
Konda Surekha vs Kadiyam Srihari: వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య అసమ్మతి తారా స్థాయికి చేరిందా. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతోందా. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామన్న సంతోషం కూడా లేకుండా సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్షాల చేతికి అస్త్రం ఇస్తున్నారు. అసలు కొండా దంపతులతో ఎమ్మెల్యేలకు ఉన్న వైరం ఏంటి. ఎందుకు రోజురోజుకు వర్గపోరు తీవ్రతరం అవుతోంది.లెట్స్ వాచ్.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తుంటారు. కానీ ఈ మధ్య ఆది కాస్త శృతి మించుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య జరిగిన రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న కొండా మురళి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తీవ్ర కామెంట్స్ చేశారు. కనుబొమ్మలు లేని నాయకుడు టిడిపి నీ నాశనం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. అంతటితో ఆగకుండా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీద కూడా నోరాజారారు. మొన్నటి ఎన్నికల సమయంలో తనకాళ్లు పట్టుకున్న ప్రకాష్ రెడ్డి, ఇప్పుడు తన ముందే తల ఎగరుస్తున్నారని చెప్పారు కొండా మురళి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె పోటీ చేస్తుందని ఇప్పుడే చెప్పుకొచ్చారు. అంతేకాదు, రాహుల్ గాంధీ ఫుల్ సపోర్ట్ తమకు ఉందన్న మురళి, కొండా సురేఖ మంత్రి పదవిపై ఎవ్వరూ అనుమానాలు పెట్టుకోవద్దని డైరెక్టుగా చెప్పేశారు. అలాగే మంత్రి పదవి కోసం ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ దగ్గర కడియం శ్రీహరి లాబీయింగ్ చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు మురళి.
హనుమకొండ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పోటీ చేయడం,అందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గం నేతలు సహకరించడం నచ్చని కొండా దంపతులు, వారికి వ్యతిరేకంగా పావులు కదిపినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. వరంగల్ జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో కూడా మేయర్ గుండు సుధారాణి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలకు ఆహ్వానం అందడం లేదని అందుకే ఈ గ్యాప్ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇక మేయర్ గుండు సుధారాణి చేరికను, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య చేరికను కూడా కొండా దంపతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి పంతం నెగ్గించుకోవడంతో వివాదం మరింత ముదిరినట్లు అయిందట.
ఇక చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ పాలక మండలి వ్యవహారం ఈ కాంట్రవర్సీని మరింత పెంచినట్లు అయిందట. పాలకమండలి నియామకాలు తమ వాళ్ళకంటే తమ వాళ్లకే ఇవ్వాలని పట్టుపట్టడంతో వివాదం మరింత ముదిరింది. అది పూర్తిగా సమసిపోకముందే భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం అంటూ కొండా సురేఖ ప్రకటించడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో కాంగ్రెస్ వర్గపోరు తారా స్థాయికి చేరింది. కొండా దంపతుల తో తాడోపేడో తేల్చుకుందామని ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం పరిస్తితి మరింత ముదిరినట్లు అయిందట. కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనహిత పాదయాత్ర సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరైనా కూడా కొండా దంపతులు హాజరుకాకుండా ప్రత్యేకంగా కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం,పాదయాత్రకు కూడా కొండా దంపతులు మొక్కుబడిగా హాజరు కావడంతో మరోసారి కార్యకర్తల్లో చర్చ జరుగుతోందట. Konda Surekha vs Kadiyam Srihari.
ఇక అదృష్టంతోనే నాయని రాజేందర్ రెడ్డి గెలిచాడని, వాస్తవానికి అతనికి అంత సీన్ లేదంటూ కొండా సురేఖ కామెంట్ చేయడం మరో వివాదాన్ని రేపినట్లు అయింది. దీనికి నాయని కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో వివాదం ముదరకుండా పార్టీ పెద్దలు చర్యలు తీసుకున్నారట. అదికూడా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అతిథిగా రావాల్సిన మంత్రి పొంగులేటిని హన్మకొండకు, హన్మకొండకు రావాల్సిన కొండా సురేఖను వరంగల్లుకు మార్చింది అధిష్టానం. అయితే ఉమ్మడి జిల్లాలోని ఎంఎల్ఏలు ఎవ్వరూ వరంగల్ వెళ్లకుండా హన్మకొండ సభకు వెళ్లడంతో అధిష్టానం కంగుతినిందట. ఈ పరిస్తితి మొత్తం ఉమ్మడి జిల్లాలో కొండ దంపతులు వర్సెస్ కాంగ్రెస్ ఎంఎల్ఏలు అన్న చందంగా రాజకీయం నడుస్తున్నట్లు తెలుస్తోంది.