ఎయిర్టెల్ కస్టమర్లకు శుభవార్త.. పెర్ ఫ్లెక్సిటీ ప్రో ఏడాది ఉచితం!

Airtel AI Perplexity Pro: ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ నయా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ తన కస్టమర్లకు ఏఐ ఆధారిత సర్వీస్ లను అందించేందుకు భారతి ఎయిర్టెల్ యూఎస్ కంపెనీ పెర్ ప్లెక్సిటీ తో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద తన 36 కోట్ల కస్టమర్లకు (మొబైల్, వైఫై, డీటూ హెచ్) పెర్ ఫ్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ ను ఏడాదిపాటు ఉచితంగా అందివ్వనుంది. సాధారణంగా దీని సబ్స్క్రిప్షన్ కాస్ట్ వచ్చేసి ఏడాదికి రూ.17 వేలవరకూ ఉంటుంది.

దీంతో ఇక ఏఐ ఆధారిత సర్వీసులైన డీప్ రీసెర్చ్, ఫైల్ అప్లోడ్, ఇమేజ్ జనరేషన్, జీపీటీ 4.1, క్లాడ్ వంటి ఏఐ మోడల్స్ ను వాడుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లో లాగిన్ అయ్యి ఈ ఆఫర్ ను ఎంచక్కా వాడుకోవచ్చు. Airtel AI Perplexity Pro కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో ఎయిర్ టెల్ కంపెనీకి ఈ పార్టనర్షిప్ సాయపడొచ్చు. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే.. ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు సంవత్సరం పాటు ఈ సబ్స్క్రిప్షను ఉచితంగా పొందొచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా కోట్ల మంది యూజర్లు పవర్ఫుల్ ఏఐ టూల్స్ ను వాడుకోవడానికి ఈ భాగస్వామ్యం సాయపడుతుందని కంపెనీ తెలిపింది. అంతేకాక భారత్ లోని విద్యార్థులు, ప్రొఫెషనల్స్, గృహిణులకు నమ్మకమైన ఏఐని అందుబాటులోకి తెస్తుందని తెలిపారు.

Also Read: https://www.mega9tv.com/technology/to-prevent-evs-from-exploding-during-the-rainy-season-follow-these-format/