
Elon Musk Xchat App Launch: నేటి టెక్నాలజీ ప్రపంచంలో మరో కొత్త సంచలనం రానుంది. ఎలాన్ మస్క్ తన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త మెసేజింగ్ ఫీచర్ అయిన XChat Appని లాంచ్ చేయనున్నారు. ఈ కొత్త చాటింగ్ విధానం ద్వారా యూజర్లు మరింత ఎక్కువ అండ్ సేక్యూర్డ్ ప్రైవసీతోపాటు డేటా సెక్యూరిటీ, చాలా సులభమైన ఇంటర్‌ఫేస్‌ను పొందుతారు.
XChat అనేది X ప్లాట్‌ఫామ్ సంబంధిత కొత్త చాటింగ్ ఫీచర్. ఇది ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో లిమిటెడ్ మందికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో వినియోగదారుల చాటింగ్, వీడియో కంటెంట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అవైలబుల్ లో ఉంటుంది. కొంత సమయం తర్వాత అదృశ్యమయ్యే(Disappear) సందేశాలను పంపేందుకు సైతం అవకాశం ఉండటం విశేషం. Elon Musk Xchat App Launch and Features.
అంతేకాదు ఎక్స్‌చాట్ ద్వారా మీరు ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి ఇకపై ఎలాంటి ఫోన్ నంబర్ అవసరం లేదంటే నమ్ముతారా? అంటే, ఇప్పుడు చాటింగ్, కాలింగ్ రెండూ కేవలం ఒక X ఖాతా ద్వారానే సాధ్యమవుతాయి అన్నమాట. ఈ ఫీచర్ అన్ని రకాల డివైజ్‌లలో పనిచేయనుంది. బలమైన ఎన్‌క్రిప్షన్, డేటా సెక్యూరిటీ, ప్రైవసీ.
- XChatని కొత్త ఎన్‌క్రిప్షన్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించినట్లు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పేర్కొనడం విశేషం!
- ఇది యూజర్ల సెక్యూరిటీ విషయంలో అసలు రాజీ పడదు. యూజర్లు తమ చాటింగ్, డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి 4 అంకెల పిన్ కోడ్‌ను సెట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది.
- మీ చాటింగ్ ఇంతకుముందు చాటింగ్, మెసేజింగ్ యాప్‌ల కంటే మరింత సురక్షితం కానుంది.
- XChat ఇంకా బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండనుంది.
- కొన్ని నివేదికల ప్రకారం, ఇందులో గ్రూప్ చాట్ ఫీచర్ కూడా రానుంది. దీంతోపాటు మీరు కోరుకుంటే, ఏదైనా చాట్‌ను చదవకుండానే వదిలిపెట్టే ఛాన్స్ ఉంది. అంటే Unread చేసే ఛాన్స్ కూడా ఉంటుంది.
- ఫైల్ షేరింగ్ ఇప్పుడు మరింత ఈజీ. ఎందుకంటే XChat ఏ రకమైన ఫైల్‌ను అయినా పంపేలా డిజైన్ చేశారు.
- ప్రస్తుతం, ఈ ఫీచర్ ప్రారంభ వెర్షన్ కొన్ని సెలెక్ట్ చేసిన చెల్లింపు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది త్వరలో అన్ని X వినియోగదారులకు అందుబాటులోకి రానుందని సంస్థ చెబుతోంది.
- XChatని మస్క్ పెద్ద ప్లాన్‌తో లాంచ్ చేయనున్నారు. మొదట చాటింగ్ యాప్, వీడియో, ఆడియో కాలింగ్ గా తీసుకురానుండగా.. తరువాత అన్ని రకాల సేవలు అందించేలా డిజైన్ చేస్తున్నారు. Xని ఒక ‘ఎవ్రీథింగ్ యాప్’ అంటే ప్రతి పని కోసం వాడే ఒకే యాప్‌గా మార్చాలనుకుంటున్నారు.
- సోషల్ మీడియా నుంచి పేమెంట్స్, కాలింగ్, చాటింగ్ ద్వారా మల్టీ ఫంక్షనల్ ప్లాట్‌ఫామ్‌గా పని చేయనుంది.
- XChat ద్వారా ఎలాన్ మస్క్ Xని కేవలం ఒక సోషల్ నెట్‌వర్క్‌గానే కాక ఆల్ ఇన్ వన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా క్రియేట్ చేయనున్నారు.
- కొత్త టెక్నాలజీతో ప్రైవసీపై ఫోకస్ చేయడంతో XChat చాటింగ్‌కు ఒక కొత్త రూపాన్ని ఇవ్వనుంది. *మీరు టెక్నాలజీ కొత్త ఫేజ్‌లో భాగం కావాలనుకుంటే, XChat కోసం సిద్ధంగా ఉండండి, గతంలో కంటే ఈజీ చాటింగ్, డేటా సేఫ్, ప్రైవసీ ఉంటుందని ఆయన క్లారిటీగా చెబుతున్నారు. సో, ఇది వాడుకలోకి వచ్చిన తర్వాత ఎలా ఉపయోగపడనుందో ప్రాక్టికల్ గా యూస్ చేసినప్పుడు తెలుస్తోంది.