ప్రతీది స్టేటస్ పెడితే.. మీకీ సమస్యలు తప్పవు…!

Online Status and Stories: గతంలో అమ్మాయిలకు బాధొచ్చినా, కోపమొచ్చినా ఇంట్లో అమ్మానాన్నలకూ, సన్నిహితులకూ చెప్పుకొనే వాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడంతా డిజిటల్‌ మాయాజాలం. సంతోషమైనా, దుఃఖమైనా అదంతా సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీన్నే ‘శాడ్‌ ఫిషింగ్‌’ అంటున్నారు నిపుణులు. కొంతమందైతే ఇతరుల సానుభూతి కోసమూ ఇలా చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగాల మాట అటు ఉంచితే… సమస్యలే ఎక్కువ. అసలివన్నీ బహిరంగంగా చెప్పాలా? అవసరమా? మిమ్మల్ని ట్రాప్‌ చేసే అవకాశం ఉంది.

ఆన్‌లైన్లో మీరు పెట్టే స్టేటస్‌లు మీ బలహీనతను బయటపెట్టే సాధనాలు. వీటిని ఉపయోగించుకుని మీతో మాట కలిపి ధైర్యం చెబుతున్నట్లే ప్రవర్తిస్తారు మోసగాళ్లు. భారం తగ్గుతుందని మీరూ అన్ని విషయాలు చెప్పడం మొదలుపెడతారు. అది చాలదన్నట్లు ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసే అమ్మాయిలూ ఉన్నారు. వినేవాళ్లు మంచివాళ్లైతే పర్వాలేదు. అదే మాటు వేసిన మాయగాళ్లు అయితే… కొన్నాళ్లకి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెడతారు. మీకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ తీసుకుని… కొన్నాళ్లకి డబ్బులు డిమాండ్, లైంగిక వేధింపులకు దిగుతారు.

స్టేటస్ పెట్టేసి ఎవరైనా ఏమైంది అని అడగగానే జరిగిన విషయమంతా వివరించేస్తుంటారు. తర్వాత నాలుక కరచుకుంటారు. ఈ సంగతిని సంబంధిత వ్యక్తి దగ్గర మన మాటలు చెబుతారేమో అని చివరికి ఆలోచిస్తూ కూర్చొంటారు. బయటికి కనపడదు కానీ, అది భరించలేని ఒత్తిడిని కలిగిస్తుంది.సాధారణంగా ఆడపిల్లలు భావోద్వేగాలకు గురవుతుంటారు. పరిస్థితులకు భయపడి ఎంత తొందరగా కుమిలిపోతారో అంతే ఫాస్ట్ గా నిర్ణయించుకుంటారు. వారు చేసే చిన్న పొరపాటు వారి జీవితాని శాసించేవిగా ఉండకూడదు. అందుకు బాధలో ఉన్పప్పుడు ఉన్న ప్లేస్ ని మార్చుకోవాలి… సోలో, గ్రూప్ ట్రిప్పులు ప్లాన్ చేసుకోవాలి. Online Status and Stories.

సో ఫ్రెండ్స్ ఆ టైంలో ముఖ్యంగా సోషల్‌ మీడియా, ఫోన్లకు దూరంగా ఉండండి. రెండూ అద్దం లాంటివే. మనం ఏది చూడాలనుకుంటే అదే చూపిస్తాయి. పదేపదే ఒకేతరహా కొటేషన్లు, పాటలు, నోటిఫికేషన్లు వస్తుంటాయి. మనకు తెలియకుండానే మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తుంటాయి. నచ్చాయని వాటిని స్టేటస్‌లు పెడుతుంటాం. డిప్రెషన్‌కి వెళ్లడానికి ఇవీ కారణం.

Also Read: https://www.mega9tv.com/international/600-billion-and-a-golden-gift-to-donald-trump-from-tim-cook-apple-ceo/