
KTR & Ponguleti Srinivas Reddy: ఒకప్పుడు ఆ ఇద్దరు కీలక నేతలు, మంచి మిత్రులు. ఒకే పార్టీలో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. కానీ మారిన రాజకీయాలే వారి స్నేహానికి అడ్డు గీత గీశాయి. ఇప్పుడు ఒకరు అధికార పార్టీలో మంత్రి, మరొకరు ప్రధాన ప్రతిపక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్.ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇప్పడు బద్ద శత్రువుల్లా మారి,ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు.వారి మధ్య స్నేహం ఎందుకు చెడింది. ఆ నేతల మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ వెనుక దాగి ఉన్న అసలు రాజకీయ సమీకరణాలేంటి. ఈ పోరు.. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతుంది. చూద్దాం.
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న ఇద్దరు నేతల మధ్య అంతర్గత పోరు రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఎమ్మెల్యే టికెట్ల పంపిణీలో కీలకంగా వ్యవహరించిన అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్, తన కోసం పార్టీ పెద్ద కెసిఆర్ దగ్గర గట్టిగా వాదించలేదని, తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని అడ్డుకున్నారని ఆ నేత తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారట. ఈ పరిణామంతో అప్పటి వరకు మంచి మిత్రులుగా ఉన్న ఇద్దరూ ఒక్కసారిగా బద్ద శత్రువులుగా మారిపోయారు. పార్టీలో ఉన్నప్పటికీ అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టారట.
తెలంగాణాలో ఆ తర్వాత రాజకీయాలు చకచకా మారిపోయాయి. ఒక మిత్రుడు పార్టీ మారడం.. చేరిన పార్టీని రాష్ట్రంలో గెలిపించుకోవడం.. అధికారంలోకి రావడం..కీలక మంత్రి అవ్వడం.. అన్నీ వేగంగా జరిగిపోయాయి. ఆయనే.. ప్రస్తుత రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని విజయాన్ని సాధించి ప్రతి పక్షపార్టీని కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా చేశారట. ఈ ఘన విజయం తర్వాత.. ఆయనలో ఆధిపత్యం పెరిగిందట. ఇప్పుడు అదే పవర్ తో అప్పటి మిత్రుడైన కేటీఆర్ మీద మాటల యుద్ధానికి తెరలేపారట. KTR & Ponguleti Srinivas Reddy.
ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్.. కేవలం వ్యక్తిగత ద్వేషం కాదు.. ఇది రెండు ‘రాజకీయ పవర్ సెంటర్ల’ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుగా పొలిటికల్ సర్కిల్ లో చర్చకు తెర లేపింది. ఖమ్మం లాంటి బలమైన జిల్లాల్లో తమ రాజకీయ వారసత్వాన్ని, వ్యక్తిగత ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికి జరుగుతున్న పోరాటంగా భవిస్తున్నారట ఆ ఇద్దరు నేతలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు.. ఒకరు బాంబులేటి అని ఎద్దేవా చేస్తే, మరొకరు ట్విట్టర్ టిల్లు అని తిప్పి కొట్టారు. అంతేకాదు, పాలేరులో తన గెలుపును ఆపడం మీ నాన్న తరం కాలేదు, ఇక బచ్చా నువ్వెంత అంటూ పొంగులేటి నేరుగా అప్పట్లే కేటీఆర్ టార్గెట్ చేసి మాట్లాడినప్పటి నుంచే పరిస్తితి తీవ్రస్తాయికి వెళ్లినట్లు అర్థం అవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.