
Ujjaini Mahankali Bonala Jathara: సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అనిల్, ఎమ్మెల్యే దానం నాగేందర్ .. ఇతర అధికారులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్..కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు.

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి భక్తులు శోభాయమానంగా బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల వేడుకకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు. Ujjaini Mahankali Bonala Jathara 2025.