
Disposable domain scam: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, ఏఐ వాడకం పెరగడం వల్ల సైబర్ క్రైమ్ కూడా ఎక్కువైపోతుంది. కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులకైనా తెగిస్తున్నారు. వీటిలో డిస్పోజబుల్ డొమైన్ స్కామ్ కూడా ఒకటి.
అసలు.. డిస్పోజబుల్ డొమైన్ స్కామ్ అంటే:
ఏంటంటే.. తాత్కాలికంగా అంటే కొన్ని గంటలపాటు లేదా ఒకరోజు ఆక్టివ్ లో ఉంటూ మాయమైపోయే వెబ్సైట్ లు ఇవి. స్కామర్లు తమ పని చూసుకొని వెబ్సైట్ ను తొలగించడం ఈ స్కాం ఉద్దేశం. Disposable domain scam.
సైబర్ నేరగాళ్లు ఈ డొమైన్‌లను ఉపయోగించి నకిలీ ఇ.మెయిల్ ఐడీలు, వాస్తవంగా కనిపించే వెబ్‌సైట్‌లను క్రియేట్ చేస్తారు. తద్వారా వీటికి తప్పుడు ఓటీపీ లేదా లాగిన్ వివరాలను తస్కరించేందుకు లేదా మోసం చేసేందుకు ఉపయోగపడతాయి.
- ఈ సైట్ చూడ్డానికి అసలు సైట్‌ని పోలి ఉంటుంది. *యూజర్ నకిలీ వెబ్‌సైట్ లేదా ఇ.మెయిల్ ను అసలు కనిపెట్టలేడు.
- నిజమైన సైట్‌గా భావించి, వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన వెంటనే, స్కామర్లు వాటిని దొంగిలిస్తారు.
- ఈ వెబ్‌సైట్‌లు ఒకరోజు లేదా గంటల్లోనే అదృశ్యమవుతాయి.
- వీటిని ట్రాక్ చేయడం కూడా కష్టం. *వినియోగదారుడు తాను వీటిల్లో చిక్కుకున్నట్లు కూడా తెలియదు.
- అందువల్లే తెలియని వెబ్‌సైట్‌లో మీ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయవద్దు.
- వెబ్‌సైట్ URLని జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి.
- తాత్కాలిక ఇ.మెయిల్ ఐడీ నుంచి వచ్చిన సందేశాలపై అసలు క్లిక్ చేయవద్దు. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.
- అఫిషియల్ ప్రభుత్వ సైట్‌లలో మాత్రమే వివరాలను నమోదు చేయాలి. 2FA అంటే టూ-ఫాక్టర్ ప్రామాణీకరణను ఆన్‌లో ఉంచుకోవాలి.
- మీ పాస్‌వర్డ్, యూపీఐ పిన్‌ను వెంటనే మార్చుకోవాలి.
- వెంటనే మీ బ్యాంకు లేదా సంబంధిత సర్వీసెస్ కు ఇన్ఫామ్ చేయాలి. లేదంటే సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ అయిన www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయడం ద్వారా కంప్లయింట్ రైజ్ చేయొచ్చు.