పార్టీలో అంతర్గత పోరు..!

The internal infighting within the party: సూర్యాపేట జిల్లాలో తాజాగా జరిగిన సీఎం సభ సాక్షిగా ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఆ నియోజక వర్గాల నేతల మధ్య పరోక్షంగా పచ్చి గడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. దశబ్దాల ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిన ఆ నేతలు ఎవరు. వారికి నేరుగా రేవంత్ రెడ్డే తలంటే వరకు వెళ్లడానికి కారణం ఏంటి. వాచ్ దిస్ స్టోరీ.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో కుమ్ములాటలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా అందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్ఏలే ఉన్నారు. సూర్యాపేటలో ఉన్న ఏకైక బిఆరెస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నియోజకవర్గంలో అంతర్గత వార్ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెడుతుందని సీఎం భావిస్తున్నారట. మూడుసార్లు సూర్యాపేటలో బిఆరెస్ ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి గెలుపు తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు బేరీజు వేస్తున్నారట. దిద్దుబాటు చర్యల్లో భాగంగా తాజాగా తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణి సభలో సూర్యాపేట కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారట. The internal infighting within the party.

తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు పలుమార్లు బయట పడుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం వర్సెస్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం మధ్య కోల్డ్ వార్ ఇంకా చల్లారలేదు. ఒకప్పుడు సూర్యాపేటలో వెలుగు వెలిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లో గట్టి పట్టుంది. అయితే గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. కోమటరెడ్డి ప్రోత్సాహంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సామేల్ టిక్కెట్ దక్కించుకున్నారు. ఆయనకు రాంరెడ్డి సహకరించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గంలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నించడం ఇప్పుడు సమస్యగా మారింది. స్థానిక పదవులపై ఎవరికి వారే లాబీయింగ్ చేస్తున్నారు.

తాజాగా తుంగతుర్తి సీఎం సభ దగ్గర దామోదర్ రెడ్డి వర్గం ఫ్లెక్సీలు చించివేయడంపై సామేల్ వర్గంపై నేరుగా ఆరోపణలు చేశారు.ఈ ఘటన పార్టీకి తీవ్ర తలవంపులు తీసుకొచ్చింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే… పార్టీ పరువు పోతుందన్న భయం అధిష్టానానికి పట్టుకుంది. దీంతో తిరుమలగిరి సభలో ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. ఓ వైపు మందుల సామెల్ మంచోడు అంటూనే సీఎం రేవంత్ క్లియర్ వార్నింగ్ ఇచ్చారట. వర్గ రాజకీయాలు మానేయాలంటూ చురకలు అంటించారట. దీంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నేతలకు గట్టి వార్నింగ్ వెళ్లినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. సూర్యాపేట జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెక్ పెట్టాలంటే వీలైనంత వేగంగా ఇంటి కుంపటిని చల్లార్చడం ముఖ్యమని అధిష్టానం భావిస్తున్నట్ుల ప్రచారం జరుగుతోంది.

Also Read: https://www.mega9tv.com/telangana/adilabad-minister-vivek-even-though-his-own-party-leaders-have-warned-him-not-to-come-into-his-constituency/