
SparkKitty A new Trojan Spy App: ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో రెండు లేదా మూడు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లలో ఏవేవో పదుల సంఖ్యలో యాప్ లు బై డిఫాల్ట్ ఉంటున్నాయి. కొన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నవి అయితే, మరికొన్ని అధికారిక గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా మనం అవసరమై డౌన్లోడ్ చేసుకుంటున్నాం. వీటితో పెద్ద రిస్క్ ఉండదులే అని ఒక్కోసారి మనం లైట్ తీసుకుంటాం. కానీ ఇవి సైలెంట్ గా మీ వ్యక్తిగత సమాచారాన్ని.. అంటే మీ ఫొటోలను స్కాన్ చేసేస్తున్నాయని తెలుసా..?!
మీ డిజిటల్ లైఫ్ కి సంబంధించిన ప్రతి చిన్న ఆధారం కోసం తెగ సెర్చ్ చేసి.. ఆ యాప్ ద్వారానే మీ మనీ వాలెట్లను టార్గెట్ చేసే పనిలో ఉంటాయని గ్రహించలేం. ఇది మీ అకౌంట్ హ్యాక్ కి గురవ్వడం లేదంటే మీకు తెలియకుండానే అకౌంట్ ఖాళీ అవ్వడం లాంటి వాటికి పాల్పడుతోంది. ఇది ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ సాధారణ సెక్యూరిటీ పర్మిట్స్ ను దాటి రిస్క్ ఫ్యాక్టర్ గా మారింది. SparkKitty A new Trojan Spy App.
చాలామంది అధికారిక ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసే యాప్ లను పక్కాగా నమ్ముతారు. ఎందుకంటే ప్రమాదకర యాప్ లకు పర్మిషన్ ఇవ్వదనే గుడ్డి నమ్మకం మనది. కానీ స్పార్క్ కిట్టీ అనే కొత్త మాల్వేర్ స్ట్రెయిన్ ఈ వెరిఫికేషన్లను క్రాస్ చేయగలిగింది. ఇక భద్రతా పరిశోధకులు దీనిని మొదట 2025 స్టార్టింగ్ లో గుర్తించారు. అప్పటినుంచి ఇవి సాధారణంగా కనిపించే యాప్ ల మాదిరిగా మారిపోయాయి. వీటిని గుర్తించకముందే కొంతమంది వేలసార్లు డౌన్లోడ్ చేసేసుకున్నారు.
అటువంటప్పుడు ఏం చేయాలంటే..
మెసేజింగ్ లేదా క్రిప్టో ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించే యాప్ లో స్పార్క్ కిట్టీ దాగి ఉంటుంది. కాబట్టి ఇన్ స్టాల్ చేసిన తర్వాత, ఇది మీ ఫోటోలను యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతుంది. చాలామంది యూజర్లు దీని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించకుండా స్కిప్ చేసేస్తారు. యాక్సెస్ ఇచ్చేస్తారు.
ఇలా ఇవ్వడం వల్ల తెరవెనుక, మాల్వేర్ టెక్స్ట్ కోసం చిత్రాలను స్కాన్ చేయడానికి ఆప్టికల్ క్యారెక్టర్ గుర్తింపును ఉపయోగిస్తుంది.
- కాబట్టి మీరు విశ్వసించే డెవలపర్ల నుంచి మాత్రమే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమం.
- ఇన్ స్టాల్ చేయడానికి ముందు యాప్ రివ్యూలు, వివరాలను తప్పక వెరిఫై చేసుకోవాలి.
- స్పష్టమైన కారణం లేకుండా మీ ఫోటోలు లేదా ఫైళ్లకు యాప్ యాక్సెస్ అడిగితే మటుకు జాగ్రత్త వహించండి.
- రికవరీ వర్డ్స్ లేదా పాస్ వర్డ్ లను మీ ఫోటో గ్యాలరీలో ఎప్పుడూ స్టోర్ చేసుకోవద్దు.
- సున్నితమైన డేటా కోసం ఎన్ క్రిప్టెడ్ స్టోరేజ్ లేదా పాస్ వర్డ్ మేనేజర్ ను ఉపయోగించడం మేలు!