విద్యార్థుల కోసం ఏడాది పాటు గూగుల్ ఏఐ ప్రోను ఫ్రీగా అందిస్తోంది..!

Google AI Pro: ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ సంస్థ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ ను దాదాపు ఏడాదిపాటు ఫ్రీగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. విద్య, ఉద్యోగ రంగాల్లో ఏఐ పాత్ర రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. టెక్ కంపెనీలు దీనిలో భాగమవ్వడానికి ప్రయత్నిస్తున్నాయనీ.. ఈ క్రమంలో జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరితో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఎంతమంది వినియోగించుకోవచ్చనే దానిపై గూగుల్ ఎలాంటి లిమిటెడ్ మెంబర్స్ కోసమేనని పరిమితి పెట్టలేదు.

ఇందుకోసం 18 ఏళ్లు, అంతకుమించి వయసు కలిగిన విద్యార్థులు ఏడాది కాలంపాటు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ తోపాటు 2 టీబీ క్లౌడ్ స్టోరేజీని పొందొచ్చు. Google AI Pro.
ఈ జెమినీ సర్వీసెస్ ను పొందేందుకు ముందుగా గూగుల్ ఆఫర్ పేజీ ద్వారా ఇండివిజువల్ గా రిజిస్టర్ చేసుకోవాలి. నమోదుకు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025.

ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత గూగుల్ లో పవర్ఫుల్ ఏఐ మోడల్ అయిన జెమినీ 2.5 ప్రోను ఉపయోగించుకోవచ్చు.

  • కాగా ఈ ప్లాన్ లో చదువుకునేందుకు, రైటింగ్, రీసెర్చ్, జాబ్ రీత్యా కావాల్సిన టూల్స్ వంటివి ఉన్నాయి.
  • ఎగ్జామ్స్, హోంవర్క్, ఎస్సే రైటింగ్, కోడింగ్, ఇంటర్వ్యూస్ కి సంబంధించి అన్ లిమిటెడ్ అకడమిక్ సపోర్ట్ ను ఇది అందివ్వడం విశేషం!
  • నోట్ బుక్ ఎల్ఎంతో ఎంచక్కా స్టడీ నోట్స్ ను తయారు చేసుకోవచ్చు.
  • జెమినీ లైవ్ టూల్ రియల్-టైమ్ కన్వర్జేషన్ కోసం ఉపయోగపడుతుంది.
  • ప్రజెంటేషన్లు, ప్రాజెక్ట్ ల కోసం గూగుల్ ఏఐ ఆధారిత వీడియో క్రియేటర్ అనే టూల్ వియో3ని కూడా ఈ ప్లాన్ లో భాగంగా యూస్ చేసుకోవచ్చు.
  • డీప్ రీసెర్చ్ టూల్ తో మనకి కావాల్సిన సమాచారాన్ని లోతుగా అధ్యయనం చేయొచ్చు.

ఈ జెమినీ అడ్వాన్స్డ్ ప్లాన్ ను బై చేయాలంటే నిజానికి రూ.19,500 ఖర్చవుతుంది. కానీ స్టడీస్ కోసం, భవిష్యత్ ప్రణాళికకు ఎక్కువమంది విద్యార్థులు ఏఐ టూల్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ ఫ్రీ సబ్ స్కిప్షన్ ప్లాన్ ను ముందుకు తీసుకొచ్చినట్లు గూగుల్ తెలిపింది. అసైన్మెంట్లు పూర్తి చేయడంలో, చక్కని రెజ్యూమె తయారు చేయడంలో విద్యార్థులకు గూగుల్ డిజిటల్ ఫ్రెండ్లీగా ఉండనుంది.

Also Read: https://www.mega9tv.com/technology/dont-get-caught-by-spy-cameras-be-careful-check-the-info-for-the-further-safety/