
Don’t Get Caught By Spy Cameras: రెగ్యులర్ గా షాపింగ్ చేసేందుకు షాపింగ్ మాల్ కి వెళ్తున్నారా…? ట్రయల్ రూమ్ లో బట్టలు ట్రై చేస్తున్నారా.. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు హోటల్ గదిలో ఉండాలనుకున్నా కొత్త ప్రాంతాల్లో వాష్రూమ్, గదులు వినియోగించుకోవాలన్నా ఇకపై ఒకటికి వందసార్లు ఆలోచించండి. ఏ మాత్రం అనుమానం ఉన్నా మొత్తం చెక్ చేయండి. అప్రమత్తంగా లేకపోతే ఆ వీడియోలను అవకాశంగా మార్చుకుని నేరగాళ్లు బెదిరింపులకు దిగే అవకాశం ఉంటుందని సైబర్ నిపుణులు అంటున్నారు.
ఇటీవలి కాలంలో సీసీ కెమెరాలు ఎక్కడపడితే అక్కడ ఉంటున్నాయి. ధర తక్కువ కావడంతో వీటి యూసేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. షాపింగ్ మాల్స్ లోని ట్రయల్ రూమ్ లు, శౌచాలయాలు, హోటల్ గదులు తదితర ప్రాంతాల్లో రహస్య కెమెరాలు పెడుతున్న సంఘటనలు ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నాం.
గమనించాల్సిన ప్రాంతాలు: స్విచ్ బోర్డులు, బల్బ్ హోల్డర్లు, స్మోక్ డిటెక్టర్, వాచీలు, గదిలో పెయింటింగ్లు, ఫొటోలు, బొమ్మలు.. ఎక్సెట్రా. Don’t Get Caught By Spy Cameras.
- రహస్య కెమెరాలను నిశితంగా పరిశీలించడంతో వాటిని గుర్తు పట్టొచ్చు. గదిలో లైట్లు పూర్తిగా ఆపేసి చీకటి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ లోని కెమెరా ఆన్ చేసి డౌట్ ఉన్న చోట చూడాలి. ఒకవేళ స్పై కెమెరా ఉంటే ఆ ప్రాంతాన్ని ఫోన్ కెమెరా గుర్తించి.. దానివైపు ఫోకస్ చేస్తుంది.
- హై కెమెరాలను గుర్తించడానికి కొన్ని యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించొచ్చు. మనం కొత్త ప్రాంతాల్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడే సమయంలో పదే పదే బీప్ సౌండ్ వచ్చినా, కాల్ లో తేడా కనిపించినా ఆ ప్రాంతంలో స్పైకెమెరాలు ఉన్నాయేమోనని అనుమానించాలి.
- రహస్య కెమెరాలను గుర్తించడంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటిలో బెస్ట్ ఇవి. ఈ రేడియో ప్రీక్వెన్సీ డిటెక్టర్లు ఈ.కామర్స్ వెబ్సైట్లలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. వీటి ప్రారంభ ధర రూ.2 వేలు. సీసీ కెమెరాలు ఏవైనా రేడియో తరంగాలను విడుదల చేస్తుంటాయి. గదిలోని వస్తువుల మధ్యలో, స్విచ్ బోర్డులు, బొమ్మలు, ఇతర ప్రాంతాల్లో రహస్యంగా అమర్చిన సీసీ కెమెరాలను ఇవి పట్టేస్తాయి.
స్పై కెమెరాలతో చిత్రీకరిస్తున్న ఉదంతాలు పెరిగిన నేపథ్యంలో పోలీసు శాఖ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. తమ హోటల్, షాపింగ్ మాల్ తదితర సముదాయాల్లో స్పై కెమెరాలు లేవని ఆయా యాజమాన్యాలు ధ్రువీకరించాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు.