భారత్ లోనే ఫస్ట్ యూపీఐ ఏటీఎం.. స్కాన్ చేస్తే చాలు!!

India’s first UPI ATM: స్లైస్ బ్యాంక్ భారతదేశంలో మొట్టమొదటి UPI ఆధారిత ATMను లాంచ్ చేసింది. బెంగళూరులోని కోరమంగళలో UPI ఆధారిత బ్యాంక్ బ్రాంచ్ జులై 1న ప్రారంభించింది కాగా భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది అయ్యింది. యూపీఐ వ్యవస్థను సాంప్రదాయ బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేయడం ద్వారా కార్డులు లేకుండా నగదు లావాదేవీలను ఈజీ చేస్తోంది.

కార్డ్ లేకుండా నగదు డ్రా, డిపాజిట్:
UPI ATM ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, BHIM వంటి UPI యాప్ లతో QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా నగదు తీసుకోవడం లేదా డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ప్రత్యేకించి అవసరంలేదు.
ఏటీఎం స్క్రీన్ పై కనిపించే ‘UPI QR Cash’ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. కావలసిన మొత్తాన్ని ఎంటర్ చేసి, క్యూఆర్ కోడ్ ను UPI యాప్ తో స్కాన్ చేయాలి. ఆ తర్వాత UPI పిన్ ద్వారా ట్రాన్సాక్షన్ వెరిఫై అయ్యాక అమౌంట్ తీసుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు.

UPI ఆధారిత బ్యాంక్ బ్రాంచ్:
బెంగళూర్ లోని కోరమంగళలో ఉన్న ఈ బ్రాంచ్ భారత్ లోనే మొట్టమొదటి UPI ఆధారిత బ్యాంక్ బ్రాంచ్. తక్షణ ఖాతా ఓపెనింగ్, కియోస్క్ ఆధారిత సేవలు, UPI ద్వారా అన్ని కస్టమర్ ఇంటరాక్షన్లను ఈజీ చేస్తుంది. ఖాతా ఓపెనింగ్, నగదు డిపాజిట్, ఉపసంహరణ, ఇతర బ్యాంకింగ్ ఉత్పత్తులకు సంబంధించిన సేవలను UPI ద్వారా అందిస్తోంది. India’s first UPI ATM.

స్లైస్ సూపర్ కార్డ్:
స్లైస్ సూపర్ కార్డ్ అనేది UPI ఆధారిత క్రెడిట్ కార్డ్. ఇది జాయినింగ్ లేదా యానివర్సరీ ఫీజులు లేకుండా అందుబాటులో ఉంది. QR కోడ్ స్కాన్ లేదా UPI యాప్ ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అన్ని రకాల కొనుగోళ్లపై 3% వరకు క్యాష్ బ్యాక్, స్లైస్ ఇన్ 3 ఫీచర్ తో చెల్లింపులను మూడు వడ్డీ లేని ఇన్స్టాల్మెంట్ లుగా విభజించవచ్చు.

విస్తరణ:
UPI ATM ఏ బ్యాంక్ కస్టమర్ కైనా, UPI యాప్ ఉన్నవారందరికీ అందుబాటులో ఉంటుంది.
స్లైస్ ఈ UPI ATMలను భారతదేశంలోని 600 జిల్లాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది.

Also Read: https://www.mega9tv.com/technology/john-adrian-shepherd-barron-the-man-who-really-invented-the-cash-machine-in-1967/