
John Adrian Shepherd Barron: ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ అదేనండి ATM. ఒకప్పుడు మనీ విత్ డ్రా చేయాలంటే గంటల తరబడి బ్యాంకుల్లో క్యూలు కట్టే వారం. కానీ ఏటీఎంల పుణ్యమా ఆ టెన్షన్ తప్పింది. టైమ్ సేవ్ అవుతోంది. డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో కూడా ఏటీఎం రోజూ వారి జీవితాల్లో ఓ భాగమైపోయింది. అలాంటి ఈ మెషీన్ తయారు చేయాలన్న ఆలోచన ఎలా పుట్టిదనేది ఆసక్తికరమైన విషయం. దాని వెనుక ఓ కథే ఉంది. జాన్ షెఫర్డ్ బారన్ అనే వ్యక్తి ఈ ఏటీఎం రూపకర్త . ఓ రోజు లండన్‌లోని ఓ బ్యాంకు వద్ద నగదు కోసం ప్రజలు పోటీపడడాన్ని షెఫర్డ్ గమనించారు. తాను కూడా పర్సనల్ గా ఈ ప్రాబ్లమ్ ను ఫేస్ చేశారు. అప్పుడే తన మైండ్ లో ఏటీఎం ఆలోచన పురుడు పోసుకుంది.
ఈ క్రమంలోనే చాక్లెట్ బార్‌లను విక్రయించే వెండింగ్ మెషీన్ ఆయనకు గుర్తుకొచ్చింది. చాక్లెట్ల స్థానంలో డబ్బును ఎందుకు పెట్టకూడదు అని ఆలోచించారు. ఈ ఐడియాతో 24/7 డబ్బులను డ్రా చేసేందుకు వీలుగా ఓ యంత్రాన్ని రూపొందించారు. ఆ క్యాష్ మెషినే ఏటీఎం. అలా 1967లో లండన్‌లో ఫస్ట్ టైమ్ ఏటీఎం ఏర్పాటైంది. ఈ ఏటీఎంను బార్‌క్లేస్ బ్యాంక్ బ్రాంచ్ బయట ఏర్పాటు చేశారు. బ్రిటిష్ టీవీ నటుడు రెగ్ వార్నీ దీనిని ప్రారంభించారు. భారత్‌లో ఏటీఎం ప్రస్థానం 1987లో ప్రారంభమైంది. 2024 నాటికి దేశంలో 2 లక్షలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి. మొదట్లో కేవలం క్యాష్ విత్‌డ్రాకు మాత్రమే పని కొచ్చిన ఈ ఏటీఎంలు ఇప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, స్టేట్‌మెంట్, పిన్ జనరేషన్, కార్డు లెస్ విత్‌డ్రా వంటి సేవలను అందిస్తున్నాయి. John Adrian Shepherd Barron.