మనం విలువ ఇచ్చుకోవడమే అంటోంది ఈ స్ట్రాంగ్ లేడీ. తన గురించే కాదు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న మెంటల్ హెల్త్ సమస్యలు, మిగితా విషయాలను సైతం సోషల్ మీడియాలో ‘ది ఖాస్ ఆద్మీ పార్టీ’ అంటూ తన ఒపీనియన్స్ ను షేర్ చేసింది.
నలుగురిలో స్పెషల్ గా ఉండాలంటే డబ్బు, హోదా, పలుకుబడితో సంబంధం ఉండదంటోంది ఉపాసన. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మొదలై…కైండ్ నెస్, కరేజ్, గ్రాటిట్యూడ్ తో ఆ స్పెషాలిటీ బలపడుతుందని అంటోంది. అహంకారం కేవలం గుర్తింపును కోరుకుంటుందని. కానీ, ఆత్మగౌరవం ఆ గుర్తింపును సృష్టిస్తుందని, అహంకారం అనుబంధాన్ని వేరు చేస్తే.. ఆత్మగౌరవం కలుపుతుందని ఉపాసన చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తాన చాలా మంది తాను చాలామంది స్పెషల్ పర్సన్స్ ను కలిశానని, వారికి అస్సలు అహంకారం అనేది ఉండదని , వారు గట్టిగా మాట్లాడరని తెలిపింది. వారి సమక్షంలో అసలు అవమానం, చిన్నచూపు చూడడం వంటివి అస్సలు జరగవంటోంది . అంతే కాదు వారి దగ్గర సురక్షితంగా ఉన్నామన్న ఫీలింగ్ భావన కలుగుతుందని, అలాంటి వారు కేవలం శాంతిని కోరుకుంటారని తెలిపింది.
ఇక తాను వారసత్వంతో, వివాహ బంధంతో ఫేమస్ కాలేదంది ఉపాసన. తన లైఫ్ జర్నీలో ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లను అధిగమించానంది. అందువల్లే ఈ గుర్తింపు లభించిందని ఎమోషనల్ అయ్యింది . కొన్నిసార్లు తానపై తనకే సందేహం కలిగేదని, కొన్నిసార్లు నిరుత్సాహపడేదానినన . అయినా ఎప్పటికప్పుడు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్డడం వల్లే తాను స్పెషల్ గా నిలిచానంది ఉపాసన . తాను ఎప్పుడూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని వీడలేదని చెప్పింది. ఈ విషయాన్ని మీతో నిజాయితీగా పంచుకోవాలనే ఈ పోస్టు పెట్టా అంటూ తెలిపింది. మనమంతా కలిసి వెలుగులు నింపుకొందాం. ఒకరినొకరం ప్రోత్సహించుకుందాం. మనం ఇప్పటికే ఎంత గొప్పవారమో ఎప్పటికీ మర్చిపోవద్దు అని మహిళలకు తనదైన స్టైల్ లో ఓ మెసేజ్ ఇచ్చింది ఉపాసన . అలాగే కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న లింగ వివక్షను కూడా ఆమె ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్‌లో C-స్యూట్ పోస్టుల్లో కేవలం 17 శాతం మహిళలే ఉన్నారని, 63 శాతం సంస్థల్లో కీలక మేనేజ్‌మెంట్ స్థాయిలో మహిళలు లేరని ఆమె తెలిపింది. ఈ ఇనీక్వాలిటిని తగ్గించడానికి మహిళలు మొదట తమను తాము ప్రేమించుకోవడం, నమ్ముకోవడం చాలా అవసరమని సూచించింది. Upasana Speciality.
ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కి వైస్ చైర్‌పర్సన్‌గా ఉంది. అదే సమయంలో, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ TPA మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. అడిషనల్ గా UR Life అనే వెల్‌నెస్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఆమె స్థాపించింది. రీసెంట్ గా వ్లాగర్ కమియా జానీ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో ఉపాసన పార్టిసిపేట్ చేసింది. అందులో అపోలో హాస్పిటల్స్ మొత్తం విలువ దాదాపు 77వేల కోట్లుగా ఉందని వెల్లడైంది. మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య, అపోలో వారసురాలు అనే పేర్లకన్నా ఎక్కువగా తన ఆలోచనలతో, సమాజానికి చూపుతున్న దృక్పథంతోనే ఉపాసన స్పెషల్ గా నిలుస్తోంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q