
India ranks first in UPI transactions: యూపీఐ లావాదేవీల్లో భారత్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund – IMF) ‘ది రైజ్ ఆఫ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్: ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ ఆపరబిలిటీ’ పేరుతో తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా ప్రతి నెల 1800 కోట్లకు పైగా లావాదేవీలతో డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచిందని ఇందులో పేర్కొంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా 2016లో ప్రారంభించబడిన UPI.. 491 మిలియన్ వ్యక్తులు, 65 మిలియన్ వ్యాపారులను, 675 బ్యాంకులతో కలిసి అనుసంధానిస్తూ దేశంలో 85% డిజిటల్ చెల్లింపులను నిర్విరామంగా నాటి నుంచి నేటివరకు విజయవంతంగా నిర్వహిస్తోంది. గత జూన్ లో UPI ద్వారా 18.39 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి.
మేలో 18.68 బిలియన్ లావాదేవీలతో రికార్డు సృష్టించగా, ప్రపంచ రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపులలో సుమారు 50% UPI ద్వారానే జరుగుతుండటం విశేషం!
ఈ యూపీఐ సేవలు భారత్‌తో పాటు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. India ranks first in UPI transactions.
మరోవైపు బ్రిక్స్ దేశాల్లో UPI ని ప్రమాణంగా చేయాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఈ విజయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుచూపు, ప్రభుత్వ డిజిటల్ ఎకానమీ విజన్, బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీల సహకారంతో సాధ్యమైందని IMF నివేదిక తెలిపింది.
సేఫ్ అండ్ సెక్యూర్డ్, వేగవంతమైన లావాదేవీలతో యూపీఐ చెల్లింపులకు ప్రజల్లో ఆదరణ భారీగా పెరిగింది. 2016లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ సర్వీసులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటినుంచి ఏటా యూపీఐ లావాదేవీలు పెరుగుతూనే వచ్చాయి. యూపీఐ ద్వారా ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా.. ఆయా అకౌంట్లను ఒకే మొబైల్ యాప్‌లో లింక్ చేసుకునేందుకు అవకాశముంది. ఎవరు ఎవరికైనా డబ్బులు పంపడం, బిల్స్ పే చేయడం ఈజీ చేసింది.