
Flight Airbags: గత కొంతకాలంగా పెరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ఫ్లైట్ యాక్సిడెంట్ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటన తర్వాత ఫ్లైట్ జర్నీలో సేఫ్టీ ఎంత అనే అంశం తేరి మీదకు వచ్చింది. సర్వేల ప్రకారం ఫ్లైట్ లో ట్రావెల్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఈ నేపథ్యంలో విమాన ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడానికి బిట్స్ పిలానీ కి చెందిన ఇద్దరు ఇంజనీర్లు సరికొత్త టెక్నాలజీ ని డెవలప్ చేశారు. ఫ్లైట్స్ కోసం ఎయిర్ బ్యాగులు అంటూ కొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. ఈ ఇద్దరి ఇన్నోవేటివ్ ఐడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? పనిచేసే విధానం ఏంటి? లెట్స్ వాచ్
ప్రమాదాలు జరిగినప్పుడు కార్లలో ఆటోమేటిగ్గా ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకునే టెక్నాలజీ ఉందని మనకు తెలుసు. అయితే సీటు బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ అవుతాయి అన్న విషయం తెలియక చాలా మంది సీటు బెల్ట్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఫ్రంట్ సీట్లోనే కాదు బ్యాక్ సీట్లో కూర్చున్నవారు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. అలా వెనుక సీట్లో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకోక వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, టాటా గ్రూపు మాజీ సారథి సైరస్ మిస్త్రీ కారు యాక్సిడెంట్ లో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇక ఈమధ్య అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు. ఈ ప్రమాదం తరువాత వరుసగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఈనేపథ్యంలో ప్రమాదం జరిగినప్పుడు కార్లలో ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకునే పద్ధతిలోనే విమానం చుట్టూ ఒక పట్టు పురుగులా ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు, ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త పడవచ్చు అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు బిట్స్ పిలానీ దుబాయ్ శాఖకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు ఎషెల్ వాసిం, దర్శన్ శ్రీనివాస్. ప్రాజెక్ట్ రీబర్త్ పేరుతో చేసిన ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రయోగ దశలో ఆశాజనకమైన ఫలితాన్ని ఇస్తోంది.
అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ క్షణాల్లో జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే కళ్ళు మూసి తెరిచేలోపు కాలి బూడిద అయ్యింది. అందుకే విమానం మూడు వేల అడుగులకంటే తక్కువ ఎత్తులో ఉండి ప్రమాదం అనివార్యమైనప్పుడు రెండు సెకెన్లలోపు ఎయిర్ బ్యాగ్ రక్షణ కవచంలా మొత్తం విమానం చుట్టూ కప్పేలా వ్యవస్థను రూపొందించారు ఈ ఇంజినీర్లు. ఇక మరోవైపు ప్రతిష్ఠాత్మక జేమ్స్ డైసన్ అవార్డ్ కోసం పోటీలో ఫైనల్స్‌కు చేరినవాటిలో ఈ ప్రాజెక్టు కూడా ఉంది . దాని అధికారిక వెబ్‌సైట్‌లో.. ఈ ప్రాజెక్ట్ రీబర్త్ మొదటి ఏఐ పవర్డ్ క్రాష్ సర్వైవల్‌సిస్టమ్ అని తెలిపారు. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని.. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదుకే ఈ సాంకేతికతను అభివృద్ధి చేశామని వీరు తెలిపారు.
ప్రాజెక్టు రీబర్త్‌లోని ఏఐ సిస్టమ్… విమానం ఎగిరే ఎత్తు, స్పీడ్, ఇంజిన్ పరిస్థితి, ఫైర్ యాక్సిడెంట్, పైలట్ రెస్పాన్స్ ఇలాంటివన్నీ పర్యవేక్షిస్తుంది. రాబోయే ఎమర్జెన్సీ పరిస్థితిని గుర్తించి తనంతట అదే నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఫ్లైట్ 3 వేల అడుగుల కన్నా ఎత్తులో ఉండి, కూలిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ తన పనిని స్టార్ట్ చేస్తుంది. ఈ స్టేజ్ లో కూడా పైలట్ తమ ఆదేశాలు ఇంప్లీమెంట్ చేయొచ్చు. ఆ సమయంలో హైస్పీడ్ ఎయిర్‌బ్యాగ్స్ అనేవి విమానం ముందుభాగం, మధ్యభాగం, తోక భాగాల్లో రెండు సెకండ్లలోనే ఓపెన్ అవుతాయి. ఇక విమానం నేలను తాకే సమయానికి ఆ బ్యాగులు మొత్తం తెరుచుకొని రక్షణ కవచంగా మారుతాయి. దీంతో చాలావరకు ప్రమదాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ విమానం భవనాలపై పడితే మరి వాటికి నష్టం జరుగుతుందా ? లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. Flight Airbags.
ఈ టెక్నాలజీ ని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న విమానాలతో సహా కొత్తగా తయారు చేసే ఫ్లైట్స్ లో కూడా కూడా తీసుకురావొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని టెస్ట్ ల కోసం ఏరోస్పేస్ ల్యాబ్స్ తో టైఅప్ అవుతామని ఈ ఇంజినీర్లు తెలిపారు. ప్రస్తుతం విమాన రంగంలో చాలావరకు ఫ్లైట్ సెక్యూరిటీ సిస్టమ్స్ విమానాన్ని కూలిపోవడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం అనేది చాలా కష్టం. కానీ తాము రూపొందించిన ఈ ప్రాజెక్ట్ రీబర్త్ .. మిగిలిన భద్రతా వ్యవస్థలు విఫలమైనప్పుడు యాక్టివేట్ అవుతుందని…దీనివల్ల ప్రయాణికులు సేఫ్ గా బయటపడేందుకు అవకాశం ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. మరికొన్ని ప్రయోగాలు జరిపి…ఏరోస్పేస్ ల్యాబ్ తో కూడా పనిచేసి…శాస్త్రీయంగా నిరూపణ కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. దీనిద్వారా ఎంతో కొంత నష్టాన్ని తగ్గించగలిగితే మంచిదే.